hyderabadupdates.com movies భార్యతో విజయ్ భారీ డీల్?

భార్యతో విజయ్ భారీ డీల్?

ఒక ప్రముఖ సినీ నటుడు రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నాడంటే.. అతడి బలహీనతల మీద అవతలి రాజకీయ పక్షాలు దృష్టిసారించడం.. ముఖ్యంగా వ్యక్తిగత జీవితంలో ఏవైనా గొడవలు, వివాదాలు ఉంటే వాటిని సొమ్ము చేసుకోవాలని ప్రయత్నించడం మామూలే. తమిళ టాప్ స్టార్ విజయ్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.

తన భార్య సంగీతతో 20 ఏళ్లకు పైగా అన్యోన్యంగానే ఉన్నాడు విజయ్. కానీ కొన్నేళ్ల ముందు వీరి బంధం బీటలు వారింది. అప్పట్నుంచి విజయ్, సంగీత విడిగానే ఉంటున్నారు. తాజాగా ఆమె విడాకుల కోసం దరఖాస్తు కూడా చేసింది. అదే సమయంలో తన భర్తకు అక్రమ సంబంధం ఉందని చెప్పడంతో పాటు అనేక ఆరోపణలు చేసింది సంగీత. దీంతో సీనియర్ హీరోయిన్ త్రిషతో విజయ్ బంధం గురించి పెద్ద చర్చ జరుగుతోంది. వారం రోజులుగా ఈ వ్యవహారం సోషల్ మీడియాను ఊపేస్తోంది. అధికార డీఎంకే పార్టీ ఈ ఇష్యూను తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తోంది.

ఐతే విడాకుల వ్యవహారం ఎక్కువ రోజులు మీడియాలో నానకుండా దాన్ని ఒక కొలిక్కి తెచ్చేయాలని విజయ్ చూస్తున్నట్లు తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కోర్టులో కంటే ముందు బయట సెటిల్ చేసుకోవడానికి అతను ప్రయత్నిస్తున్నాడట. రూ.250 కోట్లకు ఈ సెటిల్మెంట్‌ను పూర్తి చేసేందుకు చూస్తున్నాడట.

భార్య, పిల్లల కోసం ఈ మొత్తాన్ని అందజేయనున్న విజయ్.. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. విజయ్, సంగీత దంపతులకు జేసన్ సంజయ్, సాషా అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు. జేసన్ ప్రస్తుతం దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని సందీప్ కిషన్ హీరోగా రూపొందిస్తున్నాడు. సాషా చదువుకుంటోంది. విజయ్ వ్యక్తిగత విషయాలు మీడియాలో ఎక్కువ రచ్చ కాకుండా వీలైనంత త్వరగా ఈ వ్యవహారానికి ఫుల్ స్టాప్ పెట్టాలని మధ్యవర్తులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

Related Post

తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?తారక్ ‘డ్రాగన్’ కోసం మరో హీరో ?

జూనియర్ ఎన్టీఆర్, దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న డ్రాగన్ (ప్రచారంలో ఉన్న టైటిల్) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ కు షిఫ్ట్ అయ్యింది. విదేశాల్లో ప్లాన్ చేసుకున్న షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీమ్ ఇప్పుడు కీలకమైన ఘట్టం కోసం రెడీ అవుతోంది.

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారురోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న మార్కెట్ ని సరిపోదా శనివారం, హిట్ 3తో బలపరుచుకుని ఆగస్ట్ లో రిలీజయ్యే ది ప్యారడైజ్ తో దాన్ని పీక్స్