hyderabadupdates.com movies భోగాపురంలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది ఎప్పుడూ?

భోగాపురంలో ఫ్లైట్ ల్యాండ్ అయ్యేది ఎప్పుడూ?

ఏపీకి సంబంధించి అందరూ ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఒకటి భోగాపురం ఎయిర్ పోర్టు. భారీగా చేపట్టిన ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే.. ఉత్తరాంధ్ర డెవలప్ మెంట్ మరోస్థాయికి చేరుకుంటుందన్న అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ అంతర్జాతీయ విమానాశ్రయంతో ఏపీలోని విశాఖకు.. మిగిలిన ప్రపంచానికి దూరం మరింత దగ్గర అవుతుందని చెప్పాలి.

ఇప్పటికే ఎయిర్ పోర్టు పనులు 97 శాతం పూర్తయ్యాయి. తాజా అంచనాల ప్రకారం ఈ జులైలో కానీ లేదంటే ఆగస్టులో పక్కాగా ఈ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఖాయంగా ప్రారంభమవుతుందని చెబుతున్నారు.

జీఎంఆర్ నిర్మిస్తున్న ఈ ఎయిర్ పోర్టు పనులు తుదిదశకు చేరుకున్నాయి. ఇప్పటివరకు ఉన్న అంచనాల ప్రకారం జులై 5, 8 తేదీల్లో కానీ ఆగస్టు 17, 19 తేదీల్లో ఏదో ఒక రోజున ఎయిర్ పోర్టు ఓపెనింగ్ ఉంటుందని చెబుతున్నారు. ఎర్త్ రన్ వే పనులు వంద శాతం పూర్తి కాగా.. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనులు 95 శాతం పూర్తయ్యాయి. రహదారుల కనెక్టివిటీ పనులు కూడా పూర్తి కావొస్తున్నాయి.

ఎర్రబస్సు కూడా రాని చోట ఎయిర్ పోర్టు అవసరమా? అన్న విమర్శలు గతంలో వచ్చాయని.. ఇప్పుడు ఇదే ప్రాంతంలో ఎయిర్ పోర్టు నిర్మాణం పూర్తి కావటమే కాదు.. ప్రారంభానికి సిద్ధం కావటాన్ని ప్రస్తావిస్తూ ఏపీ రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నిజానికి షెడ్యూల్ ప్రకారం చూస్తే.. ఈపాటికే ఎయిర్ పోర్టు పూర్తి కావాల్సి ఉంది. కాస్త ఆలస్యమైనా.. నిర్మాణం పూర్తి కావటం.. త్వరలోనే ఎయిర్ పోర్టు అధికారికంగా ప్రారంభం కావటంపై విశాఖ ప్రజలు ఎంతో ఉత్సాహంగా ఉన్న పరిస్థితి.

Related Post

తన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరుతన దర్శకులపై ప్రభాస్ ప్రేమే వేరు

కెరీర్లో ఎదిగే క్రమంలో తమకు మంచి విజయాలు అందించిన దర్శకులను గుర్తు పెట్టుకుని వారి మీద కృతజ్ఞత చూపించే లక్షణం అందరు హీరోల్లోనూ చూడలేం. రేంజ్ పెరిగే కొద్దీ అహంకారం పెరిగిపోతుంది. సందర్భం వచ్చినా తమకు బ్రేక్ ఇచ్చిన దర్శకుల గురించి మాట్లాడరు. అలాగే సాయం అవసరమైనపుడు చేయి అందించే వాళ్లు

Anaconda Movie Review: Jack Black and Paul Rudd’s creature thriller finds its bite in second halfAnaconda Movie Review: Jack Black and Paul Rudd’s creature thriller finds its bite in second half

Performances The film’s four leads deliver solid, serviceable performances within the constraints of the script.  Jack Black as Doug McCallister brings a grounded energy, balancing panic with resilience once the