hyderabadupdates.com movies ‘బీఆర్ఎస్ కాదు… బీఆర్ఎస్ కార్పొరేటర్లు గొప్పోళ్లు’

‘బీఆర్ఎస్ కాదు… బీఆర్ఎస్ కార్పొరేటర్లు గొప్పోళ్లు’

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై తెలంగాణవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఏ పార్టీకీ మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో హంగ్ ఏర్పడింది. మొత్తం 66 డివిజన్లకుగాను బీజేపీ 30 డివిజన్లు గెలుచుకుంది.

కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9, ఇండిపెండెంట్లు 8, ఎంఐఎం 3, ఏఐఎఫ్ బీ 2 స్థానాల్లో విజయం సాధించాయి. అయితే, ఎక్స్ అఫిషియో ఓట్లతోపాటు ఇండిపెండెంట్ల మద్దతు కూడగట్టుకొని కరీంనగర్ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ భావించింది.

అయితే, బీజేపీని మినహాయించి బీఆర్ఎస్ తో పాటు ఎంఐఎం, ఇండిపెండెంట్లు, ఇతరుల మద్దతు తీసుకొని కరీం నగర్ మేయర్ పీఠంపై కూర్చోవాలని కాంగ్రెస్ భావించింది. ఈ క్రమంలోనే మూడు రోజులుగా ఇక్కడ క్యాంప్ రాజకీయాలు కాక రేపాయి.

కానీ, కాంగ్రెస్ వ్యూహం ఫలించలేదు. చివరి నిమిషంలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ హ్యాండిచ్చింది. మేయర్ ఎన్నిక సమయంలో చేతులెత్తకుండా బీఆర్ఎస్ కార్పొరేటర్లు తటస్థంగా ఉన్నారు. దీంతో, కరీంనగర్ మేయర్ గా కొలగాని శ్రీనివాస్ ఎన్నికయ్యారు.

డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావు ఎన్నికయ్యారు.మేయర్ ఎన్నికలో బీజేపీ బలపరిచిన కొలగాని శ్రీనివాస్ కు 34 ఓట్లు రాగా, కాంగ్రెస్ బలపరిచిన ఆకుల నర్మదకు 21 ఓట్లు మాత్రమే వచ్చాయి.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ కార్పొరేటర్లపై బీజేపీ ఎంపీ బండి సంజయ్ ప్రశంసలు కురిపించిన వైనంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. కొన్ని చోట్ల బీఆర్ఎస్ తమ శత్రువు అంటున్న బండి సంజయ్….కరీంనగర్ లో మాత్రం బీఆర్ఎస్ తో లోపాయికారి పొత్తు కుదుర్చుకోవడంపై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

బీఆర్ఎస్ కార్పొరేటర్లు క్షేత్రస్థాయిలో వాస్తవాలను, ప్రజల ఆకాంక్షలను గ్రహించారని, అందుకే కాంగ్రెస్ కు మద్దతివ్వలేదని బండి సంజయ్ అనడం హాస్యాస్పదమని ట్రోల్ చేస్తున్నారు. ఇక, ఈ క్రెడిట్ అంతా కేవలం కరీంనగర్ లోని బీఆర్ఎస్ కార్పొరేటర్లకు మాత్రమే అప్లికబుల్ అని, మిగతా చోట్ల కాదని కూడా బండి సంజయ్ సెలవిచ్చారని ఎద్దేవా చేస్తున్నారు.

Related Post

ఇద్దరు టాలీవుడ్ దిగ్గజాలకు పద్మ శ్రీఇద్దరు టాలీవుడ్ దిగ్గజాలకు పద్మ శ్రీ

రిపబ్లిక్ డే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. టాలీవుడ్ సీనియర్ నటుడు, టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ మాగంటి మురళీ మోహన్ న్ కు పద్మ శ్రీ దక్కింది. ఇక, టాలీవుడ్ ప్రముఖ కమెడియన్, సీనియర్ నటుడు

Naga Chaitanya drops a post amidst Samantha and Raj Nidimoru’s wedding pics going viralNaga Chaitanya drops a post amidst Samantha and Raj Nidimoru’s wedding pics going viral

For the unversed, Samantha Ruth Prabhu and Naga Chaitanya dated for several years and were married in 2017. They announced their separation in 2021, which came as a shock to the fans. Both