hyderabadupdates.com Gallery ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి post thumbnail image

విజ‌య‌వాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె కేంద్ర స‌ర్కార్ ను, ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. దేశంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని, కేవ‌లం స్వ‌ప్ర‌యోజ‌నాలకే పెద్ద‌పీట వేస్తున్నారంటూ ఆరోపించింది. ఇవాళ విజ‌య‌వాడ‌లో ష‌ర్మిలా రెడ్డి మీడియాతో మాట్లాడారు. మహిళా బిల్లుపై రంగులు మార్చడంలో నరేంద్ర మోదీజీ అభినవ ఊసరవెల్లిగా మారి పోయాడ‌ని సంచ‌ల‌న వ్యాఖ‌లు చేశారు. ⁠నారీ ముసుగులో డీ లిమిటేషన్ బిల్లు తెచ్చిన కపట సూత్రధారి అని ఆరోపించారు. ⁠ప్రతిపక్షాలపై ప్రధాని పెట్టేవి పెడబొబ్బలు త‌ప్పా మ‌రోటి కాద‌న్నారు. మహిళా శక్తిని అడ్డుకున్నారని బీజేపీ ముసలి కన్నీరు. కార్చ‌డం దారుణ‌మ‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని పేర్కొన్నారు.
⁠33 శాతం రిజర్వేషన్ల అమలుకు అసలు ద్రోహి మోడీనేని వైఎస్ ష‌ర్మిలా రెడ్డి ఆరోపించారు. ⁠2023 లో ఆమోదం పొందిన బిల్లును అమలు చేయకుండా, మళ్లీ పార్లమెంట్ ముందుకు సవరణ బిల్లు తెచ్చి.. ⁠దానికి పునర్విభజనతో లింక్ పెట్ట‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు. ⁠ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని బీద ఏడుపులు ఎందుకు ? మహిళలను మన్నించమని అడగడం ఎందుకు ?
⁠రాజకీయ స్వలాభం కోసం విపక్షం మీద శాపనార్థాలు పెట్టడం ఎందుకు ? అని నిల‌దీశారు. ప్రధాని మోడీ కి 33 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని చిత్తశుద్ధి ఉంటే, ⁠మహిళల ఆత్మ గౌరవం మీద పట్టింపు ఉంటే నారీ శ‌క్తి వంద‌న అభియాన్ 2024 చ‌ట్టాన్ని వెంట‌నే అమ‌లు చేయాల‌ని డిమాండ్ చేశారు.
The post ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ అభిన‌వ ఊస‌రవెల్లి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

Kurnool: కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతిKurnool: కర్నూలు బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురి మృతి

    కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో 19 మంది సజీవ దహనమైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ ఇవాళ తెల్లవారుజామున బస్సు బైకును ఢీ కొట్టి అగ్ని ప్రమాదానికి గురైంది. ప్రమాద

నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్నీటి భద్రత కోసం జలధార యాక్షన్ ప్లాన్

అమరావతి : పోలవరం ప్రాజెక్టు పూర్తి కాగానే గోదావరి జలాలను కుడి, ఎడమ కాలువల ద్వారా తరలించి వాటిని ఏయే అవసరాలకు, ఎంత మేర వినియోగించు కోవాలనే దానిపై ఓ నిర్దుష్టమైన యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు.