hyderabadupdates.com movies బ్యాంక్ స్టేట్ మెంట్ చూడమంటున్న రాజుగారు

బ్యాంక్ స్టేట్ మెంట్ చూడమంటున్న రాజుగారు

కొద్దిరోజుల క్రితం టాక్సిక్ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు 120 కోట్లకు తీసుకున్నారనే వార్త మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిజంగా అంత మొత్తానికి కొన్నారా లేదానే దాని మీద పెద్ద  చర్చలే జరిగాయి. అంత మొత్తం రికవర్ కావాలంటే ఏపీ తెలంగాణ నుంచే రెండు వందల కోట్ల గ్రాస్ రావాలి. ఇది అంత సులభం కాదు.

కెజిఎఫ్ ని మించిన టాక్ వస్తేనే సాధ్యమవుతుంది. కానీ టాక్సిక్ మీద ఇంకా ఆ స్థాయిలో బజ్ లేదు. దీంతో ఇదేదో మార్కెటింగ్ గిమ్మిక్ గా, దురంధర్ 2ని ఎదురుకునేందుకు వేసిన ఎత్తుగడగా రకరకాల విశ్లేషణలు మొదలయ్యాయి. మార్కండేయ ఈవెంట్లో రాజుగారి వద్ద ఈ ప్రస్తావన రానే వచ్చింది.

ఎవరికైనా ఈ విషయంలో సందేహాలు ఉంటే నిర్మాతలకు డబ్బు వేసిన తర్వాత బ్యాంక్ స్టేట్ మెంట్ చూపిస్తానని, అప్పుడైనా ఒప్పుకుంటారేమో అని దిల్ రాజు పబ్లిక్ గా స్టేజి మీదే చెప్పేశారు. 120 కోట్ల నెంబర్ ఆయన నోటితో అనలేదు కానీ సమర్ధించేలానే చెప్పడం ఇక్కడ గమనించాల్సిన విషయం.

అయితే ఇది చాలా పెద్ద రిస్కని వేరే చెప్పనక్కర్లేదు. దురంధర్ 2తో తలపడుతూ ఇంత పెద్ద మొత్తం థియేటర్ బిజినెస్ మీద రాబట్టుకోవడం సులభంగా ఉండదు. అసలే టాక్సిక్ మీద రకరకాల వివాదాలు చుట్టుకుంటున్నాయి. కోర్టు కేసులంటూ కొత్త చిక్కుముడులు వచ్చే అవకాశాలు లేకపోలేదు.

అది జరిగితే డిస్ట్రిబ్యూటర్ గా దిల్ రాజుకి కొంత ఇబ్బంది తప్పదు. మార్చ్ 19 రాబోతున్న టాక్సిక్ త్వరలోనే పబ్లిసిటీలో దిగబోతోంది. ఇప్పటికైతే కాంట్రవర్సీ తెచ్చిన టీజర్ తప్ప ఇంకెలాంటి కంటెంట్ వదల్లేదు. యష్ ఫ్యాన్స్ వాటి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

కేవలం 37 రోజుల గడువు మాత్రమే ఉండటంతో ప్రచారాన్ని వేగవంతం చేయాలి. ముఖ్యంగా ఏపీ తెలంగాణకు సంబంధించి స్పెషల్ ప్లాన్స్ వేసుకోవాలి. దిల్ రాజుకున్న నెట్వర్క్ దృష్ట్యా థియేటర్లకు ఇబ్బందులు రావు కానీ టాక్ చాలా అంటే చాలా కీలకం కానుంది. దర్శకురాలు గీతూ మోహన్ దాస్ ఒక గ్యాంగ్ స్టర్ డ్రామాని ఎలా ప్రెజెంట్ చేశారో చూడాలి మరి.

Related Post

సెమీఫైనల్: బంగ్లా చేతిలో మన కుర్రాళ్ళ ‘సూపర్’ ఓటమిసెమీఫైనల్: బంగ్లా చేతిలో మన కుర్రాళ్ళ ‘సూపర్’ ఓటమి

​ఐపీఎల్‌లో సిక్సర్ల మోత మోగించే మన ‘స్టార్లు’ ఇవాళ బంగ్లాదేశ్ కుర్రాళ్ళ ముందు చతికిలపడ్డారు. కోట్లు పలికే మన ప్లేయర్లు, కనీసం ఒక్కటంటే ఒక్క పరుగు కూడా చేయకుండా సూపర్ ఓవర్‌లో ఫ్లాప్ అయ్యారు. అసలు స్కోర్ బోర్డు చూస్తే షాక్

డబుల్ అల్లరి చేయబోతున్న రావిపూడి హీరోలుడబుల్ అల్లరి చేయబోతున్న రావిపూడి హీరోలు

ఇంకా అధికారిక ప్రకటన రాలేదు కానీ అనిల్ రావిపూడి పదో సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అయితే జోరుగా జరుగుతోంది. నిర్మాతల పరంగా కూడా కొత్త కాంబినేషన్ ఉంటుందనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా ఉంది. హీరోలుగా వెంకటేష్, ఫహద్