hyderabadupdates.com movies బన్నీ కోసం చిరు, పవన్, చరణ్…

బన్నీ కోసం చిరు, పవన్, చరణ్…

అల్లు అర్జున్‌‌కు మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబితే.. ఒకప్పుడు అదేమీ విశేషం కాదు. కానీ ఇప్పుడు మాత్రం అది కూడా ఒక వార్తే. పరిస్థితులు అంతగా మారిపోయాయి మరి. కెరీర్లో చాలా ఏళ్లు బన్నీకి ‘మెగా’ హీరో అనే గుర్తింపే ఉండేది. అలా పిలిపించుకోవడానికే బన్నీ కూడా ఇష్టపడేవాడు. కానీ తర్వాత అతడి ఆలోచన మారింది.

తన అభిమానులను ‘ఆర్మీ’ అని పిలుచుకుంటున్నాడు. ‘మెగా’ గొడుగు నుంచి పూర్తిగా బయటికి వచ్చేశాడు. వేరే కారణాలు కూడా తోడై.. మెగా ఫ్యామిలీకి, బన్నీకి మధ్య డివిజన్ వచ్చేసింది. అందుకే ఇప్పుడు బన్నీ.. చిరు, పవన్‌, ఇతర మెగా హీరోల గురించి మాట్లాడినా.. వాళ్లు బన్నీ ప్రస్తావన తెచ్చినా ఒకింత ఆశ్చర్యంతో చూసే పరిస్థితి.

బుధవారం బన్నీ పుట్టిన రోజన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మెగా హీరోలందరూ అతడికి విష్ చేయడం ఇరు వర్గాల అభిమానుల దృష్టిని ఆకర్షించింది.తన మేనల్లుడిని ‘డియర్ బన్నీ’ అని సంబోధిస్తూ చిరు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పారు. చాలా సింపుల్‌గానే విష్ చేశాడు చిరు. మరోవైపు పవన్ సైతం బన్నీకి విషెస్ చెప్పాడు. అతను ఎల్లప్పుడూ విజయం సాధిస్తూనే ఉండాలని.. మరిన్ని మైలురాళ్లను అందుకోవాలని పవన్ ఆకాంక్షించాడు. మరోవైపు రామ్ చరణ్ సైతం ఎంతో ఆప్యాయంగా విష్ చేశాడు.

మరోవైపు మెగా ఫ్యామిలీ యువ హీరోలు సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ సైతం బన్నీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ.. అతడికి అంతా మంచే జరగాలని ఆకాంక్షించారు. ఇక నిన్న అర్ధరాత్రి నుంచే బన్నీ అభిమానుల హంగామా మామూలుగా లేదు. బన్నీ పుట్టిన రోజుకు సంబంధించిన హ్యాష్ ట్యాగ్‌ టాప్‌లో ట్రెండ్ అయ్యేలా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు.

సినీ, రాజకీయ రంగాలకు చెందిన అనేక మంది ప్రముఖులు బన్నీకి విషెస్ చెబుతన్నారు. ఈ రోజు బన్నీ కొత్త చిత్రం ‘రాకా’కు సంబంధించి టైటిల్, ప్రి లుక్ రిలీజ్ కావడంతో అది కూడా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. పుట్టిన రోజు సందర్భంగా తన ఇంటి వద్దకు పెద్ద సంఖ్యలో వచ్చిన అభిమానులను బన్నీ కలుసుకుని వారిని ఉత్సాహం నింపారు.

Related Post

జూన్ 25 పెద్ది… SKN స్లిప్పయ్యారాజూన్ 25 పెద్ది… SKN స్లిప్పయ్యారా

రిలీజ్ డేట్ల వ్యవహారం భలే మలుపులు తిరుగుతోంది. నిన్న లెనిన్ టీమ్ తమ విడుదల తేదీని జూన్ 26కి వాయిదా వేస్తూ దానికి కారణంగా పెద్దిని చూపించారు. కట్ చేస్తే ఇప్పుడు పెద్ది ఏప్రిల్ 30 రావడం లేదు. ఏకంగా జూన్

‘Bad Boy Karthik’ Set for April 17 Release, Zee Studios Backs the Film‘Bad Boy Karthik’ Set for April 17 Release, Zee Studios Backs the Film

Bad Boy Karthik starring Naga Shaurya is gearing up for a grand worldwide release on April 17, positioning itself as a major summer attraction. With strong pre-release buzz already building,