hyderabadupdates.com movies ప్యారడైజ్ లో ఎంతమంది విలన్లు ఓదెలా…

ప్యారడైజ్ లో ఎంతమంది విలన్లు ఓదెలా…

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని, ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న ‘ది ప్యారడైజ్’ మూవీ రోజురోజుకూ అంచనాలను పెంచేస్తోంది. కేవలం నాని మార్కెట్ మాత్రమే కాకుండా, ఈ సినిమాలో సెట్ చేస్తున్న కాస్టింగ్ చూస్తుంటే ఆడియన్స్‌కు పిచ్చెక్కుతోంది.

ముఖ్యంగా నెగిటివ్ రోల్స్ కోసం ఓదెల ఏరికోరి ఎంచుకుంటున్న నటులు సినిమాపై క్యూరియాసిటీని రెట్టింపు చేస్తున్నారు. లేటెస్ట్ గా సీనియర్ నటుడు తనికెళ్ల భరణి ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తున్నట్లు రివీల్ అవ్వడం ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

“చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక పవర్‌ఫుల్ నెగిటివ్ రోల్‌లో నటిస్తున్నాను” అంటూ తనికెళ్ల భరణి స్వయంగా వెల్లడించడం విశేషం. కెరీర్ మొదట్లో విలనిజంతో మెప్పించిన ఆయన, ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్‌కే పరిమితమయ్యారు. ఇప్పుడు మళ్ళీ ఓదెల మార్క్ రా మేకింగ్‌లో ఆయన విలనిజం ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఊహించుకోవచ్చు. ఇప్పటికే ఈ చిత్రంలో ‘డైలాగ్ కింగ్’ మోహన్ బాబు భయంకరమైన విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆయన లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

వీరితో పాటు బాలీవుడ్ యాక్టర్ రాఘవ్ జుయల్ కూడా ఈ సినిమాలో ప్రధాన విలన్లలో ఒకరిగా నటిస్తున్నారు. ‘కిల్’ సినిమాతో క్రూరమైన విలనిజాన్ని పండించిన రాఘవ్, ఇప్పుడు నానిని ఢీకొట్టడానికి రెడీ అవుతున్నారు. అయితే ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే.. నాని కూడా ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. ఒకవేళ నాని కూడా గ్రే షేడ్స్ లో ఉంటే, ఇన్ని పవర్‌ఫుల్ విలన్ క్యారెక్టర్ల మధ్య సీన్లు ఏ రేంజ్‌లో ఉంటాయో చూడాలి.

సినిమాలో ఇతర నటీనటుల విషయానికి వస్తే, బాబు మోహన్ ఒక ముఖ్యమైన సపోర్టింగ్ రోల్ చేస్తున్నారు. ‘సంపూర్ణేష్ బాబు’ నాని స్నేహితుడిగా కనిపిస్తుండగా, అది కేవలం కామెడీకే పరిమితం కాకుండా కథలో కీలకమైన మలుపుగా ఉంటుందని సమాచారం.

ఇంతమంది స్ట్రాంగ్ పర్ఫార్మర్లకు స్క్రీన్ టైమ్ ఎలా మేనేజ్ చేస్తారు అనేది దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ముందున్న పెద్ద సవాల్. కానీ ‘దసరా’లో విలన్లను ఎంత పవర్‌ఫుల్ గా ప్రెజెంట్ చేశారో చూశాక, ఓదెల ఏదో గట్టి ప్లానే చేస్తున్నాడని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు.

Related Post