hyderabadupdates.com movies ప్రీమియర్ డే: కాంత మీదే అందరి కన్ను

ప్రీమియర్ డే: కాంత మీదే అందరి కన్ను

ఇవాళ సాయంత్రం కాంత ప్రీమియర్లు జరగబోతున్నాయి. కంటెంట్ మీద చాలా నమ్మకంగా ఉన్న నిర్మాతలు తమిళ మీడియాకు నిన్నే షో వేశారు. సినిమా చాలా బాగుందంటూ, దుల్కర్ సల్మాన్ అదరగొట్టాడంటూ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో పొగుడుతున్న వైనం అంచనాలు పెంచేస్తోంది. భాగశ్రీ బోర్సే, సముతిరఖనిల గురించి ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. నిజానికి కాంత తమిళ మూవీనే. మన దగ్గర డబ్బింగ్ వెర్షన్ రూపంలో వస్తోంది. కాకపోతే క్యాస్టింగ్ మనకు బాగా దగ్గరి వాళ్ళు కావడంతో అనువాదం అనే ఫీలింగ్ పెద్దగా కలగడం లేదు. ఇదే కాంతకు కీలకం కానుంది.

ఇక టాలీవుడ్ ప్రీమియర్ల నుంచి ఎలాంటి రిపోర్ట్స్ వస్తాయనే దాని మీద టీమ్ ఆసక్తికరంగా ఎదురు చూస్తోంది. ఎందుకంటే కాంతకిది మంచి ఛాన్స్. బాక్సాఫీస్ దగ్గర పెద్ద జోష్ లేదు. ప్రమోషన్లు విస్తృతంగా చేసిన ది గర్ల్ ఫ్రెండ్ వీకెండ్ కాగానే బాగా స్లో అయిపోయింది. నిన్న విజయ్ దేవరకొండను తీసుకొచ్చి ఈవెంట్ చేయడానికి కారణం కలెక్షన్ల బూస్ట్ కోసమే. టాక్ బాగున్నా ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో జనాన్ని రప్పించడంలో విఫలమయ్యింది. జటాధర వాష్ అవుట్ కాగా ప్రణవ్ మోహన్ లాల్ డైస్ ఈరేని మనోళ్లు లైట్ తీసుకున్నారు. సో ఇప్పుడు పబ్లిక్ ని థియేటర్లకు రప్పించే బలమైన కంటెంట్ ఒకటి కావాలి.

రేపు కాంత సోలోగా రావడం లేదు. సంతాన ప్రాప్తిరస్తుకి ఓపెనింగ్స్ రాకపోయినా టాక్ తో పికప్ అవుతుందనే ధీమాలో దర్శక నిర్మాతలున్నారు. స్టార్ క్యాస్టింగ్ లేని ఇలాంటి వాటికి ఆడియన్స్ రెస్పాన్స్ చాలా కీలకం. ఇవి కాకుండా గత వైభవం, గోపి గాళ్ళ గోవా ట్రిప్, లవ్ ఓటిపి, జిగ్రీస్, సిమంతం లాంటి ఇతర సినిమాలు రేస్ లో ఉన్నాయి. అన్నీ టాక్ మీద ఆధారపడ్డవే. క్యాస్టింగ్ పరంగా అన్నింటికంటే పైచేయి కాంతదే కావడంతో బయ్యర్ల కళ్ళు దాని మీదే ఉన్నాయి. నిర్మాతగా వ్యవహరించడంతో పాటు కీలక పాత్ర పోషించిన దగ్గుబాటి రానా ఖచ్చితంగా విజయవంతమవుతుందనే నమ్మకంతో ఉన్నాడు.

Related Post

Mardaani 3 Movie Review: Rani Mukerji as Shivani Shivaji Roy is unshakeable; climax is spine-chillingMardaani 3 Movie Review: Rani Mukerji as Shivani Shivaji Roy is unshakeable; climax is spine-chilling

Performances Rani Mukerji once again proves why Shivani Shivaji Roy belongs to her. Her portrayal of the conflict between personal and professional duty is executed with remarkable restraint. She doesn’t

ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?ఈ పాయింట్లన్నీ వైసీపీని ఇరుకున పెట్టాయా?

హిందూ ధర్మం, పవిత్ర ఆలయాలపై వైసీపీ వైఖరిని సీఎం చంద్రబాబు కీలక పాయింట్లతో ఎండగట్టారు. ఒకటి కాదు, రెండు కాదు.. అసలు వైసీపీ వ్యవహార శైలి ఎలా ఉంటుంది? హిందూ ధర్మం, ఆలయాల విషయంలో ఆ పార్టీ అనుసరిస్తున్న తీరు ఎలా

Prithviraj Sukumaran to join Nani’s Bloody Romeo after Varanasi? Here’s what we knowPrithviraj Sukumaran to join Nani’s Bloody Romeo after Varanasi? Here’s what we know

Following his big role as Kumbha with Mahesh Babu, Priynaka Chopra in Varanasi, Prithviraj Sukumaran seems to have locked his next big project. While being confined to a wheelchair, director