hyderabadupdates.com Gallery పైల‌ట్ రోహిత్ రెడ్డి డ్ర‌గ్ పార్టీ ఏర్పాటు చేశాడు : ఎస్పీ గిరిధ‌ర్

పైల‌ట్ రోహిత్ రెడ్డి డ్ర‌గ్ పార్టీ ఏర్పాటు చేశాడు : ఎస్పీ గిరిధ‌ర్

పైల‌ట్ రోహిత్ రెడ్డి డ్ర‌గ్ పార్టీ ఏర్పాటు చేశాడు : ఎస్పీ గిరిధ‌ర్ post thumbnail image

హైద‌రాబాద్ : ఏపీ, తెలంగాణ రాష్ట్రాల‌లో సంచ‌ల‌నం రేపిన కాల్పుల ఘ‌ట‌న‌లో టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మ‌హేష్ కుమార్ యాద‌వ్ , బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైల‌ట్ రోహిత్ రెడ్డితో పాటు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసు కూడా న‌మోదు చేశారు. డ్ర‌గ్స్ ప‌రీక్ష‌ల‌లో ఎంపీతో పాటు మాజీ ఎమ్మెల్యేకు పాజిటివ్ ఉన్న‌ట్లు తేలింది. పార్ల‌మెంట్ సమావేశాల సంద‌ర్భంగా ఎంపీకి స్టేష‌న్ బెయిల్ మంజూరు కాగా పైల‌ట్ రోహిత్ రెడ్డి కి రిమాండ్ విధించింది కోర్టు. ఇక ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి పూర్తి వివ‌రాలు వెల్ల‌డించారు. ఫామ్ హౌస్ డ్రగ్ పార్టీ రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బ‌య‌ట ప‌డ్డాయి. స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్ తో పాటు మందు పార్టీ జరిగింది. ఫామ్ హౌస్ లోకి వెళ్ళగానే మొదటగా బుల్లెట్ సౌండ్ వినబడింది. వెంటనే మేమంతా అప్రమత్తమయ్యాం. తాము పోలీసుల‌మ‌ని, ఎలాంటి చ‌ర్య‌లు ఉండ‌వ‌ని ప్ర‌క‌టించాం. తాము చెప్పినా వినిపించు కోకుండా మ‌రో రెండుసార్లు బుల్లెట్ సౌండ్ వినిపించింది.
మరోవైపు మీరు కాల్చేయండి నేను మొత్తం చూసుకుంటాను ఏం జరిగినా నాదే బాధ్యత అంటూ గట్టిగా వినపడింది. మేమంతా గట్టిగా అరిచేసరికి ఒకసారిగా ఫైరింగ్ సౌండ్ నిలిచి పోయింది.మేమంతా ఒకసారిగా స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నాం. ఫామ్ హౌజ్ లోకి ఎంటర్ కాగానే వెంటనే సెర్చ్ వారెంట్లను రోహిత్ రెడ్డికి ఇచ్చాం. బాత్రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలో తుపాకిని మేము స్వాధీనం చేసుకున్నాం. బుల్లెట్ షెల్స్ పట్టుకొని మరొకరు ఉన్నారు అతని కూడా అదుపులోకి తీసుకున్నాం. ఒక మహిళతో పాటు పది మందిని అదుపులోకి తీసుకున్నాం. జ‌ర్మ‌న్ మేడ్ రివాల్వర్ పాయింట్ 32 ని స్వాధీనం పరుచుకున్నాం. 11 మందిని విడి విడిగా విచార‌ణ చేశాం. ఎవరు కూడా డ్రగ్స్ తీసుకోలేదు అని చెప్పి బుకాయించే ప్రయత్నం చేశారు. అందరినీ పదేపదే విచారించడంతో చివరికి సిల్వర్ శరత్ కుమార్ డ్రగ్స్ తీసుకున్నట్టుగా ఒప్పుకున్నాడు .అతనిని చెక్ చేసినప్పుడు రెండు గ్రాముల కొకైన్ బయట పడింది. కొకైన్ ఎవరు తెచ్చారు అనే విషయాన్ని ముందుగా అడిగితే చెప్పలేదు.
పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ని విచారించినప్పుడు కొకైన్ ఎవరు తెచ్చారనే విషయం బయట పడింది. ఈ డ్రగ్ కోసం కొంత డబ్బుని కొందరికి ఇచ్చినట్లు డ్రైవర్ ఒప్పుకున్నాడు.. కొకైన్ తానే తెచ్చానని కౌశిక్ ఒప్పుకున్నాడు. సిమ్లా బిజినెస్ ట్రిప్ కు వెళ్ళినప్పుడు తాను కోకైన్ తీసుకొని వచ్చానని చెప్పాడు. సిమ్లాలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ డ్రగ్స్ ను కొన్నట్టు తెలిపాడు. డ్రగ్ పార్టీ కోసమే కొకైన్ ను తీసుకువచ్చినట్లు కౌశిక్ చెప్పాడు. ఒక్కొక్క గ్రాముకి 15000 రూపాయలు చెల్లించి కొనుగోలు చేసినట్లు కౌశిక్ చెప్పాడు. 11 మందికి డ్రగ్ లైవ్ కిట్టు ద్వారా టెస్టులు చేశాం. అర్జున్ రెడ్డి ,కౌశిక్ రవి ,రితేష్ రెడ్డి, నమిత్ శర్మ రోహిత్ రెడ్డి లకు డ్రగ్ పాజిటివ్ వచ్చింది. కాల్పులు జరిపిన నమిత్ శర్మని అదుపులోకి తీసుకున్నాం.
పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందిన రివాల్వర్ గా గుర్తించ. ఉద్దేశ పూర్వకంగానే కాల్పులు జరిగినట్లు నమిత శర్మ చెప్పాడు. కాల్పులు జరిపి ఫామ్ హౌజ్ నుంచి తప్పించుకొని పారిపోవాలని ప్లాన్ చేశారు. కాల్పులతో పోలీసుల్ని తీవ్రంగా గాయపరచాలని అనుకున్నారు. పార్టీలో ఉన్నవాళ్లు లిక్కర్ తో పాటు డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నారు. రెండోసారి పరీక్షలు జరిగినప్పుడు ఎంపీ పుత్త మహేష్ కుమార్ కి డ్రగ్ పాజిటివ్ వచ్చింది. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయట పడింది. పైలట్ రోహిత్ రెడ్డి , రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లుగా రిపోర్ట్ వచ్చింది. ఫామ్ హౌస్ డ్రగ్ కేసులో మొత్తం ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ వచ్చింది..నమిత శర్మ, రోహిత్ రెడ్డి ,రితేష్ రెడ్డి, పుత్త మహేష్ కుమార్, అర్జున్ రెడ్డి , కౌశిక్ రవి లకు డ్రగ్ పాజిటివ్ వచ్చింది. పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ డ్రగ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు ముందుగానే సమాచారం ఇచ్చాడు.
The post పైల‌ట్ రోహిత్ రెడ్డి డ్ర‌గ్ పార్టీ ఏర్పాటు చేశాడు : ఎస్పీ గిరిధ‌ర్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

