hyderabadupdates.com movies ఫేక్ మాఫియాలను ఆపాల్సింది ఎవరు

ఫేక్ మాఫియాలను ఆపాల్సింది ఎవరు

నిర్మాత బన్నీ వాస్ మరోసారి ట్రోలింగ్ బ్యాచుల మీద గళమెత్తారు. ఈ సమస్య తన ఒక్కడిదే కాదని, ఎందరో నిర్మాతలు వీటి బారిన పడి నష్టపోతున్నారని కూలంకుషంగా వివరించారు. కొందరు బృందంగా మారి నెగటివ్ అయినా పాజిటివ్ అయినా ఆన్ లైన్ క్యాంపైన్లు చేయడానికి డబ్బులు తీసుకుంటున్నారని చెప్పిన బన్నీ వాస్, వాళ్ళను కొందరు నిర్మాతలు బురద జల్లేందుకు వాడుకోవడాన్ని తప్పు బట్టారు. బుక్ మై షో సైతం కమర్షియల్ గా మారిపోయిందని చురకలు వేసిన వాస్ మిత్రమండలి మీద చాలా నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ప్రీమియర్లు వద్దని చాలా మంది వారించారని, అయినా రిస్క్ తీసుకున్నానని అన్నారు.

కాసేపు ఈ సంగతి పక్కనపెడితే అసలు ఈ ఫేక్ మాఫియాని ఆపాల్సింది ఎవరనే ప్రశ్న ముందు వేసుకోవాలి. తప్పు ఎక్కడ జరుగుతోందో తెలుసు. బాధ్యులు కొందరు కళ్ళముందు కనిపిస్తున్నారు. నష్టపోయిన నిర్మాతలను కలుపుకుని ఈ సమస్యని పరిష్కరించే దిశగా ఏదైనా ఒక మెకానిజం రూపొందించాలి. బుకింగ్ యాప్స్ ప్రొడ్యూసర్ల బలహీనతతో ఆడుకుంటున్నాయని అనిపించినప్పుడు అందరూ కలిసి ఒక వ్యవస్థ లాంటిది ఏర్పాటు చేసి స్వంతంగా యాప్ పెట్టుకుంటే లక్షల కోట్ల రూపాయలు మిగులుతాయి. కొన్నేళ్ల క్రితం ఇండస్ట్రీలో ఈ ప్రతిపాదన వచ్చింది. రెండు మూడు రోజులు హడావుడి చేసి అందరూ మర్చిపోయారు.

ముందైతే సోషల్ మీడియాలో కొన్ని నెగటివ్ శక్తులను పెంచి పోషిస్తున్నది ఎవరో గుర్తించాలి. కంటెంట్ బాగుంటే సినిమాలు ఎవరేం చేసినా ఆడతాయనే నమ్మకం ఉన్నప్పుడు ట్రోల్స్, నెగటివ్ కామెంట్స్ కి భయపడాల్సిన పని లేదు. ఆ మాటకొస్తే ప్రేక్షకులు మరీ అంత అమాయకంగా వీటినిని నమ్మే పరిస్థితిలో లేరు. ఆర్ఆర్ఆర్, బాహుబలిని సైతం విమర్శించిన ట్రెండ్ లో సినిమాలు చేసుకుంటూ పోవడమే పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరి పని. లేదూ ట్రోలర్స్ అడ్డుపడుతున్నారని తెలిసినప్పుడు పోలీసుల సహాయంతో వీటిని ఖచ్చితంగా ఏదో రోజు ఆపే తీరాలి. లేదంటే ఇది రిపీటవుతూనే ఉంటుంది.

Related Post

లోకేష్ గ్రాఫ్‌.. అంచ‌నాల‌కు అంద‌ట్లేదా.. !లోకేష్ గ్రాఫ్‌.. అంచ‌నాల‌కు అంద‌ట్లేదా.. !

టీడీపీ యువ నాయ‌కుడు, మంత్రినారా లోకేష్ గ్రాఫ్ అమాంతం పెరిగిందా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. మంగ‌ళ‌గిరి నుంచి ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నారా లోకేష్‌.. ఈ నియోజ‌క‌వ‌ర్గంలో మంచి మార్కులు వేయించుకున్నారు. కొత్త‌గా ఆసుప‌త్రి నిర్మిస్తున్నారు. నియోజ‌క‌వ‌ర్గంలో ప్ర‌జ‌ల‌కు చేరువ‌గా ఉంటున్నారు.