hyderabadupdates.com movies బాహుబలి కోసం అభిమానుల ఎదురుచూపులు

బాహుబలి కోసం అభిమానుల ఎదురుచూపులు

అదేంటి బాహుబలి ఎపిక్ ఆల్రెడీ రీ రిలీజైపోయి వసూళ్లు కొల్లగొట్టేసి వెళ్ళిపోయింది, మళ్ళీ ఎదురు చూడటం ఏమిటనుకుంటున్నారా. పాయింట్ వేరే ఉంది. ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో దీని హిందీ స్ట్రీమింగ్ మొదలయ్యింది. ఒరిజినల్ ఐమాక్స్ రేషియోలో మొత్తం స్క్రీన్ నిండిపోయేలా లోడ్ చేసిన ప్రింట్ మళ్ళీ ఇంకోసారి చూడాలనిపించేలా ఉంది.

బిగినింగ్, కంక్లూజన్ హోమ్ వీడియోలో ఏవైతే ఫ్రేమ్ కట్స్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు ఎలాంటి గ్యాప్ లేకుండా నిండుగా ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఎపిక్ ని థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా చూడాలనిపించేలా ఉంది. కానీ అసలు ట్విస్టు వేరుగా ఉంది.

తెలుగు, తమిళం డబ్బింగ్ వెర్షన్లు నెట్ ఫ్లిక్స్ లో లేవు. కారణం తెలుగు హక్కులు హాట్ స్టార్, స్టార్ మా దగ్గర ఉండగా తమిళ రైట్స్ వేరొకరి కావడంతో డిజిటల్ వెర్షన్ రిలీజ్ చేయడంలో ఆలస్యం జరుగుతోందని ఇన్ సైడ్ టాక్. సాంకేతిక కారణాల వల్ల ఇంకొంచెం లేట్ అవ్వొచ్చని అంటున్నారు.

రెండు భాగాలు కలిపి 3 గంటల 44 నిమిషాల బాహుబలి ప్రపంచాన్ని మళ్ళీ సృష్టించిన రాజమౌళి ఎడిటింగ్ కోసం చాలా కష్టపడ్డారు. ఏవి ట్రిమ్ చేయాలి, ఏ భాగాలు కత్తిరించాలి అనే దాని మీద పెద్ద కసరత్తు జరిగింది. ఫైనల్ గా అందరికీ సంతృప్తి అనిపించేలా ఎపిక్ పేరుతో విడుదల చేశారు. అది ఘనవిజయం సాధించడం చూశాం.

వారణాసి నిర్మాణంలో ఉన్న నేపథ్యంలో బాహుబలి ఎపిక్ కి ఓటిటిలో మరింత గ్లోబల్ రీచ్ వస్తుందని అభిమానులు భావిస్తున్నారు. అది జరగాలంటే వీలైనన్ని ఎక్కువ దేశాల్లో విడుదలయ్యేలా చూసుకోవాలి. జపాన్, చైనా లాంటి దేశాల్లో రిలీజ్ ప్లాన్ చేసుకోవాలి.

ఇదంతా ఎలా ఉన్నా ఎపిక్ తెలుగు త్వరగా రావాలని ప్రభాస్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. సినీ డబ్ యాప్ ద్వారా తెలుగు ఆడియో అందుబాటులో ఉంది కానీ క్వాలిటీ సంతృప్తికరంగా లేకపోవడంతో దాని వల్ల పెద్దగా ప్రయోజనం లేదు. ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ లో బిజీగా ఉండగా, రాజమౌళి వారణాసి పనుల్లో తలమునకలై ఉన్నారు.

Related Post

Nayanthara to Break her Rule for Mana Shankara Vara Prasad GaruNayanthara to Break her Rule for Mana Shankara Vara Prasad Garu

Top actress Nayanthara is against promoting her films. Despite being paid big money, the actress is strictly against attending the promotional events and shooting for interviews. The entire Telugu cinema

Avatar Fire and Ash sparks immense craze in India as BMS interests top 1 millionAvatar Fire and Ash sparks immense craze in India as BMS interests top 1 million

The anticipation for the third installment of James Cameron’s Avatar franchise, Avatar: Fire and Ash, has reached new heights in India. With less than a month left for the release,

తెలంగాణ పోలీసులకు ఏపీ డీసీఎం అభినందనతెలంగాణ పోలీసులకు ఏపీ డీసీఎం అభినందన

సినిమా పైరసీ ముఠాను అరెస్ట్ చేసిన హైదరాబాద్ పోలీసులకు, సిటీ కమిషనర్ వి.సి.సజ్జనార్ కి ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అభినందనలు తెలియజేశారు. డబ్బుల రూపంలోనే కాదు, సృజనాత్మకతనూ పెట్టుబడిగా పెట్టి నిర్మించే సినిమాలను విడుదలైన రోజునే ఇంటర్నెట్ లో