hyderabadupdates.com movies ప్రశ్న ఏదైనా జోగి సమాధానం ఒక్కటే!

ప్రశ్న ఏదైనా జోగి సమాధానం ఒక్కటే!

కల్తీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మత్రి జోగి రమేష్ ను సిట్ అధికారులు నిన్న ఉదయం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కూటమి ప్రభుత్వంపై బురదజల్లేందుకు జోగి రమేష్ ఈ కల్తీ మద్యం వ్యాపారానికి తెర తీశారని జనార్ధన రావు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా పోలీసులు జోగిని అరెస్టు చేశారు. ఆ తర్వాత దాదాపు 11 గంటలపాటు జోగి రమేష్ తో పాటు ఆయన సోదరుడు రామును సిట్ అధికారులు, పోలీసులు వేర్వేరుగా విచారణ జరిపారు. అయితే, ప్రశ్న ఏదైనా సరే జోగి రమేష్ సమాధానం మాత్రం..తెలీదు..గుర్తులేదు…అని తెలుస్తోంది.

తనకు ఈ కేసుతో సంబంధం లేదని, అధికారులు అడుగుతున్న ప్రశ్నలకు తనకు సమాధానలు తెలీదని జోగి రమేష్ అన్నారట. చంద్రబాబు ఇంటిపైకి తాను వెళ్లినందుకే ఈ కేసులో ఇరికించారని, తన కుమారుడిని అగ్రిగోల్డ్ భూముల కేసులో కక్షపూరితంగా ఇరికించారని చెప్పారట. ఇక, ఈ కేసులో ఏ1 అద్దేపల్లి జనార్దన్ రావు ఎవరో తనకు తెలియదని అన్నారట. కీలకమైన ప్రశ్నలు అడిగినప్పుడు కూడా జోగి సైలెంట్ గా ఉన్నారట. జోగి రమేష్ సోదరుడు రాము కూడా ఇలాగే సమాధానాలిచ్చారట.

జనార్థన్ ఎవరో తెలీదని, ఆయనతో కలిసి వ్యాపారాలు చేయలేదని, ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగలేదని జోగి రమేష్ అన్నారట. చివరిసారి జనార్ధన్ రావును ఎప్పుడు కలిశానో గుర్తు లేదని చెప్పారట. జనార్థన్ తో కలిసి దిగిన ఫొటోలు వైరల్ అవుతున్నాయని సిట్ అధికారులు ప్రశ్నించగా…అవి ఎలా వచ్చాయో తనకు తెలీదన్నారట. ఏది ఏమైనా…జోగి రమేష్ బాగా ప్రిపేర్ అయి వచ్చారని, ఆవు వ్యాసం మాదిరిగా తెలీదు..గుర్తులేదు..తప్ప మరో ముక్క చెప్పడం లేదని తెలుస్తోంది.

Related Post

బాలయ్య పరుగు ఇంకా ఆగలేదు కానీబాలయ్య పరుగు ఇంకా ఆగలేదు కానీ

అఖండ తాండవం 2 ఫలితం తేలినట్టే ఉంది కానీ ఇంకోవైపు తేలనట్టు కూడా అనిపిస్తోంది. కారణం బుకింగ్స్. రెండో వీక్ డే అయిన సోమవారం మాములుగా ఇలాంటి సినిమాల ట్రెండింగ్ చాలా తక్కువగా ఉండి బుక్ మై షో నెంబర్లు కనిపించవు.

దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!దేశ చ‌రిత్ర‌లో.. `మ‌మ‌త` గెలిచారు… మరి ఈసీ మాటేంటి?!

సుప్రీంకోర్టులో రోజు వారీగా అనేక కేసులు విచార‌ణ‌కు వ‌స్తాయి. న్యాయ‌శాస్త్రంలో ల‌బ్ధ‌ప్ర‌తిష్టులైన అనేక మంది న్యాయ‌వాదులు వాద‌న‌లు వినిపిస్తారు. ఇది కామ‌న్‌. కానీ, బుధ‌వారం అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఒక రాష్ట్ర ముఖ్య‌మంత్రి స్వ‌యంగా కోర్టుకు హాజ‌రు కావ‌డం.. బ‌లంగా

కోడిపందెంలో ఏకంగా కోటిన్నర గెలిచాడుకోడిపందెంలో ఏకంగా కోటిన్నర గెలిచాడు

సంక్రాంతి వచ్చిందంటే చాలు ఉభయ గోదావరి జిల్లాల్లో పచ్చటి పొలాలు..గొబ్బిళ్లు…కళ్లాపి జల్లి రంగురంగుల ముగ్గులు వేసిన లోగిళ్లు…వాటితో పాటు కోడి పందేలు కామన్. ఓ వైపు కోడి పందేలు వద్దని కోర్టులు చెబుతున్నప్పటికీ…ప్రభుత్వాలు, పోలీసులు కూడా పందేలను ఆపలేని పరిస్థితి. కోడి