ముంబై : కాంగ్రెస్ అగ్ర నాయకుడు, ఎంపీ రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. తాజాగా మహారాష్ట్రలో జరిగిన బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. శుక్రవారం రాహుల్ గాంధీ మీడియాతో మాట్లాడారు. ఈసీపై సీరియస్ అయ్యారు. మరోసారి చోరీ జరిగిందని ఆరోపించారు. ఇది మంచి పద్దతి కాదన్నారు. ఈ దేశంలో గత కొన్నేళ్ల నుంచి యధేశ్చగా ఓట్ చోరీ కొనసాగుతోందని ధ్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం పప్పెట్ లాగా మారిందన్నారు. ప్రజాస్వామ్యంపై పూర్తిగా నమ్మకం కోల్పోయేలా చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. మహారాష్ట్ర పౌర ఎన్నికలలో మార్కర్ పెన్నుల్లో ఉపయోగించిన చెరగని సిరాకు సంబంధించి వివాదం చోటు చేసుకుంది.
ఓటు చోరీ అనేది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. ఎన్నికల సంఘం పౌరులను గ్యాస్‌లైట్ చేస్తోందని ఆరోపించారు. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడంతో ఎట్టకేలకు మహారాష్ట్ర రాష్ట్ర ఎన్నికల కమిషన్ దిగివచ్చింది. ఈ మేరకు విచారణ చేపడతామని ప్రకటించింది. సిరా నాణ్యతపై సమగ్ర దర్యాప్తు చేపడతామంటూ ప్రకటించింది. ప్రతిపక్ష నాయకులు ఓటరు వేలుపై ఉన్న గుర్తును సులభంగా తొలగించ వచ్చని, నకిలీ ఓటింగ్‌కు వీలు కల్పిస్తుందని పేర్కొన్నారు. అంతే కాకుండా వాస్తవంగా ఎలా తొలగించ వచ్చో కూడా లైవ్ లో చేసి చూపించారు. దీనిపై తీవ్రంగా స్పందించారు రాహుల్ గాంధీ. ఆయన చేసిన కామెంట్స్ కలకలం రేపుతున్నాయి ప్రస్తుతం.
The post బీఎంసీ ఎన్నికల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
బీఎంసీ ఎన్నికల్లో ఓటు చోరీ నిజం : రాహుల్ గాంధీ
Categories: