hyderabadupdates.com Gallery బంగ్లాదేశ్ బ‌హిష్కర‌ణ పాకిస్తాన్ స‌మ‌ర్థ‌న

బంగ్లాదేశ్ బ‌హిష్కర‌ణ పాకిస్తాన్ స‌మ‌ర్థ‌న

బంగ్లాదేశ్ బ‌హిష్కర‌ణ పాకిస్తాన్ స‌మ‌ర్థ‌న post thumbnail image

పాకిస్తాన్ : భార‌త్, శ్రీ‌లంక దేశాలు సంయుక్తంగా టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ నిర్వ‌హిస్తున్నాయి. ఈనెల 7 నుంచి వార్మ‌ప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు భార‌త్ తో క‌య్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ త‌రుణంలో తాము టీమిండియాతో జ‌రిగే మ్యాచ్ ల‌ను ఆడబోమంటూ ఇప్ప‌టికే ప్ర‌క‌టించాయి. తాజాగా బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. తాము ఇండియాతో జ‌రిగే మ్యాచ్ ను ఆడ‌బోమంటూ ప్ర‌క‌టించారు. దీనిపై స్పందించారు పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి షెహ‌నాజ్ ష‌రీఫ్‌. భద్రతా కారణాల దృష్ట్యా భారతదేశంలో తమ మ్యాచ్‌లు ఆడటానికి నిరాకరించినందుకు బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ). ఫిబ్రవరి 15న కొలంబోలో జరగబోయే మ్యాచ్‌కు దూరంగా ఉండాలని పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు ప్రభుత్వం సూచించింద‌ని స్ప‌ష్టం చేశారు.
తాము తీసుకున్న ఈ నిర్ణ‌యాన్ని స‌మ‌ర్థించుకున్నారు పాకిస్తాన్ ప్ర‌ధాన‌మంత్రి. ఇదే స‌మ‌యంలో ఆయ‌న జాతిని ఉద్దేశించి ప్ర‌సంగించారు. టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ పై తాము చాలా స్ఫ‌ష్ట‌మైన వైఖ‌రితో ఉన్నామ‌న్నారు. క్రీడా మైదానంలో రాజ‌కీయాలు ఉండ కూడ‌ద‌ని, కానీ తాము భార‌త్ తో ఆడ బోవ‌డం లేదంటూ పేర్కొన్నారు. ఈ విష‌యం గురించి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మ‌న్ మోహిసిన్ న‌ఖ్వీ కి కూడా స్ప‌ష్టం చేయ‌డం జ‌రిగింద‌ని చెప్పారు. తాము చాలా సునిశితంగా ఆలోచించి ఈ వైఖరి తీసుకున్న‌ట్లు తెలిపారు. ఈ స‌మ‌యంలో కీల‌క నిర్ణ‌యం తీసుకున్న బంగ్లాదేశ్ కు సంపూర్ణ మ‌ద్ద‌తు ఇవ్వాల్సిన బాధ్య‌త త‌మ‌పై ఉంద‌న్నారు షెహ‌బాజ్ ష‌రీప్‌.
The post బంగ్లాదేశ్ బ‌హిష్కర‌ణ పాకిస్తాన్ స‌మ‌ర్థ‌న appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

D. K. Shivakumar: డీకే శివకుమార్‌పై ప్రతిపక్ష నేత అశోక్‌ సంచలన కామెంట్స్D. K. Shivakumar: డీకే శివకుమార్‌పై ప్రతిపక్ష నేత అశోక్‌ సంచలన కామెంట్స్

  రాష్ట్రంలో ఎంతోమంది కొలిచే చాముండేశ్వరి, మారెమ్మ ఆలయాలు కాంగ్రెస్‌ వారికి ఇష్టం కావని… ఢిల్లీలోని ఇటలీ టెంపుల్‌ చుట్టూ ప్రదక్షిణ చేసి కప్పం కడితేనే డీకే శివకుమార్‌ ముఖ్యమంత్రి అవుతారని ప్రతిపక్షనేత అశోక్‌(Ashok) వ్యాఖ్యానించారు. దావణగెరెలో ఆయన గురువారం ఆయన

అంగ‌న్వాడీ భ‌వ‌నాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లుఅంగ‌న్వాడీ భ‌వ‌నాల నిర్మాణం కోసం రూ. 193.92 కోట్లు

అమ‌రావ‌తి : ఏపీలో అంగ‌న్వాడీల నిర్వ‌హ‌ణ గురించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు మంత్రి గుమ్మ‌డి సంధ్యారాణి. గురువారం శాసనసభలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్, మహమ్మద్ నజీర్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 257 ఐసిడిఎస్ ప్రాజెక్టులు పరిధిలో 55746

Maithili Thakur: బీజేపీలో చేరిన బిహార్ ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్Maithili Thakur: బీజేపీలో చేరిన బిహార్ ఫోక్ సింగర్ మైథిలీ ఠాకూర్

Maithili Thakur : యువ ఫోక్ సింగర్‌ గా మంచి పేరు తెచ్చుకున్న మైథిలి ఠాకూర్ (Maithili Thakur) బిహార్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. 25 ఏళ్ల మైథిలీ ఠాకూర్‌ కు దర్బంగాలోని అలీనగర్