hyderabadupdates.com movies బుచ్చిబాబు దూకుతాడా ఆగుతాడా

బుచ్చిబాబు దూకుతాడా ఆగుతాడా

చికిరి చికిరి పాట వచ్చి యాభై రోజులయ్యింది. ఒక్క తెలుగు వెర్షనే వంద మిలియన్ల వ్యూస్ దాటేసి కొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతోంది. ఏఆర్ రెహమాన్ కంపోజింగ్ ఇంత గొప్పగా ఉంటుందా అని జెన్ జెడ్ యూత్ ఫీలయ్యే రేంజ్ లో వైరల్ అయిన ఈ సాంగ్ తర్వాత నెక్స్ట్ అప్డేట్ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ముందు అనుకున్న ప్లాన్ ప్రకారం అయితే పెద్ది టైటిల్ సాంగ్ అయిన మస్సా మస్సాని కొత్త సంవత్సర కానుకగా రిలీజ్ చేయాలని ప్రాథమికంగా అనుకున్నారట. దర్శకుడు బుచ్చిబాబు దానికి అనుగుణంగా ఎడిట్ రెడీ చేసి సిద్ధంగా ఉన్నారట. కాకపోతే ఇప్పుడు దూకాలా ఆగాలా అని ఆలోచిస్తున్నారట.

ఎందుకంటే సంక్రాంతి సినిమాల హడావిడి ఈసారి చాలా ఉండబోతోంది. మరీ ముఖ్యంగా చిరంజీవి మన శంకరవరప్రసాద్ గారితో పాటు రాజా సాబ్ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇరవై ఏడున ప్రభాస్ ఈవెంట్ ఉంటుంది. కొత్త ట్రైలర్ కూడా లాంచ్ చేస్తారు. నెలాఖరులో చిరంజీవి వెంకీ కాంబో సాంగ్ రానుంది. ఇవి కాకుండా మిగిలిన సినిమా అప్డేట్స్ రోజుకు ఒకటి వస్తూనే ఉంటాయి. ఇంత రష్ లో పెద్ది టైటిల్ సాంగ్ వదిలితే బాగుండదేమోనని బుచ్చిబాబు అనుకుంటున్నట్టుగా సమాచారం. మిగిలినవాళ్ళకు లేనిపోని ఇబ్బంది సృష్టించడం ఎందుకనే ఆలోచన కూడా ఉండొచ్చు.

డిసెంబర్ మినహాయిస్తే పెద్ది చేతిలో కేవలం 86 రోజుల సమయం మాత్రమే ఉంటుంది. మార్చ్ 27 విడుదలలో ఎలాంటి మార్పు లేదు కాబట్టి బాలన్స్ షూటింగ్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ వేగవంతం చేయాల్సి ఉంటుంది. పరిమిత విఎఫ్ఎక్స్ కనక ఎక్కువ ఆలస్యం కాకపోవచ్చు. ఇటీవలే హైదరాబాద్ షెడ్యూలు పూర్తి చేసుకుని ఢిల్లీకి వెళ్తున్న పెద్ది అక్కడ క్లైమాక్స్ ని ముగించుకుని వచ్చేస్తాడు. దీంతో ప్రధాన ఘట్టాలు అయిపోయినట్టే. రెహమాన్ ఐటెం సాంగ్ ఇచ్చేస్తే హీరోయిన్ ని లాక్ చేసి ఫిబ్రవరిలో దాన్ని చిత్రీకరించాలి. మొత్తానికి బుచ్చిబాబు మెడమీద ఒత్తిడనే పెద్ద కత్తి వేలాడబోతోంది. చూడాలి ఎలా మేనేజ్ చేస్తారో.

Related Post

ఈ రెండు ఫొటోలు చాలు.. కూట‌మి బ‌లం చెప్ప‌డానికి!ఈ రెండు ఫొటోలు చాలు.. కూట‌మి బ‌లం చెప్ప‌డానికి!

“ఏపీలో కూట‌మి బ‌లం ఏ విధంగా ఉందో చెప్ప‌డానికి ఈ రెండు ఫొటోలు చాలు!“ ఈ మాట అన్న‌ది ఎవ‌రో టీడీపీ నాయ‌కులో.. బీజేపీ నేత‌లో కాదు.. త‌ట‌స్థులు, రాజ‌కీయ విశ్లేష‌కులు!!. అంతేకాదు.. నెటిజ‌న్లు కూడా ఫిదా అవుతున్న ఈ రెండు