hyderabadupdates.com movies బాబా వారికి ట్రంప్ సెగ‌.. మోడీకి మ‌ద్ద‌తు!

బాబా వారికి ట్రంప్ సెగ‌.. మోడీకి మ‌ద్ద‌తు!

రాందేవ్ బాబాగా ప్ర‌చారంలో ఉన్న ప‌తంజ‌లి సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ క్రియా యోగ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయ‌న‌కు.. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల బెడ‌ద చుట్టుకుంది. పతంజ‌లి సంస్థ ద్వారా ఆయుర్వేద మందులు.. మ‌హిళ‌లు, పురుషుల సౌంద‌ర్య సాధ‌నాల వ్యాపారాన్ని రాందేవ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌ర‌చుగా ఈయ‌న విమ‌ర్శ‌లలో చుట్టుకుంటున్నారు.

ఇదిలావుంటే.. ట్రంప్ విధించిన సుంకాల‌తో ప‌లు వ్యాపార‌ల‌పై ప్ర‌భావం ప‌డిన‌ట్టుగానే.. పతంజ‌లి ఉత్ప‌త్తుల పై కూడా తీవ్ర ప్ర‌భావం ప‌డింది. గ‌త రెండు నెల‌ల కాలంలో ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల అమెరికా ఎగుమ‌తులు.. 35 శాతానికి ప‌డిపోయాయి. ఇది వ్యాపార ప‌రంగా.. రాందేవ్‌కు తీవ్ర దెబ్బ‌తగిలేలా చేసింది. దీంతో రాందేవ్ బాబా తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌ర‌చుగా విమ‌ర్శించే మోడీ విధానాల‌ను మెచ్చుకోవ‌డం.. తాను స్టార్ క్యాంపెయిన‌ర్‌గా మారుతాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేస్తున్నార‌న్న వంక‌తో భార‌త్‌పై ట్రంప్ సుంకాల కొర‌డా ఝ‌ళిపించారు. దీనివల్ల భార‌త్లోని అనేక ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్ర‌భావం ప‌డుతోంది. ముఖ్యంగా సౌంద‌ర్య‌సాధ‌నాలు, మందులు, ఆక్వా ఉత్ప‌త్తులు, ఆహారం వంటివాటిపై సుంకాల ప్ర‌భావం ఉంది. దీంతో ప్ర‌ధాని మోడీ యూట‌ర్న్ తీసుకుని అమెరికా జోలికి పోకుండా.. స్వ‌దేశీ ఉత్ప‌త్తుల వినియోగాన్ని పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న గ‌త రెండు మాసాలుగా ప్ర‌చారం కూడా చేస్తున్నారు.

అయితే.. ఇలా స్వ‌దేశీ ఉత్ప‌త్తుల‌ను పెంచ‌డం ద్వారా దేశ ఆర్థిక ప‌రిస్థితి ఏమేర‌కు ప్ర‌భావితం అవుతుంద‌ని గ‌తంలో రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం మౌనంగాఉంది. అయితే.. ఇప్పుడు సుంకాల‌ బాధ త‌న‌వ‌ర‌కు వ‌చ్చే స‌రికి బాబా యూట‌ర్న్ తీసుకున్నారు. స్వ‌దేశీ ఉత్ప‌త్తుల వినియోగం మంచిదేన‌ని.. త‌ద్వారా ప్ర‌పంచ దేశాలకు ముకుతాడు వేయొచ్చన్నారు. తాను కూడా స్టార్ క్యాంపెయిన‌ర్‌గా మారి.. ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. ఇదేస‌మ‌యంలో ట్రంప్ చేస్తున్న‌ది సుంకాల పెంపు కాద‌న్న ఆయ‌న‌.. ఆర్థిక యుద్ధ‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.

Related Post

లంక, ఆఫ్రికా, అంటార్కిటికా.. ఇది ‘వారణాసి’ రహస్యం!లంక, ఆఫ్రికా, అంటార్కిటికా.. ఇది ‘వారణాసి’ రహస్యం!

‘వారణాసి’ (SSMB29) ఈవెంట్‌లో రాజమౌళి చూపించిన కాన్సెప్ట్ వీడియో, సినిమా అసలు కథ ఏంటో లీక్ చేసింది. ఇది కేవలం కాశీలో జరిగే కథ కాదని, ఖండాలు, యుగాలు దాటి సాగే ఒక గ్లోబల్ అడ్వెంచర్ అని ఈ విజువల్స్ స్పష్టం

బాబు బెంగాల్‌కు.. లోకేష్ అస్సాం?బాబు బెంగాల్‌కు.. లోకేష్ అస్సాం?

ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్‌లకు మంచి అవకాశమే దక్కిందా? ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి తరఫున ప్రచారం చేసేందుకు వారికి ఆహ్వానం అందిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, బీజేపీ

దురంధరా… అంత నిడివి భరిస్తారాదురంధరా… అంత నిడివి భరిస్తారా

మనం అఖండ 2 తాండవం హడావిడిలో పడిపోయాం కానీ బాలీవుడ్ నుంచి వస్తున్న దురంధర్ మీద కూడా చెప్పుకోదగ్గ అంచనాలే ఉన్నాయి. రణ్వీర్ సింగ్ హీరోగా నటించిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామాకు ఆదిత్య ధార్ దర్శకత్వం వహించారు. అయితే ఫైనల్