hyderabadupdates.com movies బాలయ్యని కవ్విస్తున్న రణ్వీర్ సింగ్

బాలయ్యని కవ్విస్తున్న రణ్వీర్ సింగ్

డిసెంబర్ 5 విడుదల కాబోతున్న అఖండ 2 తాండవం కోసం నార్త్ లో ప్రత్యేకంగా ప్రమోషన్లు చేస్తున్న సంగతి తెలిసిందే. పబ్లిసిటీ బోణీనే ముంబై నుంచి మొదలుపెట్టి తెలుగు మీడియా సైతం చూడని కొన్ని విజువల్స్ ని అక్కడి ప్రతినిధులకు ప్రత్యేకంగా చూపించారు. హైందవ ధర్మం మీద బలమైన విషయాలున్న అఖండ 2 బాలీవుడ్ మార్కెట్ లో పెద్ద ఎత్తున వర్కౌట్ అవుతుందనే నమ్మకం టీమ్ లో బలంగా ఉంది. అందుకే దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అవుట్ డోర్ క్యాంపైన్లు విస్తృతంగా చేస్తున్నారు. ఓపెనింగ్స్ బాగా వస్తే పాజిటివ్ టాక్ ద్వారా కార్తికేయ 2, కాంతార లాంటి ఫలితం అందుకోవచ్చని వాళ్ళ నమ్మకం.

ఇదంతా బాగానే ఉంది కానీ అదే రోజు రణ్వీర్ సింగ్ దురంధర్ పెద్ద ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇదేదో ఆషామాషీగా తీసుకునే మూవీ కాదు. చాలా పెద్ద బడ్జెట్ తో తెరకెక్కించారు. ట్రైలర్ నాలుగు నిమిషాలు వదిలారంటే ఏ స్థాయిలో కాన్ఫిడెన్స్ పెట్టుకున్నారో అర్థం చేసుకోవచ్చు. అవుట్ అండ్ అవుట్ వయొలెంట్ గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందిన దురంధర్ లో భారీ క్యాస్టింగ్ ఉంది. సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, మాధవన్, అర్జున్ రాంపాల్ తో పాటు సారా అర్జున్ హీరోయిన్ గా నటించింది. ఇన్ని అట్రాక్షన్లు ఉంటే మాస్ దీని వైపు చూడకుండా ఉంటారా. ఆదిత్య ధార్ దర్శకత్వం వహించిన దురంధర్ బడ్జెట్ వంద కోట్ల పైమాటే.

సో బాలయ్యని ఉత్తరాదిలో రణ్వీర్ సింగ్ గట్టిగానే కవ్వించబోతున్నాడు. నిజానికి దురంధర్ వాయిదా పడుతుందని ఓ నెల క్రితం ముంబై వర్గాల్లో వార్త చక్కర్లు కొట్టింది. కానీ ప్రొడక్షన్ టీమ్ పట్టుబట్టి టార్గెట్ రీచ్ అయ్యేలా చూసుకుంది. బిజినెస్ వ్యవహారాలు ఒక్కొక్కటిగా చక్కబెట్టుకుంటూ వస్తున్న అఖండ 2 హిందీలో ఇంతకు అమ్ముడుపోయిందనేది ఇంకా తెలియాల్సి ఉంది. థియేటర్ల కేటాయంపు మరీ దురంధర్ స్థాయిలో ఆశించలేం కానీ ఉన్నంతలో మంచి కౌంట్ వస్తే పాజిటివ్ టాక్ తో తర్వాత స్క్రీన్లు పెంచుకోవచ్చు. మరి బాలయ్య వర్సెస్ రణ్వీర్ సింగ్ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు విజేతలో చూడాలి.

Related Post

వంగ ఇంటర్వ్యూలో ఉండే మజానే వేరువంగ ఇంటర్వ్యూలో ఉండే మజానే వేరు

సినిమాల ప్రమోషన్స్ అంటే ఒకప్పుడు యాంకర్లతో ప్రశ్నలు అడిగించడం లేదా స్టేజ్ మీద హడావిడి చేయడం మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఒక స్టార్ డైరెక్టర్ మరో స్టార్ హీరోని ఇంటర్వ్యూ చేయడం అనేది లేటెస్ట్ ట్రెండ్. ఇందులో

Chiranjeevi Wishes Amitabh Bachchan on His BirthdayChiranjeevi Wishes Amitabh Bachchan on His Birthday

Megastar Chiranjeevi conveyed heartfelt birthday wishes to Bollywood legend Amitabh Bachchan. Calling him the “Legendary Icon of Indian Cinema,” Chiranjeevi praised Amitabh Bachchan’s charisma, discipline, and dedication, which continue to