hyderabadupdates.com Gallery పోటెత్తిన భ‌క్త‌జ‌నం మ‌క‌ర జ్యోతి ద‌ర్శ‌నం

పోటెత్తిన భ‌క్త‌జ‌నం మ‌క‌ర జ్యోతి ద‌ర్శ‌నం

పోటెత్తిన భ‌క్త‌జ‌నం మ‌క‌ర జ్యోతి ద‌ర్శ‌నం post thumbnail image

కేర‌ళ : శ‌బ‌రిమ‌ల‌లో మ‌క‌ర జ్యోతి బుధ‌వారం సాయంత్రం 6.45 గంట‌ల‌కు మ‌క‌ర జ్యోతి ద‌ర్శ‌న ఇచ్చింది. వేలాది మంది అయ్య‌ప్ప భ‌క్తులు చేరుకున్నారు. ప‌విత్ర పుణ్య క్షేత్రంగా భాసిల్లుతూ వ‌స్తోంది. ఈసారి గ‌తంలో కంటే ఎక్కువ మంది భ‌క్తులు హాజ‌ర‌య్యారు. భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది కేర‌ళ ప్ర‌భుత్వం. ఈసారి ఆల‌యాన్ని స‌ర్వాంగ సుంద‌రంగా తీర్చిదిద్దారు. దారి పొడ‌వునా వాహ‌నాలు నిలిచి పోయాయి. ల‌క్ష‌లాది మంది భ‌క్తులు ప్ర‌పంచ వ్యాప్తంగా మ‌క‌ర జ్యోతిని ద‌ర్శించుకున్నారు. త‌మ జీవితం ధ‌న్య‌మైంద‌ని భావించారు. కొన్ని నెల‌లుగా అత్యంత నియ‌మ నిష్ట‌ల‌తో దీక్ష చేప‌ట్టిన అయ్య‌ప్ప భ‌క్తులు నేటి మ‌క‌ర జ్యోతి ద‌ర్శ‌నంతో పూర్తి చేసుకుంటారు. తిరిగి ప్ర‌యాణం అవుతారు. ఎవ‌రికీ ఇబ్బంది రాకుండా విస్తృత ఏర్పాట్లు చేయ‌డంతో భ‌క్తులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇదిలా ఉండ‌గా మ‌క‌ర జ్యోతి అనేది కీల‌కం అయ్య‌ప్ప భ‌క్తుల‌కు. ప్ర‌తి ఏటా మ‌క‌ర సంక్రాంతి రోజు సాయంత్రం వేళ ఆకాశంలో దివ్య జ్యోతి క‌నిపిస్తుంది. సాక్షాత్తు అయ్య‌ప్ప స్వామి స్వ‌యంగా జ్యోతి రూపంలో భ‌క్తుల‌ను ఆశీర్వ‌దిస్తాడ‌ని న‌మ్మ‌కం. ఈ అరుదైన అద్భుత దృశ్యాన్ని తిల‌కించేందుకు పెద్ద ఎత్తున భ‌క్తులు పోటెత్తారు. ఇక హిందువులు జ‌రిపే ముఖ్య‌మైన ఫెస్టివ‌ల్స్ ల‌లో సంక్రాంతి ఒక‌టి. పవిత్రమైన మకర జ్యోతి దర్శనం అనేది అదృష్టం ఉంటేనే క‌లుగుతుంద‌ని భ‌క్తుల ప్ర‌గాఢ విశ్వాసం. ఎన్నో జ‌న్మ‌లు ఎత్తితే కానీ ఈ దివ్య జ్యోతి ద‌ర్శ‌నం క‌ల‌గ‌ద‌ని భావిస్తారు. ఈ అపురూప‌మైన దృశ్యం కోసం గంట‌ల కొద్దీ క్యూ లైన్ లో వేచి ఉన్నారు. శ‌బ‌రిమ‌లలో పోటెత్తిన భ‌క్తుల‌ను కంట్రోల్ చేసేందుకు భ‌ద్ర‌తా సిబ్బంది నానా తంటాలు ప‌డ్డారు.
The post పోటెత్తిన భ‌క్త‌జ‌నం మ‌క‌ర జ్యోతి ద‌ర్శ‌నం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Minister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటనMinister Anitha: రాళ్లపాడులో మంత్రులు అనిత, నారాయణ పర్యటన

    దారకానిపాడుకు చెందిన తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. తిరుమలశెట్టి లక్ష్మీనాయుడు హత్య కేసు ఘటనపై హోంమంత్రి అనితను నివేదిక ఇవ్వాలని చంద్రబాబు కోరారు. కూటమి

Pawan Kalyan: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం – పవన్ కల్యాణ్Pawan Kalyan: మత్స్యకారుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యం – పవన్ కల్యాణ్

Pawan Kalyan : ఉప్పాడ తీర ప్రాంత మత్స్యకార గ్రామాల్లో సదుపాయాలు కల్పించడంతోపాటు వారి జీవనోపాధిని మెరుగుపర్చేందుకు ఉన్న అవకాశాలు అన్వేషించాలని అధికారులను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఆదేశించారు. శుక్రవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో 100

ISRO: సీఎమ్‌ఎస్‌-3 ప్రయోగానికి ఇస్రో సిద్ధంISRO: సీఎమ్‌ఎస్‌-3 ప్రయోగానికి ఇస్రో సిద్ధం

ISRO : భారీ ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధమైంది. 4,410కిలోల అత్యంత బరువైన సీఎమ్‌ఎస్‌-3 (సమాచార) ఉపగ్రహాన్ని ఆదివారం కక్ష్యలోకి చేర్చనుంది. భారత భూభాగం నుంచి గతంలో ఎన్నడూ ఇంత బరువైన ఉపగ్రహాన్ని పంపిన చరిత్ర లేదు. దీంతో ‘బాహుబలి’గా పిలిచే