hyderabadupdates.com Gallery పోలీసు వ్య‌వ‌స్థ‌ను మ‌రింత‌ బ‌లోపేతం చేస్తాం

పోలీసు వ్య‌వ‌స్థ‌ను మ‌రింత‌ బ‌లోపేతం చేస్తాం

పోలీసు వ్య‌వ‌స్థ‌ను మ‌రింత‌ బ‌లోపేతం చేస్తాం post thumbnail image

ఏలూరు జిల్లా : అభివృద్ది నినాదం, సంక్షేమం ల‌క్ష్యంగా త‌మ స‌ర్కార్ ప‌ని చేస్తోంద‌ని చెప్పారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. గురువారం ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గ పరిధిలోని పెదపాడులో నూతనంగా నిర్మించిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించారు. . ప్రజలకు రక్షణ కల్పించడంతో పాటు, పోలీసు వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే త‌మ‌ ప్రభుత్వ లక్ష్యం అని స్ప‌ష్టం చేశారు. శాంతిభద్రతల పరిరక్షణలో సాంకేతికతను జోడిస్తూ, బాధితులకు త్వరితగతిన న్యాయం అందేలా ఈ నూతన భవనం సేవలందిస్తుంద‌ని చెప్పారు.
గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతున్నాం అన్నారు. గతంతో పోలిస్తే గంజాయి అక్రమ రమణా భారీగా తగ్గింద‌న్నారు అనిత వంగ‌ల‌పూడి. ఇప్పటికే అనేక మందిని అరెస్టులు చేసి కేసులు పట్టాం అన్నారు. జగన్ వంటి అవివేకులు గురించి ఎక్కడపడితే అక్కడ ప్రస్తావించు కోవడం అనవసరం అన్నారు. మంచి కార్యక్రమాలు చేసుకునేటప్పుడు అటువంటి తెలివి తక్కువ వ్యక్తులు గురించి మాట్లాడు కోవడం అనవసరం అని పేర్కొన్నారు. ఏలూరు జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీస్ అధికారులు తీసుకోనే చర్యలు బాగున్నాయని ప్ర‌శంసించారు.
అనంత‌రం కొత్త‌గా నిర్మించిన పెదపాడు – వట్లూరు రహదారిని ఈరోజు ప్రారంభించడం ఆనందంగా ఉంద‌న్నారు అనిత వంగ‌ల‌పూడి. ఈ రహదారి అందుబాటులోకి రావడం వల్ల స్థానిక ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగు పడటంతో పాటు, రవాణా ఇబ్బందులు తొలగిపోనున్నాయ‌ని తెలిపారు. ప్రజల సౌకర్యార్థం అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింత‌మ‌నేని, బ‌డేటి చంటి, ధ‌ర్మ‌రాజు, ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ , ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
The post పోలీసు వ్య‌వ‌స్థ‌ను మ‌రింత‌ బ‌లోపేతం చేస్తాం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Trishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలుTrishul: గుజరాత్‌ తీరంలో త్రివిధ దళాల ‘త్రిశూల్‌’ విన్యాసాలు

    భారత త్రివిధ దళాలు సంయుక్తంగా తమ శక్తి సామర్థ్యాలను ప్రదర్శించాయి. ఎక్సర్‌సైజ్‌ త్రిశూల్‌ పేరిట భారత సైన్యం, నావికా దళం, వైమానిక దళం గురువారం గుజరాత్‌ లోని సౌరాష్ట్ర సముద్ర తీరంలో కలిసికట్టుగా విన్యాసాలు నిర్వహించాయి. దాదాపు గంటపాటు

టీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదుటీవీకే విజ‌య్ కి రాజ‌కీయ ప‌రిణితి లేదు

చెన్నై : అస‌లైన కాంగ్రెస్ పార్టీ త‌మ‌తోనే ఉందంటూ కామెంట్స్ చేసిన టీవీకే పార్టీ అధ్య‌క్షుడు ద‌ళ‌ప‌తి విజ‌య్ పై నిప్పులు చెరిగారు కర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి డీకే శివ‌కుమార్. ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. రాజ‌కీయ ల‌బ్ది కోస‌మే

లాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ : చంద్ర‌బాబు నాయుడులాభాల బాట పట్టిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ : చంద్ర‌బాబు నాయుడు

అమరావతి : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో విశాఖ ఉక్కు మళ్లీ లాభాల బాట పట్టింది. ఏడాదిన్నరలో అనూహ్య ప్రగతి సాధించిన రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ 2026 జనవరిలో రూ.54 కోట్ల లాభాన్ని ఆర్జించింది. సచివాలయంలో విశాఖ ఉక్కు పురోగతిపై