hyderabadupdates.com movies ప్రభుత్వ ఉద్యోగులూ… ఇకపై క్యాంటీన్ లో కబుర్లు ఒద్దు

ప్రభుత్వ ఉద్యోగులూ… ఇకపై క్యాంటీన్ లో కబుర్లు ఒద్దు

ఏపీలో ఉద్యోగులు అలెర్ట్ కావాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంది. వ‌చ్చే నెల 1 నుంచి రాష్ట్రంలో పాల‌న‌ను సంస్క‌రిస్తున్న కూట‌మి ప్ర‌భుత్వం ఆదిశ‌గా చేయాల్సిన ముంద‌స్తు ప‌నుల‌ను వేగంగా అమ‌లు చేయాలని నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఉద్యోగుల స‌మ‌య పాల‌న‌తోపాటు.. ఫైళ్ల క్లియ‌రెన్స్ వంటివిష‌యాల‌పై ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్యంగా ప్ర‌భుత్వానికి గుండెకాయ వంటి స‌చివాల‌యం నుంచే ఈ మార్పులు జ‌ర‌గ‌నున్నాయి.

సచివాలయ సిబ్బందికి ఫేషియల్ అటెండెన్స్ ఏర్పాటు చేయ‌నున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌నితీరుకు.. స‌చివాల‌య‌మే అద్దం ప‌డుతుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కూడా ప్ర‌ధాన స‌మ‌స్య‌లు స‌చివాలయానికే చేరుకుంటాయి. ఈ నేప‌థ్యంలో ఇక్క‌డ ఉద్యోగుల‌ను స‌రైన స‌మ‌యంలో ప‌నిచేయించుకునే దిశ‌గా ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనిలో భాగంగా ఉద్యోగుల సమయపాలనపై కఠిన నిబంధనలు అమ లు చేయనుంది.

త‌ద్వారా పెండింగు ఫైళ్ల క్లియ‌రెన్సుకు ప్రాధాన్యం ఇవ్వ‌నున్నారు. ప్ర‌స్తుతం నెల రోజులకు స‌రిప‌డా ఫైళ్లు పెండింగులో ఉన్నాయి. దీంతో గ్రామీణ స్థాయిలో చేప‌ట్టాల్సిన ప‌నులు.. పెండింగులో ప‌డుతున్నాయి. దీనికి స‌మ‌య పాల‌న పాటించ‌ని ఉద్యోగులే కార‌ణ‌మ‌ని అధికారులు నివేదిక ఇచ్చారు. దీంతో స‌చివాల‌యంలో స‌మ‌య‌పాల‌న‌కు ప్రాధాన్యం పెంచుతున్నారు. అదేస‌మ‌యంలో ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఇకపై విధులకు కచ్చితమైన సమయానికి హాజరుకావాలని ఇప్ప‌టికే ప్ర‌భుత్వం ఆదేశాలు జారీ చేసింది.

ఇక‌, ఉద్యోగుల స‌మ‌య పాల‌న‌కు సంబంధించి ప్ర‌భుత్వం కొన్ని క‌ఠిన నిర్ణ‌యాలు కూడా తీసుకుంది. ఆలస్యంగా వచ్చిన ఉద్యోగుల‌కు ఆ రోజు వేతనంలో కోత విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అదేస‌మ‌యంలో లంచ్ బ్రేక్ స‌మ‌యాన్ని కూడా క‌చ్చితంగా పాటించాల‌ని పేర్కొంది. క్యాంట‌న్లలో ముచ్చ‌ట్లు పెట్టుకునే వారికి.. ఆఫీసు వేళల్లో సంఘాల స‌మావేశాలు నిర్వ‌హించుకునేందుకు అనుమ‌తి లేద‌ని స్ప‌ష్టం చేసింది. ఇవ‌న్నీ.. సుప‌రిపాల‌న‌లో భాగ‌మేన‌ని స్ప‌ష్టం చేసింది. మ‌రోవైపు.. ఉద్యోగుల‌కు ఇవ్వాల్సిన బ‌కాయిల‌ను సంక్రాంతి సంద‌ర్భంగా స‌ర్కారు క్లియ‌ర్ చేసింది.

Related Post

షాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యంషాకింగ్: `పోల‌వ‌రం పోరు`పై తెలంగాణ కీల‌క నిర్ణ‌యం

ఏపీ ప్ర‌భుత్వం చేప‌ట్టాల‌ని భావిస్తున్న పోల‌వ‌రం-న‌ల్ల‌మ‌ల సాగ‌ర్ ప్రాజెక్టు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న విష‌యం తెలిసిందే. గోదావ‌రి నుంచి స‌ముద్రంలోకి వృథా పోతున్న జ‌లాల‌ను తాము వాడుకుంటామ‌ని ఏపీ చెబుతున్నా.. కేటాయింపుల‌కు మించి చుక్క నీటిని