hyderabadupdates.com movies భారత్ అమ్ములపొదిలో అమెరికన్ ‘అస్త్రాలు’

భారత్ అమ్ములపొదిలో అమెరికన్ ‘అస్త్రాలు’

భారత రక్షణ రంగానికి అదిరిపోయే గుడ్ న్యూస్. మన సైనిక శక్తిని అమాంతం పెంచేందుకు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 93 మిలియన్ డాలర్ల (సుమారు రూ. 800 కోట్లు) విలువైన భారీ ఆయుధ ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ‘జావెలిన్’ యాంటీ ట్యాంక్ మిసైల్స్‌తో పాటు, శత్రువులను పిన్ పాయింట్ అక్యురసీతో కొట్టే ‘ఎక్స్‌కాలిబర్’ ఆర్టిలరీ మందుగుండు సామగ్రి కూడా ఉంది.

ఈ డీల్‌కు సంబంధించిన సర్టిఫికేషన్ పూర్తయిందని, అక్కడి పార్లమెంట్ కు సమాచారం ఇచ్చినట్లు అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ డీల్‌లో మొదటి భాగం జావెలిన్ మిసైల్ సిస్టమ్. దీని విలువ సుమారు 45.7 మిలియన్ డాలర్లు. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా ట్యాంకులను తుక్కుతుక్కు చేసిన ఈ జావెలిన్ క్షిపణులు ఇప్పుడు మన ఆర్మీ చేతికి రాబోతున్నాయి.

ఇందులో 25 కమాండ్ లాంచ్ యూనిట్లు, జావెలిన్ FGM 148 మిసైళ్లు ఉన్నాయి. ఇది ఒకసారి టార్గెట్ సెట్ చేసి వదిలేస్తే చాలు, శత్రువు ట్యాంక్ ఎక్కడున్నా వెతికి మరీ కొడుతుంది. ఇక రెండోది ఎక్స్‌కాలిబర్ ప్రొజెక్టైల్స్. దీని విలువ 47.1 మిలియన్ డాలర్లు. ఇందులో భాగంగా భారత్ 216 ఎక్స్‌కాలిబర్ (M982A1) రౌండ్లను కొనుగోలు చేయనుంది.

ఇవి సాధారణ బాంబులు కాదు. జీపీఎస్ సాయంతో పనిచేసే స్మార్ట్ ఆర్టిలరీ షెల్స్. శత్రువుల బంకర్లు ఎంత దూరంలో ఉన్నా, అత్యంత కచ్చితత్వంతో, పక్కన ఉన్న సివిలియన్లకు హాని కలగకుండా కేవలం టార్గెట్‌ను మాత్రమే ధ్వంసం చేయడం వీటి స్పెషాలిటీ. ఈ ఆయుధాల అమ్మకం వల్ల ఈ ప్రాంతంలో సైనిక సమతుల్యత దెబ్బతినదని, పైగా ఇది ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వానికి దోహదపడుతుందని అమెరికా పేర్కొంది. భారత్ తమకు అత్యంత కీలకమైన రక్షణ భాగస్వామి అని, ప్రస్తుత, భవిష్యత్తు ముప్పులను ఎదుర్కోవడానికి ఈ ఆయుధాలు భారత్‌కు ఎంతగానో ఉపయోగపడతాయని DSCA వెల్లడించింది.

చైనా, పాకిస్థాన్ వంటి పొరుగు దేశాల నుంచి సవాళ్లు ఎదురవుతున్న వేళ, ఈ డీల్ భారత్‌కు కొండంత బలాన్నిస్తుంది. ముఖ్యంగా సరిహద్దుల్లో పర్వత ప్రాంతాల్లో యుద్ధం చేయాల్సి వస్తే జావెలిన్, ఎక్స్‌కాలిబర్ రెండూ గేమ్ ఛేంజర్లుగా మారతాయి. ఈ కొత్త అస్త్రాలతో భారత ఆర్మీ ఫైర్ పవర్ నెక్స్ట్ లెవల్‌కు వెళ్లడం ఖాయం.

Related Post

రవితేజ ఆగేది లేదు… తగ్గేది లేదురవితేజ ఆగేది లేదు… తగ్గేది లేదు

బాక్సాఫీస్ ఫలితాలతో పట్టింపు లేకుండా తన పని నటించడం వరకేననే ధోరణి రవితేజ ప్రత్యేకత. వేగంగా సినిమాలు చేయడం వల్లే ఫ్లాపులు పడుతున్నాయని అభిమానులు ఫీలవుతున్నప్పటికీ, ఆ స్పీడ్ ని సరిగ్గా వాడుకోకుండా డిజాస్టర్లు ఇస్తున్న దర్శకుల తప్పుని విస్మరించకూడదు. ఇటీవలే

హైదరాబాద్‌లో ఐమాక్స్.. స్పందించిన యంగ్ లేడీ ప్రొడ్యూసర్హైదరాబాద్‌లో ఐమాక్స్.. స్పందించిన యంగ్ లేడీ ప్రొడ్యూసర్

దేశంలో తెలుగు రాష్ట్రాలను మించిన సినీ అభిమానం ఇంకెక్కడా ఉండదు అంటే అతిశయోక్తి కాదు. దీని గురించి ఇతర భాషల వాళ్లు కూడా గొప్పగా చెబుతుంటారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలిపి ఒక యూనిట్‌గా తీసుకుంటే.. ఇక్కడున్నన్ని థియేటర్లు దేశంలో మరే