hyderabadupdates.com movies బ్యాలెట్ పేపరుపై ఒకే పేరు.. ఒకే అభ్యర్థి.. 99.93 శాతం ఓటింగ్!

బ్యాలెట్ పేపరుపై ఒకే పేరు.. ఒకే అభ్యర్థి.. 99.93 శాతం ఓటింగ్!

ఇదేదో చిత్రంగా ఉంది కదా! అనుకుంటున్నారా? కానీ నిజమే. ఎక్కడైనా ఎన్నికలు జరిగితే కనీసం ఒక స్థానానికి ఇద్దరైనా పోటీ చేస్తారు. కానీ అక్కడ మాత్రం ఒకే అభ్యర్థి, ఒకే పేరు. ఓటు వేసేది మాత్రం ప్రజలు. చేసేది ఏముంది.. అదే పేరుకే, అదే నాయకుడికే ఓటేయాలి. లేకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇదే ఉత్తర కొరియా పరిస్థితి.

ఉత్తర కొరియా అంటేనే నియంత పాలన గుర్తుకు వస్తుంది. అక్కడి నాయకుడు కిమ్ జోంగ్ ఉన్. గత పదేళ్లుగా దేశాన్ని కఠిన నియంత్రణలో నడిపిస్తున్న ఆయన, ఈ నెల 15న దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహించారు. అధ్యక్ష పదవితో పాటు పార్లమెంట్ ఎన్నికలు కూడా నిర్వహించారు.

ఎన్నికలు అంటే పోటీ సహజం. కానీ ఇక్కడ మాత్రం ఒక్క అభ్యర్థి మాత్రమే పోటీ చేశాడు. ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్ విధానాన్ని ఉపయోగించారు. అర్హులైన ఓటర్లు తప్పనిసరిగా ఓటు వేయాలని ఆదేశించారు.

ఫలితంగా ప్రజలు క్యూలలో నిలబడి ఓటేశారు. మొత్తం ప్రక్రియ కేవలం 4 గంటల్లోనే పూర్తయింది. కిమ్ జోంగ్ ఉన్‌కు 99.93 శాతం ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన మళ్లీ అధ్యక్షుడిగా ప్రకటించారు.

మిగిలిన 0.07 శాతం ఓటు వేయని వారిని గుర్తించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. పార్లమెంట్‌లోని 687 స్థానాలను కూడా అధికార వర్కర్స్ పార్టీ కైవసం చేసుకుంది.

Related Post

Jana Nayagan: Thalapathy Vijay starrer’s trailer to release on December 31?Jana Nayagan: Thalapathy Vijay starrer’s trailer to release on December 31?

Thalapathy Vijay-starrer Jana Nayagan is slated to release in theaters on January 9, 2026, coinciding with Pongal/Sankranti next year. Ahead of its release, the makers seem to have planned the