hyderabadupdates.com movies పొలిటికల్ రూటు దాసుకి కలిసొస్తుందా

పొలిటికల్ రూటు దాసుకి కలిసొస్తుందా

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కొత్త రూటు పట్టాడు. పెద్దగా హడావిడి లేకుండా షూటింగ్ చేసుకుంటూ ఆల్రెడీ ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న లెగసీ టీజర్ ఇవాళ న్యూ ఇయర్ సందర్భంగా లాంచ్ చేశారు. హారర్ మూవీ పిండంతో పరిచయమైన సాయికిరణ్ రెడ్డి రెండో సినిమా ఇది.

గత ఏడాది లైలా ఇచ్చిన డిజాస్టర్ షాకుకు విశ్వక్ సేన్ బాగా డిస్టర్బ్ అయ్యాడు. బయట కనిపించడం మానేసి ఫంకీ, లెగసీలో బిజీ అయిపోయాడు. మొదటిది ఫిబ్రవరి రిలీజ్ కు రెడీ అవుతుండగా రెండోది కూడా ఈ సంవత్సరమే ఆడియన్స్ ని పలకరించనుంది. ఇక లెగసీలో మెయిన్ కాన్సెప్ట్ రెండు నిమిషాల వీడియోలో స్పష్టంగా చెప్పేశారు.

కుటుంబాన్ని సైతం రాజకీయ స్వార్థం కోసం వాడుకోవడానికి వెనుకాడని ఒక నాయకుడు రావు రమేష్. అతను చేసే పనులకు అసహ్యం పెంచుకుని దూరంగా ఉంటాడు కొడుకు విశ్వక్ సేన్. ఒక రోజు హఠాత్తుగా తండ్రి చనిపోతాడు. దీంతో విశ్వక్ రావాల్సి వస్తుంది.

తండ్రి సమాధి మీద చేయకూడని పని చేయడానికి వెనుకాడనంత దారుణంగా ద్వేషించే విశ్వక్ పెద్దాయన వదిలిన పొలిటికల్ సామ్రాజ్యన్ని తన చేతుల్లోకి తీసుకుంటాడు. ఫ్యామిలీలో ఉన్న కలహాలు, పదవి కోసం వెంపర్లాటలు ఇలా రోజూ యుద్ధం చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. మరి ఈ గేమ్ లో ఎవరెవరు ఏమేం చేశారనేది తెరమీద చూడమంటున్నారు.

మహేష్ బాబు భరత్ అనే నేను, దగ్గుబాటి రానా లీడర్ ఛాయలు లెగసీలో కనిపిస్తున్నాయ్. అయితే వీటిలో ఒకదాంట్లో తండ్రి పాత్ర మంచిదైతే మరొకదాంట్లో అవినీతిపరుడిగా చూపించారు. లెగసీలో మాత్రం పూర్తి దుర్మార్గుడిని చేశారు.

రొటీన్ కి భిన్నంగా ఏదో ట్రై చేయాలని చూస్తున్న విశ్వక్ సేన్ ఆ మధ్య గ్యాంగ్స్ అఫ్ గోదావరి, గామితో ఎక్స్ పరిమెంట్లు చేశాడు కానీ ఆశించిన స్థాయిలో పెద్ద ఫలితాలు రాలేదు. ఈసారి నేను కాదు నా సినిమా కంటెంట్లు మాట్లాడతాయని కంకణం కట్టుకున్న విశ్వక్ సేన్ మరి ఈ లెగసీతో ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడో చూడాలి.

Related Post

పెట్టుబడుల వేటకు బాబు సెపరేట్ రూటుపెట్టుబడుల వేటకు బాబు సెపరేట్ రూటు

ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి పెట్టుబడుల వేట‌కు సిద్ధం అవుతున్నారు. ఈ నెల 19 నుంచి ఆయ‌న మూడు రోజుల పాటు దావోస్ లో ప‌ర్య‌టించ‌నున్నారు. ఈ సంద‌ర్భంగా ఏపీలో పెట్టుబడుల‌కు ఉన్న అవ‌కాశాలు.. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న రాయితీలు వంటివాటిని ప్ర‌ధానంగా

OTT Review: Karthi’s Annagaru Vostaru – Telugu Movie streaming on Prime VideoOTT Review: Karthi’s Annagaru Vostaru – Telugu Movie streaming on Prime Video

Movie Name :  Annagaru Vostaru Streaming Date : Jan 28, 2026 Streaming Platform : Amazon Prime Video 123telugu.com Rating : 2.5/5 Starring : Karthi, Krithi Shetty, Sathyaraj, Rajkiran, Anand Raj,