hyderabadupdates.com movies బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

బిగ్ బ్రేకింగ్: అంబటి రాంబాబు అరెస్ట్!

తీవ్ర ఉద్రిక్తతల నడుమ వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అంబటి రాంబాబు వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో ఉదయం నుంచి గుంటూరులో హైడ్రామా నడిచింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి, ఆ తర్వాత తాను తిట్టింది చంద్రబాబును కాదని.. దాడికి పాల్పడిన వాడినని చెబుతూ.. రెడ్ బుక్కుకి తన ఇంట్లో కుక్క కూడా భయపడదు, అరెస్టు చేస్తే చేసుకోండి అంటూ.. రెచ్చగొట్టేలా మాట్లాడారు.

ఆ తర్వాత గుంటూరులో తన నివాసానికి ఆయన చేరుకున్నారు. అంబటి వ్యాఖ్యలతో తీవ్ర ఆగ్రహానికి లోనైనా తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆయన ఇంటిపై దాడికి యత్నించారు. ఇంటికి వెళ్లి ఫర్నిచర్, కారును ధ్వంసం చేశారని వైసిపి ఆరోపిస్తోంది. ఆ సమయంలో మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ సైతం అంబటి రాంబాబు ఫోన్ చేసి పరామర్శించారు. 

రాత్రి పది గంటల తర్వాత మరోసారి అంబటి రాంబాబు ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉండడంతో పోలీసులు ఆయనను భారీ బందోబస్తు మధ్య అరెస్టు చేసి వజ్రా వాహనాన్ని ఎక్కించారు. అక్కడ నుంచి రాంబాబును నల్లపాడు పోలీస్ స్టేషన్కు తరలిస్తున్నారని సమాచారం ఉంది.

Related Post

చైతు లవ్ స్టోరీకి సరైన సమయంచైతు లవ్ స్టోరీకి సరైన సమయం

నాగ చైతన్య కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచిపోయిన లవ్ స్టోరీని ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా రీ రిలీజ్ చేయబోతున్నారు. 2021లో విడుదలయ్యాక మళ్ళీ దీన్ని థియేటర్లకు తీసుకురాలేదు. అయిదు సంవత్సరాల తర్వాత ప్రేక్షకులకు మరోసారి చూపించబోతున్నారు. అయితే

థియేటర్లలో హిట్.. ఓటీటీలో బ్లాక్‌బస్టర్థియేటర్లలో హిట్.. ఓటీటీలో బ్లాక్‌బస్టర్

ప్రదీప్ రంగనాథన్.. ఇప్పుడు ఈ పేరు తెలుగు, తమిళ యువతకు హార్ట్ బీట్‌గా మారిపోయింది. కేవలం మూడే మూడు సినిమాలతో అతను కోట్లమంది యువతకు ఫేవరెట్‌గా మారిపోయాడు. చూడ్డానికి ఒక పక్కింటి కుర్రాడిలా సాధారణంగా అనిపిస్తాడు కానీ.. తన పెర్ఫామెన్స్ చూస్తే

Shraddha Kapoor in talks to join Allu Arjun for Lokesh Kanagaraj’s AA23? Here’s what we knowShraddha Kapoor in talks to join Allu Arjun for Lokesh Kanagaraj’s AA23? Here’s what we know

However, a report by tracker Mukil Vardhanan stated that the actor-director duo is planning to commence shooting for AA23 in June or July 2026, with pre-production underway. Moreover, Lokesh Kanagaraj