హైదరాబాద్ : దర్శకుడు మారుతి సీరియస్ కామెంట్స్ చేశాడు. ప్రభాస్ , మాళవిక మోహన్, రిద్దీ కుమార్, నిధి అగర్వాల్ , సంజయ్ దత్ తో కలిసి ది రాజా సాబ్ తీశాడు. దీనిని పీపుల్స్ మీడియా నిర్మించింది. భారీ బడ్జెట్ తో తీసినా ఆశించిన మేరకు పాజిటివ్ స్పందన రాలేదు. ఈ సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ చిత్రం. తన సినిమా బాగున్నా కావాలని తమను లక్ష్యంగా చేసుకుని దుష్ప్రచారం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు మారుతి. సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ పై తీవ్ర ఆవేదన చెందాడు. విమర్శలను ఉద్దేశించి భావోద్వేగ, ఆత్మ పరిశీలనాత్మక గమనికను పంచుకున్నారు. ఆన్‌లైన్ ఎగతాళి మంచి పద్దతి కాదన్నాడు. ఇదిలా చాలా బాధాకరం అని పేర్కొన్నాడు.
ఎవరూ కావాలని సినిమా పాడు కావాలని కోరుకోడని అన్నాడు మారుతి. ప్రతి సినిమాను అంచనాలకు మించి తీయాలని పరితపిస్తూనే ఉంటామని పేర్కొన్నాడు. బుధవారం సోషల్ మీడియా వేదికగా కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మూడు సంవత్సరాల పాటు తాము సినిమా తీసేందుకు కష్ట పడ్డామని, కానీ కొందరు పనిగట్టుకుని తమను లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తూ వచ్చారని వాపోయాడు. సృష్టికర్తలు తరచుగా బహిరంగంగా స్పందించకుండా బాధను గ్రహిస్తారని పేర్కొన్నాడు. అంతే కాకుండా ఎగతాళి చేసేవారు తమ జీవితాల్లో గందరగోళం, కష్టాలను అనుభవించే సమయం తప్పకుండా వస్తుందని పేర్కొన్నాడు. ఇది శాపం లేదా ముప్పు కాదని, జీవితం పనిచేసే విధానం అని అతను నొక్కి చెప్పాడు.
The post ప్రభాస్ రాజా సాబ్ తప్పకుండా హిట్ అవుతుంది appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ప్రభాస్ రాజా సాబ్ తప్పకుండా హిట్ అవుతుంది
Categories: