hyderabadupdates.com Gallery భ‌ట్టి విక్ర‌మార్క సింగ‌రేణి స్కాం అబ‌ద్దం : సీఎం

భ‌ట్టి విక్ర‌మార్క సింగ‌రేణి స్కాం అబ‌ద్దం : సీఎం

భ‌ట్టి విక్ర‌మార్క సింగ‌రేణి స్కాం అబ‌ద్దం : సీఎం post thumbnail image

హైద‌రాబాద్ : రాష్ట్రంలో తాజాగా రాధాకృష్ణ ఆధ్వ‌ర్యంలోని ఆంధ్ర‌జ్యోతిలో సింగ‌రేణి లో స్కాం జ‌రిగింద‌ని, దీనిలో ముఖ్య‌మైన పాత్ర రాష్ట్ర ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క పాత్ర ఉందంటూ బ‌హిరంగంగానే ఆరోప‌ణ‌లు చేశారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు డిప్యూటీ సీఎం. ఆయ‌న నేరుగా మీడియాతో మాట్లాడారు . ఈ సంద‌ర్బంగా రాధాకృష్ణ‌పై భ‌గ్గుమ‌న్నారు. అస‌త్య క‌థ‌నాల‌ను వ‌డ్డి వారిస్తే చూస్తూ ఊరుకునేది లేద‌ని వార్నింగ్ ఇచ్చారు. ఎవ‌రి ప్ర‌యోజ‌నాల కోసం ఈ వార్త‌ను ప‌నిగట్టుకుని రాశారో ప్ర‌జ‌ల‌కు తెలుస‌న్నారు. తాను ప్ర‌జ‌ల కోసం రాజ‌కీయాల్లోకి వ‌చ్చాన‌ని చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు 40 ఏళ్లుగా తాను రాజ‌కీయాల‌లో ఉన్నాన‌ని కానీ ఎలాంటి మ‌చ్చ లేద‌న్నారు. కానీ కావాల‌ని ఇలాంటి త‌ప్పుడు క‌థ‌నాలు రాస్తానంటే చూస్తూ ఊరుకోనంటూ హెచ్చిరంచారు.
ఇదిలా ఉండ‌గా ఇవాళ ఆంధ్ర‌జ్యోతిలో వ‌చ్చిన క‌థ‌నంపై తీవ్రంగా స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదివారం జ‌రిగిన స‌మావేశంలో ఆయ‌న ప్ర‌సంగించారు. ఇలాంటి క‌థ‌నాలు మంచిది కాద‌న్నారు. త‌మ ప్ర‌భుత్వం పార‌ద‌ర్శ‌క పాల‌న సాగిస్తోంద‌ని చెప్పారు. భ‌ట్టి విక్ర‌మార్క‌కు ఇందులో ఎలాంటి సంబంధం లేద‌న్నారు. ఎన్టీవీ, ఏబీఎన్ ఛాన‌ళ్ల మ‌ధ్య వ్య‌క్తిగ‌త వైరాలు ఉంటే చూసుకోవాల‌ని, కానీ త‌మ‌ను, మంత్రుల‌ను అందులోకి లాగ‌వ‌ద్ద‌ని కోరారు. ఇలాంటి అసంబద్ద క‌థ‌నాలు రాయ‌డం వ‌ల్ల మీరు ప్ర‌జ‌ల్లో ప‌ల‌చ‌న అవుతార‌ని హిత‌వు ప‌లికారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక‌నైనా వార్త‌లు వ‌డ్డించేట‌ప్పుడు ముందు వెనుకా ఆలోచించుకుని ప్ర‌చురించాల‌ని, ప్ర‌సారం చేయాల‌ని సూచించారు.
The post భ‌ట్టి విక్ర‌మార్క సింగ‌రేణి స్కాం అబ‌ద్దం : సీఎం appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ – కేటీఆర్‌KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ – కేటీఆర్‌

KTR : గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏటా రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ… ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలిచ్చిందో చెప్పాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు డిమాండ్‌ చేశారు. మరో ఎన్నికల హామీ అయిన

PM Narendra Modi: దిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శPM Narendra Modi: దిల్లీ పేలుడు ఘటన బాధితులకు ప్రధాని మోదీ పరామర్శ

    దిల్లీలోని ఎర్రకోట సమీపంలో చోటుచేసుకున్న కారు పేలుడు ఘటనలో గాయపడిన వారిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరామర్శించారు. భూటాన్ పర్యటన ముగించుకుని స్వదేశానికి చేరుకున్న వెంటనే నేరుగా ఎల్‌ఎన్‌జేపీ ఆస్పత్రికి వెళ్లారు. గాయపడిన వారితో మాట్లాడి, త్వరగా కోలుకోవాలని

సీఎం కుర్చీ కోసం ఎలాంటి పోరు లేదుసీఎం కుర్చీ కోసం ఎలాంటి పోరు లేదు

బెంగ‌ళూరు : క‌ర్ణాట‌క సీఎం సిద్ద‌రామ‌య్య సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. త‌మ పార్టీలో ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కోసం ఎలాంటి పోరు లేద‌న్నారు. త‌న‌తో పాటు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ కూడా సీఎం ప‌ద‌విని ఆశిస్తున్నార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.