జాతీయ స్థాయిలో ఏపీ పంచాయ‌తీరాజ్ టాప్జాతీయ స్థాయిలో ఏపీ పంచాయ‌తీరాజ్ టాప్

అమ‌రావ‌తి : స్థానిక సంస్థలు స్థానిక ప్రభుత్వాలుగా మారాలి. స్వ‌యం ప్రతిపత్తి, స్వావలంబనతో ముందుకు సాగాలి . పల్లెలు జాతీయ సమగ్రత, సుస్థిరతకు మూల కేంద్రాలు కావాలి. ఇవీ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ బాధ్యతలు

Mudumal: ‘ముడుమాల్‌’కు వరల్డ్‌ హెరిటేజ్‌ ట్యాగ్‌!Mudumal: ‘ముడుమాల్‌’కు వరల్డ్‌ హెరిటేజ్‌ ట్యాగ్‌!

    తెలంగాణకు మరో ప్రపంచ వారసత్వ హోదా దక్కేలా నిపుణులు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. నారాయణపేట జిల్లా ముడుమాల్‌లోని దాదాపు మూడున్నర వేల ఏళ్ల నాటి ఆదిమానవుల స్మారక శిలల ప్రాంగణంలో నాటి మానవుల మనుగడకు సంబంధించిన ఆనవాళ్ల కోసం

డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్డ‌యేరియా , క‌ల్తీ పాల వ్య‌వహారంపై సీఎం సీరియ‌స్

అమరావతి : శ్రీకాకుళం పట్టణంలో నీటి కలుషితం కారణంగా ప్రబలిన డయేరియా, రాజమండ్రిలో కల్తీ పాల కారణంగా పలువురు చనిపోయిన ఘటనలపై సీఎం చంద్రబాబు సమీక్ష చేశారు. అసెంబ్లీలోని తన ఛాంబర్‌లో జరిగిన ఈ సమీక్షలో మున్సిపల్, ఆరోగ్య శాఖ అధికారులు