hyderabadupdates.com movies బీజేపీలో జ‌గ‌న్ కోవ‌ర్టులు.. అధిష్టానం ఆరా…?

బీజేపీలో జ‌గ‌న్ కోవ‌ర్టులు.. అధిష్టానం ఆరా…?

ఏపీ బీజేపీలో నాయ‌కుల మ‌ధ్య లుక‌లుక‌లు ఉన్నాయి. ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌క‌పోవ‌డం.. ఒకరిపై మ‌రొక‌రు ఆధిప‌త్య రాజ‌కీయాలు చేయ‌డం వంటివి కామ‌న్‌గా మారాయి. అయితే.. సాధార‌ణంగా ఏ పార్టీలో అయినా.. ఇలాంటి ఆధిప‌త్య రాజ‌కీయాలు ఉంటాయి. అదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయి నాయ‌కులు కూడా త‌మ త‌మ శైలిలో రాజ‌కీయాలు చేస్తుంటారు. దీనిని పార్టీలు కూడా స‌హిస్తుంటాయి. కానీ.. ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు కోవ‌ర్టులుగా వ్య‌వ‌హ‌రించే వారి విష‌య‌మే ఎప్పుడూ ఇబ్బందుల‌కు దారి తీస్తుంది.

ఇప్పుడు ఏపీ బీజేపీలో ఈ విష‌య‌మే చ‌ర్చ‌కు వ‌స్తోంది. పార్టీలో కోవ‌ర్టులు ఉన్నారంటూ.. కొన్నాళ్లుగా నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. అది కూడా వైసీపీకి మేలు చేసేలా వ్య‌వ‌హ‌రించే వారు ఉన్నార‌న్న‌ది వారి మాట‌.

ఒక వైపు కూట‌మి పార్టీలు క‌ల‌సి క‌ట్టుగా ముందుకు సాగాల‌ని భావిస్తుంటే.. నాయ‌కులు ఎవ‌రైనా కూడా.. దీనికి ద‌న్నుగా నిలవాల్సి ఉంటుంది. కానీ, పార్టీ ప‌రంగా మాత్రం కొంద‌రు నాయ‌కులు వైసీపీకి, జ‌గ‌న్‌కు కూడా కోవ‌ర్టులుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారంటూ.. బీజేపీ అధిష్టానానికి లేఖ‌లు ముటాయ‌ని స‌మాచారం. ఇది ఇప్పుడు అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో హాట్ టాపిక్‌గా మారింద‌న్న‌ది వాస్త‌వం.

“నిజ‌మే. ఈ విష‌యం కొన్నాళ్లుగా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కొంద‌రు నాయ‌కుల వ్య‌వ‌హార శైలి అలానే ఉంది.“ అని విజ‌య‌వాడ‌కు చెందిన కీల‌క బీజేపీ నాయ‌కుడు ఒక‌రు వ్యాఖ్యానించారు. అయితే.. దీనిని త‌ప్పుప‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని చెప్ప‌డం విశేషం. కేంద్రంతో ఉన్న స‌త్సంబంధాల విష‌యంలో బీజేపీ నాయ‌కులు కొంద‌రు గ‌తంలో వైసీపీ అధినేత‌తో ప‌నులు చేయించుకున్నార‌ని.. రాజ్య‌స‌భ సీటు కూడా ద‌క్కించుకున్నార‌ని.. సో.. అలాంట‌ప్పుడు ఇవ‌న్నీ కామ‌నేన‌ని చెప్పిన నాయ‌కుడు కూడా ఉన్నారు. కానీ, ఇప్పుడు ప‌రిస్థితులు మారాయి. కోవ‌ర్టులు వెన‌క్కి త‌గ్గాల్సిందేన‌ని హెచ్చ‌రించ‌డం గ‌మ‌నార్హం.

Related Post

టీఎఫ్‌జేఏ (TFJA) నూతన కార్యవర్గంటీఎఫ్‌జేఏ (TFJA) నూతన కార్యవర్గం

TFJA నూతన అధ్యక్షుడిగా వై.జె. రాంబాబు, ప్రధాన కార్యదర్శిగా ప్రసాదం రఘు. తెలుగు సినిమా జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన ఉద్దేశంగా పని చేస్తున్న సంస్థ ‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్’ (TFJA). ఇందులో ఎలక్ట్రానిక్, ప్రింట్, వెబ్, డిజిటల్ మీడియా సంస్థల్లో పని చేస్తున్న 221

రెండు రోజులే గ‌డువు.. తేల‌ని బీజేపీ లెక్క‌!రెండు రోజులే గ‌డువు.. తేల‌ని బీజేపీ లెక్క‌!

హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక ఘ‌ట్టం తెర‌మీదికి వ‌చ్చిన విష‌యం తెలిసిందే.  మ‌రో రెండురోజుల్లోనే నామినేష‌న్ల ప్ర‌క్రియ‌(ఈ నెల 13) ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో ప్ర‌ధాన పార్టీలైన బీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు త‌మ త‌మ అభ్య‌ర్థుల‌ను

Telugu Viral Girl to Romance Dhanush’s Nephew Pavish in His Second FilmTelugu Viral Girl to Romance Dhanush’s Nephew Pavish in His Second Film

Dhanush’s nephew Pavish Narayan was introduced as the lead actor in Nilavukku Enmel Ennadi Kobam (NEEK), which was dubbed in Telugu as Jabilamma Neeku Antha Kopama. Dhanush directed the movie,