ఏపీ కేడర్‌కు చెందిన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న ప్రవీణ్ ప్రకాష్ తాజాగా ఇన్ స్టా గ్రామ్‌లో ఓ పోస్టు చేశారు. దీనికి ఆయన పెట్టిన టైటిల్ `పబ్లిక్ అపాలజీ`(బహిరంగ క్షమాపణ). ఈ సందర్భంగా ఆయన మాజీ ఐపీఎస్ ఏబీవీ వెంకటేశ్వరరావు, మాజీఐఏఎస్ జాస్తి కృష్ణ కిషోర్‌లకు క్షమాపణలు చెప్పారు. వైసీపీ హయాంలో వారిని వేధించారన్న వాదన ఉంది. అంతేకాదు.. ఉద్దేశ పూర్వకంగా వారిపై కేసులు పెట్టారన్న చర్చ సాగింది. దీనివెనుక ప్రవీణ్ ప్రకాష్ సిఫారసులు ఉన్నాయనే వాదన కూడా ఉంది.
ఈ నేపథ్యంలో తాజాగా వారికి ప్రవీణ్ ప్రకాష్ క్షమాపణలు చెప్పారు. తొలుత ఆయన తన కెరీర్‌ను ప్రస్తావించారు. 30 ఏళ్లపాటు ఏపీలో పనిచేశానని.. విజయవాడ, గుంటూరు మునిసిపల్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు తనకు భారీ ఇమేజ్ వచ్చిందన్నారు. కానీ, తర్వాత.. తనపై ట్రోల్స్‌పెరిగాయని.. ఇదే తనను రాజీనామా చేసేందుకు దారితీసేలా చేసిందన్నారు. ఈక్రమంలోనే తాను ఏం తప్పు చేశానన్న ఆలోచన వచ్చిందన్నారు. అనేక రోజులు ఆలోచన చేశానని తెలిపారు.
“2020లో ప్రిన్సిపల్ సెక్రటరీ(జనరల్ అడ్మినిస్ట్రేషన్)గా పనిచేశా. అప్పట్లో నాకు.. డీజీపీ ఆఫీసు నుంచి ఒక ఫైలు వచ్చింది. దానిలో ఒక విషయం ఉంది. అప్పటి ఏడీజీ స్థాయి అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కానీ, ఆయనపై పేర్కొన్న అభియోగాలు.. సివిల్ సర్వీస్ రూల్స్ ప్రకారం.. భిన్నంగా ఉన్నాయని గుర్తించాను. నిజానికి ఆయన నాకన్నా.. సీనియర్ అధికారి. అయితే.. తప్పదు కాబట్టి.. డీజీపీ కార్యాలయం సిఫారసు చేసింది కాబట్టి.. నేను సంతకం చేయాల్సి వచ్చింది.“అని వివరించారు.
“అయితే.. నైతికంగా.. నిజాయితీగా అయితే.. ఏబీవీపై వచ్చిన ఆరోపణలు.. నాపై వస్తే.. అవి ఏమాత్రం ప్రామాణికం కావని నాకు తెలుసు. అందుకే సమాజానికి భిన్నంగా పనిచేయాల్సి వచ్చింది. ఇదే పని ఐఏఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ విషయంలోనూ జరిగింది. ఈ ఇద్దరి విషయంలోనూ.. నేను చేసిన పనికి వ్యక్తిగతంగానూ..వారికి ఫోన్ చేసి సారీ చెప్పాను. ఇప్పుడు బహిరంగంగా క్షమాపణలు చెబుతున్నాను. “ అన్నారు. ఇద్దరినీ సార్ అని సంబోధించిన ప్రవీణ్ ప్రకాష్.. తనను క్షమించాలని కోరారు.
View this post on Instagram