hyderabadupdates.com movies బ్యాంక్ లను మోసం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా?

బ్యాంక్ లను మోసం చేస్తే ఎలాంటి శిక్షలు ఉంటాయో తెలుసా?

హైదరాబాద్‌లో ఒక బార్ ఓనర్ అత్యాశ అతన్ని కటకటాల పాలు చేసింది. బ్యాంకును మోసం చేసి దర్జాగా తిరుగుతున్న ‘మల్లికా ఇన్ బార్ అండ్ రెస్టారెంట్’ యజమాని ఎల్. శ్రీనివాస్ గౌడ్‌కు నాంపల్లి కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. మనీ లాండరింగ్ కేసులో అతనికి ఏకంగా ఐదేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తూ సంచలనాత్మక తీర్పు చెప్పింది. బ్యాంకును బురిడీ కొట్టించి లక్షలు వెనకేసిన పాపానికి ఇప్పుడు జైలు ఊచలు లెక్కపెట్టాల్సి వచ్చింది.

అసలు ఇతను చేసిన స్కామ్ వింటే మైండ్ బ్లాక్ అవుతుంది. ఫెడరల్ బ్యాంక్ నుంచి లోన్ తీసుకోవడానికి సొంత తల్లి ఆస్తి పత్రాలనే ఫోర్జరీ చేశాడు. అక్కడితో ఆగకుండా, బ్యాంకు వాళ్లను నమ్మించడానికి తన తల్లి స్థానంలో వేరే మహిళను (Imposter) తల్లిగా నటించేలా చేసి సంతకాలు పెట్టించాడు. ఇంటి రెనోవేషన్ కోసం అని చెప్పి డబ్బు తీసుకుని, దాన్ని వేరే పనులకు మళ్లించాడు. ఇలా బ్యాంకుకు దాదాపు రూ. 44.8 లక్షల వరకు టోపీ పెట్టాడు.

తప్పు చేయడమే కాదు, చట్టానికి దొరక్కుండా తప్పించుకోవడానికి ఇతను సినిమా రేంజ్ డ్రామా ఆడాడు. కోర్టు విచారణకు హాజరుకాకుండా ఎగవేస్తూ పోలీసులకే చుక్కలు చూపించాడు. దీంతో కోర్టు ఇతనిపై నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు రంగంలోకి దిగి, కొన్ని వారాల పాటు నిఘా పెట్టి, పక్కా ప్లాన్‌తో అక్టోబర్‌లో ఇతన్ని అదుపులోకి తీసుకున్నారు.

జైలుకు వెళ్లకుండా బెయిల్ కోసం ఇతను చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కోర్టు అతని బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది. విచారణలో సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో నేరం రుజువైంది. మనీ లాండరింగ్ చట్టం (PMLA) కింద శ్రీనివాస్ గౌడ్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు, అతనికి మరియు అతని సంస్థకు కలిపి రూ. 25,000 జరిమానా విధించారు. బ్యాంకులను మోసం చేసి, దొంగ పత్రాలతో లోన్లు తీసుకుని తప్పించుకోవచ్చని అనుకునే వారికి ఈ తీర్పు ఒక గట్టి హెచ్చరిక. ఈడీ అధికారులు ఎంత సీరియస్‌గా నిఘా పెడతారో, తప్పు చేస్తే శిక్ష ఎంత కఠినంగా ఉంటుందో ఈ ఘటన నిరూపించింది.

Related Post

తెలుగు ప్రేక్షకుల ప్రేమకు భాష ఉండదుతెలుగు ప్రేక్షకుల ప్రేమకు భాష ఉండదు

నిన్న మధ్యాన్నం హఠాత్తుగా నిర్ణయం తీసుకుని కాంతార చాప్టర్ 1 ఏ లెజెండ్ రాత్రి ప్రీమియర్లు అప్పటికప్పుడు ఆన్ లైన్ లో జోడించారు. తెలంగాణలో లేనప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో అయినా వేద్దామని నిర్మాతలు తీసుకున్న నిర్ణయం ఏ మేరకు వర్కౌట్ అవుతుందోననే