hyderabadupdates.com Gallery బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ post thumbnail image

ముంబై : ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం ధురంధ‌ర్. పాకిస్తాన్ లో ఇండియ‌న్ ఆఫీస‌ర్ గూఢ‌చారిగా వ్య‌వ‌హ‌రించిన క‌థ‌నం ఆధారంగా తెర‌కెక్కించాడు. ఈ సినిమా విడుద‌లైన తొలి షో నుంచి భారీ ఎత్తున ఆద‌ర‌ణ చూర‌గొంది. ఏకంగా రూ. 1000 కోట్ల‌కు పైగా వ‌సూలు చేసింది. ఈ సినిమాను భారీ ధ‌ర‌కు కొనుగోలు చేసింది ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. అయితే ఈ సినిమా ఎప్పుడు స్ట్రీమింగ్ ఎప్పుడు అవుతుంద‌నే దానిపై అభిమానులు ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు. తెర‌పై స‌త్తా చాటిన ఈ మూవీ బిగ్ షాక్ ఇచ్చింది. సినీ వ‌ర్గాలు సైతం విస్తు పోయేలా కాసుల వ‌ర్షం కురిపించింది. తెర‌పై అద్భుత స‌క్సెస్ ను మూట‌గ‌ట్టుకున్న ఈ మూవీ ఇప్పుడు డిజిట‌ల్ రంగ ప్ర‌వేశానికి రెడీ అవుతోంది. అద్భుత‌మైన చిత్రీక‌ర‌ణ‌, ఆక‌ట్టుకునే సంభాష‌ణ‌లు, అంత‌కు మించి ర‌ణ్ వీర్ సింగ్ , సారా జాన్స‌న్ న‌టన అభిమానుల‌ను విస్మ‌య ప‌రిచింది.
ఇదిలా ఉండ‌గా సినీ ప‌రిశ్ర‌మ‌లో పెద్ద ఎత్తున దురంధ‌ర్ మూవీ స్ట్రీమింగ్ పై పెద్ద ఎత్తున చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 30న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంద‌ని టాక్. దీనిపై బ‌ల‌మైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అధికారిక ఓటీటీ విడుదల తేదీకి సంబంధించిన ప్రకటన కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ ఈ చిత్రం అన్‌కట్ వెర్షన్‌ను స్ట్రీమ్ చేయవచ్చని పుకార్లు వస్తున్నాయి, అయితే ఇది కూడా అధికారికంగా ధృవీకరించ లేదు సంస్థ‌. ఇక దురంధ‌ర్ మూవీ లో సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్ గా మారాడు అక్ష‌య్ ఖ‌న్నా. త‌ను ఈ సినిమాకు అస్సెట్ అయ్యాడ‌న‌డంలో సందేహం లేదు.
The post బ్లాక్ బ‌స్ట‌ర్ ధురంధ‌ర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ఐపీఎల్ పై క‌న్నేసిన హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్

న్యూఢిల్లీ : భార‌త జ‌ట్టు హెడ్ కోచ్ గౌత‌మ్ గంభీర్ సంచ‌ల‌నంగా మారాడు. త‌న ప‌ద‌వీ కాలం త్వ‌ర‌లో ముగియ‌నుంది. త‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వంలో భార‌త జ‌ట్టు ఈ ఏడాది జ‌రిగిన ఐసీసీ టి20 వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుచుకుంది. విశ్వ విజేత‌గా నిలిచింది.

10న ఎంపీగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం10న ఎంపీగా నితీశ్ కుమార్ ప్ర‌మాణ స్వీకారం

బీహార్ : బీహార్ రాష్ట్ర చ‌రిత్ర‌లో అరుదైన రికార్డ్ సృష్టించారు మాజీ సీఎం నితీశ్ కుమార్. ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. త‌న‌కు రాష్ట్ర స‌ర్కార్ జెడ్ ప్ల‌స్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌ను కొన‌సాగిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఆయ‌న ఒప్పందంలో భాగంగా త‌ను

Vangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనితVangalapudi Anitha: క్రీడాభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది – హోం మంత్రి అనిత

    అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో అండర్–19 రాష్ట్ర స్థాయి బాలబాలికల హాకీ చాంపియన్‌షిప్ పోటీలను రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత ప్రారంభించారు. ఈ పోటీలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుండి విద్యార్థులు హాజరయ్యారు. మూడు రోజులపాటు బాల, బాలికల