hyderabadupdates.com movies బండ్ల గణేష్ పంచులు ఎవరి మీద

బండ్ల గణేష్ పంచులు ఎవరి మీద

స్పీచులతో సోషల్ మీడియా సెన్సేషన్ గా నిలిచే నిర్మాత బండ్ల గణేష్ మరోసారి అలాంటి చర్చకు తావిచ్చారు. తాజాగా జరిగిన కె ర్యాంప్ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ కిరణ్ అబ్బవరంని ఓ రేంజ్ లో పొగిడే క్రమంలో మరో హీరో మీద విపరీతమైన పంచులు వేయడం హాట్ టాపిక్ గా మారింది. కొందరు ఒక హిట్టు రాగానే అర్థరాత్రిళ్ళు కళ్లద్దాలు పెట్టుకుని వాట్సాప్ వాట్సాప్ అంటూ సుకుమార్, రాజమౌళి, అనిల్ రావిపూడి కావాలని డిమాండ్ చేస్తారని, కానీ కిరణ్ అలా కాకుండా ఎన్ని హిట్లు వచ్చినా ఒదిగి ఉండటం చూస్తుంటే ఏకంగా చిరంజీవి గుర్తుకు వస్తున్నారని చాలా పెద్ద పోలికను తెచ్చిపెట్టి ఆకాశంలో నిలబెట్టేశారు.

బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఆ వాట్సాప్ మాట అన్నారో కానీ ట్విట్టర్ టాక్ మాత్రం విజయ్ దేవరకొండ గురించే అని నిర్ధారించడం అసలు ట్విస్టు. ఎందుకంటే తరచుగా వాట్సాప్ అనే పదం వాడేది తనే కాబట్టి. అయితే గణేష్ అన్నది నిజంగా రౌడీ బాయ్ నా కాదా అనేది పక్కనపెడితే కిరణ్ ని పొగిడే క్రమంలో మరొకరి ప్రస్తావన ఎందుకనే ప్రశ్న ఇక్కడ తలెత్తుతోంది. హిట్లు ఫ్లాపులు అందరికీ వస్తాయి. ఆ మాటకొస్తే కె ర్యాంప్ కన్నా ముందు కిరణ్ అబ్బవరంకు దిల్ రుబా అనే దారుణమైన డిజాస్టర్ ఉంది. ఇవి అందరికీ జరిగేదే. అందుకే విజయ్ ఫ్యాన్స్ కౌంటర్లతో ట్వీట్లు గట్రా బలంగానే వేస్తున్నారు.

ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయం మరొకటి ఉంది. ఇదే బండ్ల గణేష్ ఆ మధ్య లిటిల్ హార్ట్స్ ఈవెంట్ లో మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్దలు సెలబ్రిటీలు చేసే పొగడ్తలు నమ్మవద్దు, అన్నీ అబద్దాలే అంటూ హీరో మౌళికి హితబోధ చేశారు.ఆ వేడుకకు గెస్టు విజయ్ దేవరకొండనే. మరి ఇప్పుడు అదే వ్యక్తి కిరణ్ ని ఏకంగా మెగాస్టార్ తో పోల్చడం వెనుక మర్మం ఏమిటనే లాజిక్ బయటికి వస్తుంది. కాకపోతే ఇంకో మాట బండ్ల గణేష్ కరెక్ట్ గానే అన్నారు. నిర్మాత రాజేష్ దండాని ఉద్దేశించి మాట్లాడుతూ రాజకీయాల్లో వార్నింగులు పనికి వస్తాయి కానీ సినిమా పరిశ్రమలో కాదని చెప్పారు. ఇది ఒప్పుకోవాల్సిన విషయమే కానీ వాట్సాప్ కామెంట్ మాత్రం వైరలవుతోంది.

Related Post

మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?మలయాళంలో రేవంత్ సినిమా ఎలా నడుస్తోంది?

అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న కేరళలో పలు రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్లు, ఫైర్ బ్రాండ్లు, మంచి గళం వినిపించే నేతలు ప్రచారం చేస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొంగులేటి

“Shivaji Says ‘Sampradayini Suppini Suddapoosani’ Will Be a Complete Theatre Entertainer”“Shivaji Says ‘Sampradayini Suppini Suddapoosani’ Will Be a Complete Theatre Entertainer”

The upcoming Telugu crime comedy family thriller Sampradayini Suppini Suddapoosani, headlined and produced by actor Shivaji, is set for a worldwide theatrical release on March 6, creating fresh buzz among

కొత్త పార్టీపై కవిత కీలక ప్రకటనకొత్త పార్టీపై కవిత కీలక ప్రకటన

భారత రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తన రాజకీయ ప్రస్థానంపై శుక్రవారం ఓ కీలక ప్రకటన చేశారు. శ్రీరామనవమి సందర్భంగా నిజామాబాద్ లోని ఖిల్లా రామాలయంలో ప్రత్యేక పూజల్లో పాలుపంచుకున్న