hyderabadupdates.com movies ఫంకీ భుజాల మీద పెద్ద బరువే ఉంది

ఫంకీ భుజాల మీద పెద్ద బరువే ఉంది

విశ్వక్ సేన్ ఫంకీ ఇంకో మూడు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఇప్పటికైతే హైప్ పరంగా మరీ ఆకాశాన్ని అంటే స్థాయిలో అంచనాలు లేవు కానీ కంటెంట్ డీసెంట్ ఉన్నా చాలు హిట్టయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే అనుకున్నంత తేలిగ్గా అయితే కాదు.

ఎందుకంటే ఫంకీ భుజాల మీద చాలా బరువుంది. ముఖ్యంగా ఏడాదికి పైగా గ్యాప్ ఉన్న విశ్వక్ సేన్ కి పెద్ద సక్సెస్ కావాలి. దీని కోసమే బయట కూడా కనిపించకుండా బ్రేక్ తీసుకున్న విశ్వక్ ఫంకీ ప్రమోషన్ల పరంగా ఎంత కావాలో అంతా చేస్తున్నాడు. ఈవెంట్లు, ఇంటర్వ్యూలు, స్పూఫ్ వీడియోలు అది ఇది కాకుండా అన్నింట్లో కనిపిస్తున్నాడు.

ఇక దర్శకుడు అనుదీప్ కు సైతం ఫంకీ ఫలితం కీలకం కానుంది. జాతిరత్నాలు తర్వాత తన గ్రాఫ్ అనుకున్న స్థాయిలో లేదు. శివ కార్తికేయన్ ప్రిన్స్ తీవ్రంగా నిరాశ పరచగా రచన బాధ్యతలు నిర్వహించిన ఫస్ట్ డే ఫస్ట్ షో కనీస స్థాయిలో ఆడలేదు. దీంతో తనదైన శైలిలో వన్ లైన్ ఫన్ మీద ఆధారపడి ఫంకీని తీశాడు.

ట్రైలర్ లో జోకులు కొంత మేర నవ్వించాయి కానీ సినిమా మొత్తం ఇదే మీటర్ లో ఉంటుందా లేదానేది చూడాలి. మాములుగా ఇండస్ట్రీ బ్యాక్ డ్రాప్ లో తీసే సినిమాలు అరుదుగా ఆడతాయి. కానీ ఫంకీ సీరియస్ విషయాల జోలికి వెళ్లకుండా కేవలం నవ్వించడమే టార్గెట్ గా పెట్టుకుని వస్తోంది.

దానికి తగ్గట్టే నిర్మాత నాగవంశీ కథ, ఎమోషన్స్ లాంటివి ఆశించకుండా థియేటర్ కు రమ్మని చెబుతున్నారు. అంటే లాజిక్స్ గురించి ఆలోచిస్తే కనెక్ట్ కాదనే ఉద్దేశం కాబోలు. గతంలో కూడా ఆయన ఇలాంటి స్టేట్ మెంట్స్ ఇచ్చినప్పటికీ అనగనగా ఒక రాజు సక్సెస్ ఊపులో ఉన్న ఆయన మరోసారి తన సక్సెస్ రేట్ ని పెంచుకుంటారో లేదో చూడాలి.

ప్రమోషన్ పరంగా ఒక లోపం ఏమిటంటే బీమ్స్ చేసిన వాటిలో వైరల్ సాంగ్ పడకపోవడం. విజువల్స్ తో పాటు చూశాక ఏమైనా కనెక్ట్ అవుతాయోమో కానీ పెద్ద చార్ట్ బస్టర్ సాంగ్ లేకపోవడం కొంత లోటే. రెండో టాలీవుడ్ సినిమాతో అయినా హీరోయిన్ కయదు లోహర్ కు హిట్టు దక్కుతుందేమో చూడాలి. 

Related Post

చంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమేచంద్రబాబు 3సీ ఫార్ములా… ఇది కలెక్టర్ల కోసమే

ఏపీలో కడుపేదల కోసం పీ 4 ఫార్ములాను రూపొందించి దానిని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు కలెక్టర్ల కోసం కొత్తగా 3సీ ఫార్ములాను తీసుకువచ్చారు. వినూత్న ఆలోచనలతో పరిపాలనలో నూతన సంస్కరణలను ప్రవేశపెట్టడంలో చంద్రబాబు ముందుంటారు. ఈ క్రమంలోనే

విజయ్ పార్టీ తరుపున త్రిష పోటీ?విజయ్ పార్టీ తరుపున త్రిష పోటీ?

తమిళంలో నంబర్ వన్ హీరోగా వెలుగొందుతున్న సమయంలో నటనకు స్వస్తి చెప్పి రాజకీయ రంగంలోకి అడుగుపెట్టాడు విజయ్. కానీ ఇక్కడ అతడికి కఠిన సవాళ్లే ఎదురవుతున్నాయి. గత ఏడాది కరూర్ తొక్కిసలాట విషాదం విజయ్‌ను ఆత్మరక్షణలోకి నెట్టింది. దాన్నుంచి కోలుకుని కాస్త