hyderabadupdates.com movies భార్య కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ… 4 కోట్ల విరాళం

భార్య కోసం 78 ఏళ్ల వయసులో ఫుడ్ డెలివరీ… 4 కోట్ల విరాళం

​కష్టం ఎదురైనప్పుడు వయసుతో సంబంధం లేకుండా పోరాడే మనస్తత్వం కొందరికే ఉంటుంది. అమెరికాలోని టెన్నెస్సీ రాష్ట్రానికి చెందిన 78 ఏళ్ల రిచర్డ్ పుల్లీ అటువంటి కోవకు చెందిన వ్యక్తి. తన భార్య మెడికల్ బిల్లులు కట్టేందుకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవ్వడంతో, ఈ వయసులో ఫుడ్ డెలివరీ బాయ్‌గా మారారు. ఆయన పడుతున్న శ్రమను చూసి చలించిన నెటిజన్లు ఏకంగా 5 లక్షల డాలర్లు (సుమారు రూ. 4.6 కోట్లు) విరాళంగా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు.

​రిచర్డ్ ఒక ఇంటికి వెళ్లి స్టార్‌బక్స్ ఆర్డర్‌ను డెలివరీ చేస్తున్న దృశ్యాలను బ్రిటనీ స్మిత్ అనే మహిళ వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వయసులో ఆయన ఎంతో జాగ్రత్తగా, నిమ్మదిగా నడుస్తూ ఆర్డర్‌ను డోర్ వద్ద పెట్టిన తీరు నెటిజన్ల మనసు గెలుచుకుంది. భార్య అనారోగ్యానికి చికిత్స చేయించడానికి వేలల్లో డాలర్లు అవసరం అవ్వడంతో, రిచర్డ్ విశ్రాంతి తీసుకోకుండా ఇలా పని చేస్తున్నారని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు.

​ఈ వీడియో కాస్తా వైరల్ అవ్వడంతో సోషల్ మీడియా యూజర్లు  వివరాలను సేకరించి సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. మొదట కేవలం గుర్తింపు కోసమే ప్రయత్నించినప్పటికీ, ఆయన పరిస్థితి తెలుసుకున్న వేలాది మంది నెటిజన్లు భారీగా విరాళాలు పంపారు. కేవలం కొద్ది గంటల్లోనే దాదాపు 4 కోట్లకు పైగా నగదు జమ అయ్యింది. ట్రెండింగ్ పాలిటిక్స్ కోఫౌండర్ కొలిన్ రగ్ కూడా ఈ వీడియోను షేర్ చేస్తూ ఆ వృద్ధ దంపతుల కష్టాలను ప్రపంచానికి వివరించారు.

​ప్రస్తుతం చాలామంది తమ సమస్యల గురించి ఫిర్యాదులు చేస్తుంటారు. కానీ రిచర్డ్ మాత్రం తన భార్య కోసం ఈ వయసులోనూ కష్టపడటాన్ని చూసి నెటిజన్లు రియల్ హీరో అని కొనియాడుతున్నారు. డెలివరీ ఇస్తున్నప్పుడు చూపించిన నిబద్ధత, వినయం అందరినీ కదిలించాయి.

వచ్చిన విరాళాలతో ఇప్పుడు రిచర్డ్ దంపతులకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించినట్లయింది. భార్య మెడికల్ బిల్లులు కట్టడంతో పాటు, వారి తదుపరి జీవితానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ మొత్తం సరిపోతుంది. ​సాధారణంగా సోషల్ మీడియాను కాలక్షేపం కోసమే వాడతారని అనుకుంటారు. కానీ ఇలాంటి సంఘటనలు చూసినప్పుడు మానవత్వం ఇంకా బతికే ఉందని అర్థమవుతోంది. ఒక చిన్న వీడియో ఒక నిరుపేద వృద్ధ దంపతుల జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.

Related Post

తాట తీస్తాం.. స్మగ్లర్లకు పవన్ మాస్ వార్నింగ్తాట తీస్తాం.. స్మగ్లర్లకు పవన్ మాస్ వార్నింగ్

ఎర్రచందనం స్మగ్లర్లకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి జిల్లా మంగళంలో ఉన్న అటవీశాఖ ఎర్రచందనం గోడౌన్ ను ఈరోజు ఆయన సందర్శించారు. అక్కడ ఉన్న 8 గోడౌన్లో నిల్వ చేసిన ఎర్రచందనం లాట్ల వివరాలను తెలుసుకున్నారు.

రష్మిక కమిట్మెంట్‌కు హ్యాట్సాఫ్రష్మిక కమిట్మెంట్‌కు హ్యాట్సాఫ్

ఈ మధ్యే బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే తెలుగులో తెరకెక్కనున్న రెండు ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. ముందుగా ‘స్పిరిట్’కు దూరమైన ఆమె.. తర్వాత తాను కీలక పాత్ర పోషించిన ‘కల్కి’ సినిమాకు కొనసాగింపుగా రావాల్సిన ‘కల్కి-2’ నుంచి కూడా వైదొలిగింది.