hyderabadupdates.com movies ప్లాస్టిక్ రోడ్లు వచ్చేశాయ్: హైదరాబాద్ లో ఎక్కడో తెలుసా?

ప్లాస్టిక్ రోడ్లు వచ్చేశాయ్: హైదరాబాద్ లో ఎక్కడో తెలుసా?

హైదరాబాద్ రోడ్లపై కొత్త లుక్ రాబోతోంది. ప్లాస్టిక్ వ్యర్థాలతో తయారు చేసిన అందమైన ఫుట్‌పాత్‌లు ఇప్పుడు ఫిల్మ్‌నగర్‌లో దర్శనమివ్వబోతున్నాయి. GHMC – గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూ. 1.68 కోట్లతో ఒక వినూత్న ప్రాజెక్ట్‌ను చేపట్టింది. రామానాయుడు స్టూడియో నుంచి రోడ్ నంబర్ 79/82 జంక్షన్ మీదుగా భారతీయ విద్యా భవన్ వరకు 1.5 కిలోమీటర్ల మేర ఈ మోడల్ ఫుట్‌పాత్ ను నిర్మిస్తున్నారు.

దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇందులో వాడే పేవర్ బ్లాక్స్ 65-70 శాతం రీసైకిల్ చేసిన ప్లాస్టిక్ వేస్ట్‌తో తయారైనవే. పర్యావరణానికి మేలు చేసే ఈ “ఎకో ఫ్రెండ్లీ” ప్రాజెక్ట్‌ను నాలుగు నెలల్లో పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. సోలార్ గ్రిడ్‌లతో కూడిన షెల్టర్లు, పచ్చని చెట్లతో ఈ ఫుట్‌పాత్ ఒక పార్కులా కనిపించబోతోంది. ప్లాస్టిక్ భూతంలా మారుతున్న ఈ రోజుల్లో, దాన్ని ఇలా రోడ్లుగా మార్చడం నిజంగా మంచి ఆలోచనే.

అయితే, ఈ ప్రాజెక్ట్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. “ఎప్పుడూ హైటెక్ సిటీ, ఫిల్మ్‌నగర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ మీదే ఎందుకు ఫోకస్ చేస్తారు? మిగతా ఏరియాల్లో ఉన్నవాళ్లు మనుషులు కాదా?” అని ఓ నెటిజన్ గట్టిగానే ప్రశ్నించారు. మిగతా చోట్ల కనీస రోడ్లు, డ్రైనేజీ లేక జనం ఇబ్బంది పడుతుంటే, ఇక్కడ కోట్లు కుమ్మరించడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.

మరో నెటిజన్ ఈ ప్రాజెక్ట్‌ను స్వాగతిస్తూనే ఒక ముఖ్యమైన సలహా ఇచ్చారు. “ఈ రీసైకిల్డ్ ప్లాస్టిక్ బ్లాక్స్‌ను మన తెలంగాణ స్టార్టప్‌ల నుంచే కొనుగోలు చేయండి. మన దగ్గర చాలా మంది యువ పారిశ్రామికవేత్తలు సర్క్యులర్ ఎకానమీలో అద్భుతాలు చేస్తున్నారు” అని సూచించారు. లోకల్ టాలెంట్‌ను ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు.

మొత్తానికి GHMC ప్లాన్ సూపర్, కానీ అది అమలు చేసే ఏరియా మీదే జనాలకు అభ్యంతరాలు ఉన్నాయి. అభివృద్ధి అనేది కేవలం కొన్ని హై ఫై ఏరియాలకే పరిమితం కాకుండా, సామాన్యుడు నివసించే బస్తీలకు కూడా విస్తరిస్తేనే ఇలాంటి ప్రాజెక్టులకు అసలైన సార్థకత ఉంటుంది. ఏదేమైనా, ప్లాస్టిక్‌ను రోడ్డుగా మార్చే ఈ టెక్నాలజీ హైదరాబాద్‌కు కొత్త అందాన్ని తేవడం ఖాయం.

Related Post

Freaky Red Band Trailer for ‘In Our Blood’ Mystery Horror Film Trailer
Freaky Red Band Trailer for ‘In Our Blood’ Mystery Horror Film Trailer

“I can’t be part of this system anymore…” Utopia has revealed their official trailer for the indie horror film titled In Our Blood, the first narrative feature from editor /