hyderabadupdates.com movies భగవంతుడు మీద ప్రతాప్ ప్రభావం

భగవంతుడు మీద ప్రతాప్ ప్రభావం

టాలెంట్ ఉన్నా టైం కలిసి రాక సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న అప్ కమింగ్ హీరోల్లో తిరువీర్ ఒకడు. పాపం ప్రతాప్ మీద చాలా ఆశలు పెట్టుకుని విపరీతమైన ప్రమోషన్లు చేశాడు. నిర్మాణ సంస్థ ఈటివి విన్ తమ శాయశక్తులా బెస్ట్ పబ్లిసిటీ ఇప్పించారు. ఖచ్చితంగా మంచి కంటెంట్ తో హిట్టు కొడతానని తిరువీర్ బలంగా చెప్పుకొచ్చాడు. తీరా చూస్తే రెండో వారంలోకి అడుగు పెట్టకముందే పాపం ప్రతాప్ వాషౌట్ అయిపోయింది. మొన్న సోమవారం నుంచే సెలవు తీసుకుంది.

ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోకి టాక్, రివ్యూస్ బాగున్నా జనాలు థియేటర్లకు రాలేదు. దానికి ప్రచారం విషయంలో జరిగిన లోపం ఆడియన్స్ కి సినిమా గురించి పూర్తిగా రిజిస్టర్ కాకుండా చేసింది. కానీ పాపం ప్రతాప్ అలా కాదు. తిమ్మరాజుపల్లి టీవీతో పోటీ పడి మరీ ప్రమోషన్లు హోరెత్తించారు. మీడియాని పరుగులు పెట్టించి ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చేశారు. ఇదంతా బూడిదలో పోసిన పన్నీరయ్యింది. ఇప్పుడు తిరువీర్ నెక్స్ట్ మూవీ భగవంతుడు రెడీ అవుతోంది.

తొంభై దశకం బ్యాక్ డ్రాప్ లో హింసాత్మక గ్రామీణ నేపథ్యంతో రూపొందిన భగవంతుడులో తిరువీర్ జానపద కళాకారుడిగా ఇంటెన్స్ క్యారెక్టర్ చేశాడు. వయొలెన్స్, యాక్షన్, ఫైట్స్, డివోషన్ అన్నీ ఉన్నాయి. ఒకవేళ పాపం ప్రతాప్ కనక పెద్ద హిట్ అయితే దాని ఎఫెక్ట్ సానుకూలంగా భగవంతుడు మీద పడి బిజినెస్ ఫిగర్లు పెరిగేవి. తిరువీర్ కూడా అదే లెక్కలో ఉన్నాడు. కానీ ఇప్పుడది తారుమారు అయ్యింది. నిర్మాత ఆశిస్తున్న రేట్లు భగవంతుడుకి రావడం లేదట.

ఫ్లాపులు అందరికీ వస్తాయి కానీ వీలైనంత త్వరగా వాటి నుంచి బయట పడి విజయాలు ఎలా అందుకోవాలో చూడాలి. తిరువీర్ ఈ విషయంలో లెక్క తప్పుతున్నాడు. స్టోరీలో వెరైటీ ఉందో లేదో, నటుడిగా తనకు ఛాలెంజ్ ఇస్తుందో లేదో చూసుకుంటున్నాడు తప్పించి కమర్షియల్ గా ఇలాంటి కంటెంట్లు థియేటర్స్ కు వర్కౌట్ అవుతాయా అని చూసుకోవడం లేదు. భగవంతుడు టీజర్, పాటలు చూస్తే ప్రామిసింగ్ గానే ఉన్నాయి. అసలు ముందిది రిలీజైతే బాగుండేదేమో. 

ఇదంతా పక్కన పెడితే భగవంతుడు కన్నా చాలా ఆలస్యంగా మొదలైన తిరువీర్ మరో సినిమా ఓహ్ సుకుమారి డబ్బింగ్ స్టేజికి వచ్చేసింది. ఇదే ముందు రిలీజైనా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రస్తుతానికి రెండు సినిమాల డేట్లు కన్ఫర్మ్ కాలేదు.

Related Post