hyderabadupdates.com movies ‘ఫైర్’ పెరిగి తగ్గి.. ఏపీ మహిళా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇదే..!

‘ఫైర్’ పెరిగి తగ్గి.. ఏపీ మహిళా ఎమ్మెల్యేల గ్రాఫ్ ఇదే..!

కొంతమంది మహిళా నేతలు ఈ ఏడాది జోరుగా రెచ్చిపోయారు. నియోజకవర్గంతో పాటు స్థానిక రాజకీయాల్లో తమ హవా చూపించాలన్న ఉద్దేశంతో పలువురు మహిళా నేతలు దూకుడు చూపించారు. అయితే తొలి రోజుల్లో కనిపించిన ఆ దూకుడు, తర్వాత కాలంలో తగ్గడం చర్చనీయాంశంగా మారింది. వీరిలో ఎక్కువ మంది మహిళలే ఉండటం గమనార్హం. ముఖ్యంగా నియోజకవర్గ రాజకీయాల్లో దూకుడు చూపించిన వారు, పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో వెనక్కి తగ్గక తప్పలేదు.

భూమా అఖిల ప్రియ

ఉమ్మడి కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి 2024లో విజయం సాధించిన భూమా అఖిల ప్రియ, అప్పటి నుంచి ఈ ఏడాది తొలి ఏడెనిమిది నెలల పాటు దూకుడుగానే వ్యవహరించారు. అయితే ఈ దూకుడులో వైసీపీ నేతలకన్నా సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేయడంతో పాటు వివాదాలకు కేంద్రంగా మారారు.ముఖ్యంగా పార్టీ కోసం పనిచేసిన వారిని పక్కన పెట్టి, సొంత వ్యవహారాలపై ఎక్కువగా దృష్టి పెట్టడంతో వివాదాలు కొని తెచ్చుకున్నారన్న విమర్శలు వచ్చాయి. దీంతో పార్టీ హెచ్చరికలు రావడం, ఆ తర్వాత ఆమె వెనక్కి తగ్గడం జరిగింది.

మాధవీ రెడ్డి

కడప నుంచి తొలిసారి విజయం సాధించిన రెడ్డప్పగారి మాధవీ రెడ్డి కూడా గత ఏడాది నుంచి ఈ ఏడాది తొలి ఆరు నెలల వరకు దూకుడుగా వ్యవహరించారు. ఇది సొంత పార్టీ నాయకులతో ఆమెకు మధ్య వివాదాలకు దారి తీసింది.కడప కార్పొరేషన్‌ను దక్కించుకునే క్రమంలో ఆమె విఫలమవడంతో, అప్పటి వరకు కనిపించిన మాధవీ హవా దాదాపు తగ్గిపోయింది. మరోవైపు జిల్లా ఇంచార్జ్ బాధ్యతలను కూడా తగ్గించడంతో కడపలో మాధవీ వర్గానికి షాక్ తగిలినట్టయింది.

మరింత మంది

మంత్రి సుధారాణి కూడా ఈ ఏడాది చివర్లో ఒక వివాదంలో చిక్కుకున్నారు. ఆమె కుమారుడిపై వచ్చిన ఆరోపణలు అప్పట్లో చర్చకు దారితీశాయి. దీని ప్రభావంతో ఆమె రాజకీయ వ్యవహారాలు కూడా ఇరుకుల్లో పడినట్టు అయ్యాయి.ఇక గుంటూరుకు చెందిన మరో మహిళా ఎమ్మెల్యే కూడా వివాదాల్లో చిక్కుకున్నారు. అయితే పార్టీ నుంచి వచ్చిన ఆదేశాల నేపథ్యంలో ఆమె కొంత వెనక్కి తగ్గారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన ఓ మహిళా ఎమ్మెల్యే కూడా సొంత కూటమి నాయకులతో వివాదాల్లో చిక్కుకుని ఈ ఏడాది కొంతకాలం చర్చల్లో నిలిచిన విషయం తెలిసిందే.

Related Post

టాలీవుడ్ బాక్సాఫీసుకు ‘మొంథా’ ముప్పు ?టాలీవుడ్ బాక్సాఫీసుకు ‘మొంథా’ ముప్పు ?

ముందే వస్తుందని తెలిసి, తగిన జాగ్రత్తలు తీసుకుని ప్రజలను అప్రమత్తం చేసినా సరే మొంథా తుఫాను ప్రభుత్వాన్ని నిద్ర పోనివ్వడం లేదు. విశాఖపట్నం, విజయనగరం, నెల్లూరు, విజయవాడ తదితర ప్రాంతాలు భయంతో వణికిపోతున్నాయి. ఈ రెండు మూడు రోజులు దీని ఉదృతి

స్టార్‌లింక్ రేట్లు వచ్చేశాయ్… నెలకు ఎన్ని వేలో తెలుసా?స్టార్‌లింక్ రేట్లు వచ్చేశాయ్… నెలకు ఎన్ని వేలో తెలుసా?

ఎలన్ మస్క్ కంపెనీ ‘స్టార్‌లింక్’ ఎప్పుడెప్పుడు ఇండియాకు వస్తుందా అని టెక్ లవర్స్ అంతా ఆశగా ఎదురుచూస్తున్నారు. ఎట్టకేలకు ఆ నిరీక్షణకు తెరపడింది. ఇండియాలో తమ ఇంటర్నెట్ సేవల ధరలను కంపెనీ అధికారికంగా వెబ్‌సైట్‌లో అప్డేట్ చేసింది. అయితే ఈ రేట్లు