hyderabadupdates.com Gallery ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు

ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు

ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు post thumbnail image

హైద‌రాబాద్ : హైడ్రా దూకుడు పెంచింది. ప్ర‌జ‌ల కోసం ఏర్పాటు చేసిన స్థ‌లాల‌లో ఆక్ర‌మ‌ణ‌లకు పాల్ప‌డ‌డ‌మే కాకుండా బ‌హుళ అంత‌స్తులు నిర్మించ‌డంపై ఫోక‌స్ పెట్టింది హైడ్రా. ఫేక్ ఎల్ ఆర్ ఎస్‌లు సృష్టించారు క‌బ్జాదారులు. అలా సృష్టించిన ఎల్ ఆర్ ఎస్‌తో భ‌వ‌న అనుమ‌తులు తీసుకున్నారు. 5 అంత‌స్తుల భ‌వ‌నాలు నిర్మాణం జ‌రిగాక మ‌ణికొండ మున్సిప‌ల్ అధికారులు ఆ స్థ‌లాలు ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన‌వ‌ని చెబుతూ త‌మ ప‌రిధిలో ఉన్న భ‌వ‌న అనుమ‌తులు ర‌ద్దుచేశారు. నేరుగా హెచ్ ఎం డీఏ నుంచి అనుమ‌తులు తీసుకున్నందున మ‌రో భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు ర‌ద్దు చేయాలంటూ హెచ్ ఎం డీఏకు మ‌ణికొండ మున్సిప‌ల్ అధికారులు లేఖ‌ రాశారు. ఇవ‌న్నీ అయ్యేలోపు గృహ ప్ర‌వేశం చేసేయాల‌న్నంత వేగంగా నిర్మాణాలు జ‌రిగి పోయాయి. ఇంత‌లో అక్క‌డి నివాసితులు హైడ్రాను ఆశ్ర‌యించారు. ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించిన స్థ‌లాల్లో రెండు, 5 అంత‌స్తుల భ‌వ‌నాల నిర్మాణాలు జ‌రిగిపోతున్నాయ‌ని… ఆ అనుమ‌తుల‌ను ర‌ద్దు చేసినా నిర్మాణాలు ఆగ‌డంలేద‌ని స్థానికులు ఫిర్యాదు చేశారు.
ఇక హైడ్రాకు ఫిర్యాదు వ‌చ్చింద‌ని తెలుసుకున్న నిర్మాణ‌దారులు… కోర్టును ఆశ్ర‌యించారు. ఇదేదో విష‌యం తెలుసు కోవాల‌ని హైడ్రాను హైకోర్టు ఆదేశించింది. భ‌వ‌న నిర్మాణ ప‌నుల‌ను వెంట‌నే ఆపాల‌ని హైకోర్టు నేరుగా చెప్ప‌లేద‌న్న నెపంతో నిర్మాణ ప‌నుల‌ను మ‌రింత వేగం చేశారు. నిర్మాణాలు చేప‌ట్టిన వారితో పాటు.. అక్క‌డి నివాసితుల‌ను, ఫిర్యాదు దారుల‌ను హైడ్రా పిలిపించి విచారించింది. హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ పూర్తి వివ‌రాలు తెలుసుకున్నారు. ప‌నులు జ‌ర‌కుండా అ రెండు భ‌వ‌నాల‌ను సీజ్‌చేయాల‌ని ఆదేశించారు. ఈ మేర‌కు హైడ్రా ఆ రెండు భ‌వ‌నాల‌ను సీజ్ చేసి ఫెన్సింగ్ వేసింది.
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర‌న‌గ‌ర్ మండ‌లం నెక్నాంపూర్ విలేజ్‌లోని మ‌ణికొండ మున్సిపాలిటీ ప‌రిధిలోని వెంక‌టేశ్వ‌ర కాల‌నీ హెచ్ ఎండీఏ లే ఔట్ అది. ఇందులో ప్ర‌జావ‌స‌రాల‌కు ఉద్దేశించి 300ల గ‌జాల చొప్పున 4 ప్లాట్లు కేటాయించారు. ఆ నాలుగుతో పాటు.. ప‌క్క‌నే ఉన్న మ‌రి కొంత క‌లిపి దాదాపు 1500ల గ‌జాల వ‌ర‌కూ స్థ‌లాన్నిచూపించి.. ఫేక్ ఎల్ ఆర్ ఎస్‌తో మ‌ణికొండ మున్సిపాలిటీలో భ‌వ‌న నిర్మాణ అనుమ‌తులు పొందారు. ఇక్క‌డ జీ ప్ల‌స్ 5 అంత‌స్తుల భ‌వ‌నాన్ని నిర్మించారు. ఇదే లే ఔట్‌లో సెప్టిక్ ట్యాంకు/ పార్కు స్థ‌లంగా కేటాయించిన దాదాపు 2 వేల గ‌జాల స్థ‌లంలో మ‌రో ప్ర‌బుద్ధుడు ఎల్ ఆర్ ఎస్‌తో పాటు.. భ‌వ‌న నిర్మాణ అనుమ‌తుల‌ను నేరుగా హెచ్ ఎండీఏ నుంచే తీసుకున్నారు. ఇక జెట్ స్పీడులో నిర్మాణాలు చేస్తున్నారు.
The post ప్ర‌జావ‌స‌ర స్థ‌లాల్లో 5 అంత‌స్తుల భ‌వ‌నాలు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

పశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరటపశు సంవర్ధక రంగానికి స‌ర్కార్ భారీ ఊరట

అమరావతి : రాష్ట్రంలో పశు సంవర్ధక రంగాన్ని బలోపేతం చేస్తూ పశు పోషకులు, చిన్న రైతులకు పెద్ద ఎత్తున ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర వ్యవసాయ, పశుసంవర్ధక శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జారీ

ఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యంఒలింపిక్స్ లో స్వ‌ర్ణం గెల‌వ‌డం ల‌క్ష్యం

ముంబై : ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ ను గెలుచుకున్న అనంత‌రం జ‌ట్టు కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ త‌న స్వంత స్థ‌లం ముంబైకి చేరుకున్నాడు. ఈ సంద‌ర్బంగా గ్రాండ్ వెల్ కం ల‌భించింది. రాష్ట్ర స‌ర్కార్ త‌ర‌పున త‌న‌కు ఘ‌నంగా

Kinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణంKinjarapu Rammohan Naidu: భారత్‌ సహాయంతో మాల్దీవుల్లో విమానాశ్రయం నిర్మాణం

    భారత ప్రభుత్వం అందించిన లైన్‌ ఆఫ్‌ క్రెడిట్‌ సహకారంతో మాల్దీవుల్లో హనిమాధూ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మించారు. దానిని ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్‌ ముయిజ్జు, భారత పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌ నాయుడు సంయుక్తంగా ప్రారంభించారు. ప్రపంచంతో