hyderabadupdates.com movies ప్రదీప్ మీద నమ్మకం పెద్దదే డ్యూడ్

ప్రదీప్ మీద నమ్మకం పెద్దదే డ్యూడ్

ఎల్లుండి విడుదల కాబోతున్న డ్యూడ్ మీద మైత్రి మూవీ మేకర్స్ గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. ప్రెస్ మీట్ లో లెక్కలతో సహా వివరించి తామెంత కాన్ఫిడెంట్ గా ఉన్నామో చెప్పడం చూస్తే ప్రదీప్ రంగనాథన్ మార్కెట్ ఎంత పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తెలుగు వెర్షన్ వరకు చూసుకుంటే ఎంటర్ ది డ్రాగన్ పన్నెండు కోట్ల దాకా షేర్ తీసుకురాగా ఈసారి డ్యూడ్ కి దానికంటే ఎక్కువే వస్తుందనే అంచనాలు ట్రేడ్ లోనూ ఉన్నాయి. కాకపోతే కాంపిటీషన్ స్ట్రాంగ్ గా ఉండటంతో ఎంత మేరకు లోకల్ పోటీని తట్టుకుంటుందనేది కీలకంగా మారింది. అయితే మైత్రికి ఏపీ తెలంగాణ కన్నా తమిళనాడు బిజినెస్ చాలా ముఖ్యం.

ఎందుకంటే ప్రదీప్ రంగనాథన్ తమిళనాట ప్రామిసింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. ధనుష్, విజయ్ సేతుపతి తర్వాత తననే నెక్స్ట్ యూత్ ఆప్షన్ గా చూస్తున్నారు. దానికి తగ్గట్టే బుకింగ్స్ మొదలుపెట్టిన నిమిషాల వ్యవధిలోనే చెన్నై సహా కీలక ప్రాంతాల టికెట్ల అమ్మకాలు ట్రెండింగ్ లో వచ్చేశాయి. సాలిడ్ నెంబర్స్ ఖాయం. ఇక్కడైతే బరిలో నాలుగు ఉన్నాయి కానీ కోలీవుడ్ లో డ్యూడ్ ని మించినవి రేస్ లో లేవు. ధృవ్ విక్రమ్ బైసన్ మీద కంటెంట్ పరంగా అంచనాలున్నాయి కానీ యూత్ లో అంతగా క్రేజ్ లేదు. సీరియస్ నెరేషన్ కావడంతో వినోదం కోరుకునే వాళ్ళు ముందు ప్రాధాన్యం ఇచ్చేది డ్యూడ్ కే.

ఒరిజినల్ వెర్షన్ ఓ అరవై కోట్లు తెచ్చేస్తే డ్యూడ్ సేఫ్ జోన్ లోకి వెళ్ళిపోతుంది. ఆ అవకాశాలు లేకపోలేదు. తెలుగులో ఎంత వచ్చినా అది బోనస్ అవుతుంది. మైత్రి స్వంత పంపిణి కాబట్టి లాభనష్టాలు రెండు భాషలు కలిపి లెక్క వేసుకుంటారు. ఆ కోణంలో చూసుకుంటే డ్యూడ్ మొదటి షో పడక ముందే టేబుల్ ప్రాఫిట్స్ లో ఉంది. నాన్ థియేట్రికల్ రేట్ గట్టిగా పలికింది. శాటిలైట్ కూడా ఆలస్యం కాలేదు. కేవలం మూడు సినిమాలకే ఇంత స్థాయి అందుకోవడం విశేషమే. ఇదంతా డిసెంబర్ లో రిలీజ్ కాబోయే ప్రదీప్ మరో సినిమా లవ్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఉపయోగపడనుంది. డ్యూడ్ హిట్టయితే దానికి రేట్లు పెరుగుతాయి.

Related Post

రజినికాంత్ సినిమా వదులుకున్న దర్శకుడురజినికాంత్ సినిమా వదులుకున్న దర్శకుడు

సూపర్ స్టార్ రజినీకాంత్ ని డైరెక్ట్ చేయడం కంటే గొప్ప అవకాశం ఏముంటుంది. అందులోనూ కమల్ హాసన్ నిర్మాతగా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. కొద్దిరోజుల క్రితం సుందర్ సి దర్శకత్వంలో ఈ కాంబో నుంచి ఒక ప్యాన్ ఇండియా మూవీ

అలియా సినిమాకు రాకూడని కష్టంఅలియా సినిమాకు రాకూడని కష్టం

స్పై యూనివర్స్ పేరుతో తీసిన కథనే మళ్ళీ మళ్ళీ తీస్తూ క్యాష్ చేసుకోవాలని చూసిన యష్ రాజ్ ఫిలింస్ కు వార్ 2 పెద్ద స్ట్రోక్ ఇచ్చింది. హృతిక్ రోషన్ – జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ కాబట్టి కథా కథనాలు ఎలా