hyderabadupdates.com movies బాహుబ‌లి: ది ఎపిక్‌లో కొత్త సీన్

బాహుబ‌లి: ది ఎపిక్‌లో కొత్త సీన్

ఒక రీ రిలీజ్ సినిమా కోసం దేశ‌మంతా ఎంతో ఉత్కంఠగా ఎదురు చూడ‌డం బ‌హుశా తొలిసారి జ‌రుగుతుండొచ్చు. ఈ నెల 31న విడుద‌ల‌య్యే బాహుబ‌లి: ది ఎపిక్ ప‌ట్ల అంత‌కంత‌కూ ఆస‌క్తి పెరిగిపోతోంది. మ‌గ‌ధీర‌, ఈగ‌, బాహుబ‌లి, ఆర్ఆర్ఆర్ లాంటి విజువ‌ల్ వండ‌ర్స్‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన రాజ‌మౌళి.. బాహుబ‌లి రెండు భాగాలను క‌లిపి ఒక‌టిగా రిలీజ్ చేయాల‌న్న స‌రికొత్త ఆలోచ‌న‌తో మ‌రోసారి ట్రెండ్ సెట్ చేశారు.

ముందు బాహుబ‌లిని ఒక్క సినిమాగానే తీయాల‌నుకున్నారు కాబ‌ట్టి.. అలా తీసి ఉంటే ఎలా ఉండేదో ఈ నెల 31న ప్రేక్ష‌కులు చూడబోతున్నారు. ఐతే రెండు సినిమాల‌ను క‌లిపి ఒక‌టిగా చేసే క్ర‌మంలో చాలా సీన్లు క‌ట్ చేస్తార‌న్న విష‌యం తెలిసిందే. పాట‌లు, స‌న్నివేశాలు క‌లిపి దాదాపు గంట‌న్న‌ర దాకా క‌ట్ అయిపోతుంది. మ‌రి కొత్త‌గా సినిమాలో స‌న్నివేశాలు ఏమైనా ఉంటాయా అనే ప్ర‌శ్న అంద‌రిలోనూ ఉంది. దీనికి ఔన‌ని స‌మాధానం చెప్పాడు బాహుబ‌లి సినిమాటోగ్రాఫ‌ర్ సెంథిల్ కుమార్.

బాహుబ‌లి రీ రిలీజ్ నేప‌థ్యంలో సెంథిల్ కుమార్ ఒక ఇంట‌ర్వ్యూలో మాట్లాడాడు. ఈ నెల 31న ఎపిక్ రిలీజ్‌లో కొత్త స‌న్నివేశం ఒక‌టి చూస్తార‌న్నాడు. ఐతే ఈ స‌న్నివేశం కొత్త‌గా షూట్ చేసిందేమీ కాద‌ని అత‌ను చెప్పాడు. ఎడిటింగ్ టైంలో క‌ట్ అయిపోయిన ఒక స‌న్నివేశాన్ని ఇప్పుడు సినిమాలో క‌లుపుతున్నార‌ని.. అది క‌థలో కీల‌కంగానే ఉంటుంద‌ని సెంథిల్ చెప్పాడు. ఈగ త‌ర్వాత బాహుబ‌లి క‌థ చెప్పిన‌పుడే ఇదొక విజువ‌ల్ వండ‌ర్ అనే విష‌యం అర్థ‌మైంద‌ని.. అందుకు త‌గ్గ‌ట్లుగా ఒక సినిమాటోగ్రాఫ‌ర్‌గా స‌న్న‌ద్ధం అయ్యాన‌ని సెంథిల్ చెప్పాడు.

ముందు ఈ సినిమాలోని కొన్ని సీన్ల‌ను ఔట్ డోర్ లొకేష‌న్ల‌లో తీద్దామనుకున్నామ‌ని.. అలాగే ఒక సీన్ తీశామ‌ని.. కానీ కెమెరా ఎక్క‌డ పెట్టినా.. ఏదో ఒక చోట జ‌నం క‌నిపించేవారని.. దీంతో ఇలా సాధ్యం కాదు అని రామోజీ ఫిలిం సిటీలోనే చాలా వ‌ర‌కు సినిమాను చిత్రీక‌రించామ‌ని సెంథిల్ కుమార్ వెల్ల‌డించాడు. ఆర్ఆర్ఆర్ వ‌ర‌కు రాజ‌మౌళితో సాగిన సెంథిల్ కుమార్.. ప్ర‌స్తుతం బ్రేక్ తీసుకున్నాడు. మ‌హేష్ బాబు సినిమాకు పి.ఎస్.వినోద్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నాడు.

Related Post

రెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానారెహమాన్ మళ్ళీ గెలవడం పక్కానా

పెద్ది ప్రకటన టైంలో సంగీత దర్శకుడిగా ఏఆర్ రెహమాన్ ని ఎంచుకోవడం గురించి మెగా ఫ్యాన్స్ అప్పట్లో రకరకాల అనుమానాలు వ్యక్తం చేయడం తెలిసిందే. అసలే పెద్దగా ఫామ్ లో లేరు, పైగా టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలకు ఆయన ఇచ్చే మ్యూజిక్

Ram Charan’s Peddi Locks April 30 Release, New Look Sets the Internet on FireRam Charan’s Peddi Locks April 30 Release, New Look Sets the Internet on Fire

Ram Charan’s much-awaited pan-India sports action drama Peddi has officially locked its worldwide theatrical release for April 30, shifting from the earlier planned March 27 date to tap into the

Selena: Jennifer Lopez’s Breakout Biopic Resonates 28 Years Later
Selena: Jennifer Lopez’s Breakout Biopic Resonates 28 Years Later

Selena has become a big hit on streaming. Written and directed by Gregory Nava, the 1997 biopic stars Jennifer Lopez as the titular Tejano music star Selena Quintanilla-Pérez, following the