హైదరాబాద్ : తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో టాప్ లో ఉన్న మూవీస్ తో పాటు బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను ఒక్కటొక్కటిగా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆ మేరకు అందినంత మేర దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే గతంలో ఫెయిల్ అయిన మూవీస్ కూడా రిలీజ్ కాగా అవి కూడా ఊహించని రీతిలో సక్సెస్ అయ్యాయి. మూవీ మేకర్స్, నిర్మాతలకు భారీ ఆదాయం సమకూర్చి పెట్టాయి. దీంతో కొత్తగా సినిమాలను తీయడం , ఇబ్బందులు పడేకంటే గతంలో తాము తీసిన వాటినే తిరిగి కొన్ని రంగులు అద్ది రిలీజ్ చేస్తే కాసులు అందుకోవచ్చని ఆశిస్తున్నారు. ఆ మేరకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ తరుణంలో తాజాగా మరో సక్సెస్ టాక్ తెచ్చుకున్న లవ్ స్టోరీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ శనివారం ప్రకటించారు.
ఇందులో అక్కినేనా నాగ చైతన్య, సాయి పల్లవి నటించారు. లవ్ స్టోరీని వచ్చే నెల ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇదిలా ఉండగా ఈ చిత్రం పునఃవిడుదల అవుతుండటంతో నాగ్, పల్లవి ఫ్యాన్స్ తెగ సంబర పడుతున్నారు. ఈ ప్రేమకథను వెండితెరపై మరోసారి చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఇంది విడుదల కానుంది. శేఖర్ కమ్ముల దీనిని తెరకెక్కించాడు. ఇది పూర్తిగా రొమాంటిక్ డ్రామా. నాగ చైతన్య సినీ కెరీర్ లో మరిచి పోలేని మూవీగా నిలిచింది లవ్ స్టోరీ. తనను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు. అతడు ప్రదర్శించిన భావోద్వేగ నటన పలువురిని ఆకట్టుకుంది. తనతో పాటు పోటీగా నటించి మెప్పించింది సాయి పల్లవి.
The post ఫిబ్రవరి 14న లవ్ స్టోరీ మూవీ రీ రిలీజ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
ఫిబ్రవరి 14న లవ్ స్టోరీ మూవీ రీ రిలీజ్
Categories: