hyderabadupdates.com movies ప్రజా సమస్యలపై కలెక్టరేట్ కు వల్లభనేని వంశీ

ప్రజా సమస్యలపై కలెక్టరేట్ కు వల్లభనేని వంశీ

గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ మరోసారి ప్రజల్లో చురుకుగా కనిపించారు. పలు కేసుల్లో రిమాండ్ జీవితం గడిపి బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు. తాజాగా జిల్లా కలెక్టరేట్‌ను సందర్శించి ప్రజా సమస్యలపై పీజీఆర్ఎస్ ద్వారా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు.

బాపులపాడు మండలం మల్లవల్లి గ్రామంలో నిర్మాణం పూర్తయి పంపిణీకి సిద్ధంగా ఉన్న 2,400 ఇళ్ల పట్టాలను లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని వంశీ డిమాండ్ చేశారు. అర్హులైన కుటుంబాలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం ఆలస్యం చేయడం వల్ల పేదలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఇళ్ల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్‌ను కోరారు.

అలాగే గన్నవరం విమానాశ్రయ విస్తరణ కోసం భూములు కోల్పోయిన రైతుల సమస్యలను ప్రస్తావించారు. గతంలో అమరావతిలో ఇస్తామని హామీ ఇచ్చిన ఇళ్ల పట్టాలను తక్షణం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. భూములు కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్న రైతులకు న్యాయం జరగాలని, వారి పునరావాస ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. రైతుల తరఫున తాను పోరాటం కొనసాగిస్తానని తెలిపారు.

వైసీపీ ఓటమి అనంతరం తీవ్ర అవినీతి ఆరోపణలు, పలు కేసులు ఎదుర్కొన్న వంశీ సుమారు 138 రోజులు జైలు జీవితం గడిపారు. ఆ సమయంలో ఆరోగ్య సమస్యలు కూడా ఎదుర్కొన్నట్లు తెలిసింది. అనంతరం బెయిల్ లభించడంతో కొంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. అయితే ఆరు నెలల తర్వాత మళ్లీ ప్రజల్లోకి వస్తానని ప్రకటించిన ఆయన, ఇటీవల వైఎస్ జగన్ జగ్గయ్యపేట పర్యటనలో పాల్గొనడం ద్వారా రాజకీయ రంగంలో తన ఉనికిని చాటుకున్నారు.

ఇప్పటికీ కొన్ని కేసుల్లో విచారణ కొనసాగుతుండగా, నిబంధనల ప్రకారం వారానికి ఒకసారి పోలీస్ స్టేషన్‌కు వెళ్లి సంతకాలు చేస్తున్నట్లు సమాచారం. రాజకీయాలకు గుడ్‌బై చెబుతారన్న ప్రచారం నడుమ, జగన్ ఇచ్చిన భరోసాతో తిరిగి కార్యాచరణలోకి వచ్చినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గన్నవరం నియోజకవర్గంలో బంధువులు, అభిమానులను కలుసుకుంటూ మద్దతు కోరుతున్న వంశీ, మళ్లీ స్థానిక రాజకీయాల్లో పట్టు సాధించేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు కనిపిస్తోంది.

Related Post

8 New Hollywood OTT Releases This Week: F1, Superman to Percy Jackson 2, Knives Out 38 New Hollywood OTT Releases This Week: F1, Superman to Percy Jackson 2, Knives Out 3

Cast: Daniel Craig, Josh Brolin, Josh O’Connor Director: Rian Johnson Language: English Genre: Mystery thriller Release date: December 12, 2025 Detective Benoit Blanc investigates a locked-room murder inside a remote

హీరోయిన్ల రెమ్యూనరేషన్ పై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలుహీరోయిన్ల రెమ్యూనరేషన్ పై కీర్తి సురేష్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ రంగంలో హీరోయిన్లతో పోలిస్తే హీరోలకు పారితోషకాలు ఎక్కువ ఉంటుందన్నది కొత్త విషయం కాదు. ఓవైపు ఒక స్టార్ హీరో రూ.50 కోట్లు పుచ్చుకుంటుంటే.. అదే సినిమాలో నటించే స్టార్ హీరోయిన్‌కు అందులో నాలుగో వంతు కూడా ఇవ్వరన్న విషయం తెలిసిందే.