ప్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల కోసం కొట్టుకోవద్దన్న బాబు

తెలుగుదేశం పార్టీ నేతలకు సీఎం, పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు మీ ప్రవర్తనను గమనిస్తున్నారని, చిన్న విషయాలకే ఇగోలు పెంచుకుని కలహాలు సృష్టించవద్దని సూచించారు. టీడీపీ నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మాట్లాడిన ఆయన, ప్లెక్సీలు, ఫోటోలు, కుర్చీల విషయంలో తలెత్తే విభేదాలు పార్టీకి నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. “మన తప్పులు వార్తల్లో హెడ్‌లైన్స్ అవుతాయి” అని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు స్వీకరించనున్న నారా లోకేష్ ప్రస్తావనతో పాటు 252 మందితో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనుభవం, యువశక్తి కలగలిపి కొత్త టీమ్‌ను రూపొందించామని చెప్పారు.తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణే ప్రాణమని, కార్యకర్త నుంచి అధ్యక్షుడి వరకు అందరూ అదే పాటించాలని స్పష్టం చేశారు. ప్రజలతో సౌమ్యంగా వ్యవహరించి, అందుబాటులో ఉండాలని సూచించారు. నాయకులు, కార్యకర్తలు తప్పు చేస్తే పార్టీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని హెచ్చరించారు.

ఇటీవలి కొన్ని సంఘటనలు తనకు మనస్థాపం కలిగించాయని పేర్కొన్న చంద్రబాబు, సుపరిపాలన కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, అదే విధంగా పార్టీ నాయకులు కూడా బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. తాను, పవన్ కళ్యాణ్ మధ్య మంచి అనుబంధం కొనసాగుతోందని, అదే సమన్వయం క్షేత్రస్థాయిలో కూడా కనిపించాలని అన్నారు. సీనియర్లకు గౌరవం ఇస్తూనే కొత్త వారికి అవకాశాలు కల్పించామని, కష్టపడ్డ కార్యకర్తలకు ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. “కార్యకర్తే అధినేత” అన్న సిద్ధాంతంతో పార్టీ ముందుకు సాగుతుందని, టీడీపీ కార్యకర్త ఎప్పుడూ ధైర్యంగా నిలబడతాడే తప్ప ఎవరికీ తల వంచడని చంద్రబాబు స్పష్టం చేశారు.

More From Author

IPL 2026 PBKS vs RR Highlights | Rajasthan Royals won by 6 Wickets

బాబు నిద్ర పోలేదు.. వారికి నిద్ర ప‌ట్ట‌లేదు.. అంతా హ్యాపీ!