hyderabadupdates.com movies ఫోన్ ట్యాపింగ్ కేసు… ఇప్పుడు ఈయన వంతు

ఫోన్ ట్యాపింగ్ కేసు… ఇప్పుడు ఈయన వంతు

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో మాజీ మంత్రులు, బీఆర్ఎస్ కీలక నేతలు హరీశ్ రావు, కేటీఆర్ లను సిట్ అధికారులు విచారణ జరిపిన సంగతి తెలిసిందే. అయితే, రెండేళ్ల నుంచి ఈ కేసును కార్తీక దీపం సీరియల్ మాదిరి లాగుతున్నారని, ఎటూ తేల్చడం లేదని కేటీఆర్, హరీశ్ రావు విమర్శిస్తున్నారు.

సింగరేణి బొగ్గు టెండర్లలో అవకతవకలను కప్పిబుచ్చేందుకే ఈ సిట్ విచారణ పేరుతో తమను ఇబ్బంది పెడుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మరో బీఆర్ఎస్ నేతకు సిట్ అధికారులు నోటీసులిచ్చారు.

బీఆర్ఎస్ మాజీ ఎంపీ, కేసీఆర్ బంధువు, కేసీఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడు అయిన సంతోష్ రావుకు సిట్ అధికారులు సీఆర్పీసీ 160 కింద నోటీసులిచ్చిన వైనం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కు విచారణకు రావాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. సిట్ నోటీసులపై సంతోష్ రావు స్పందించారు. రేపు సిట్ విచారణకు హాజరై పోలీసులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తానని చెప్పారు.

కాగా, బీఆర్ఎస్ హయాంలో డీఐజీ హోదాలో ఉన్న టీ.ప్రభాకర రావును 2016లో ఎస్ఐబీ చీఫ్ గా కావాలనే నియమించారని సిట్ ఆరోపిస్తోంది. ఈ కేసులో ప్రభాకర్ రావు ఏ1గా ఉన్న సంగతి తెలిసిందే.

రిటైర్ అయిన తర్వాత కూడా ఆయనను కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తోందని, రేవంత్ రెడ్డి చూపిన బాటలోనే తాము కూడా పయనిస్తామని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు నడుచుకునే అధికారులను వదిలిపెట్టబోమని వార్నింగ్ ఇచ్చారు.

Related Post

వారణాసి ట్విస్టుకి జక్కన్న రియాక్షన్ ఏంటోవారణాసి ట్విస్టుకి జక్కన్న రియాక్షన్ ఏంటో

నవంబర్ 15 రివీల్ కాబోతున్న ఎస్ఎస్ఎంబి టైటిల్ ఏంటనేది ఇప్పటికీ సస్పెన్స్ గానే ఉంది. లీకైన సోర్స్ నుంచి వినిపిస్తున్న పేరు వారణాసి. కానీ ఇంత పెద్ద గ్లోబల్ మూవీకి అలా పెడతారానే అనుమానం అభిమానుల్లో లేకపోలేదు. ఆర్ఆర్ఆర్ టైంలో కూడా

డేటా ఆధారంగానే… ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగండేటా ఆధారంగానే… ప్రతి ఇంటికీ ఒక ప్రభుత్వ ఉద్యోగం

బీహార్ ఎన్నికలకు ముందు ప్రతిపక్ష కూటమి అయిన రాష్ట్రీయ జనతా దళ్ (RJD) నాయకుడు తేజస్వీ యాదవ్ ఎన్నికల ప్రచారంలో ఒక సంచలన ప్రకటన చేశారు. తమ కూటమి అధికారంలోకి వస్తే, రాష్ట్రంలో ప్రతి కుటుంబంలో కచ్చితంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం