hyderabadupdates.com movies మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

మండలి చైర్మన్ నే కొట్టిన వైసీపీ మంత్రి ఎవరు?

ఏపీకి అమరావతి ఏకైక, శాశ్వత రాజధానిగా కొనసాగేందుకు అవసరమైన చట్ట సవరణలు సవ్యంగా ముగిసిన వేళ… అమరావతిని చిదిమేసేందుకు వైసీపీ చేసిన దాష్టీకం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం అమరావతిని శాసన రాజధానికి పరిమితం చేసే దిశగా యత్నించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా అసెంబ్లీలో పాసై శాసనమండలికి వచ్చిన మూడు రాజధానుల బిల్లును నాడు మండలి చైర్మన్ గా కొనసాగిన మహ్మద్ షరీఫ్ అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందన్న విషయాన్ని తాజాగా గురువారం షరీఫ్ బయట పెట్టారు. నాడు మంత్రిగా కొనసాగిన ఓ వైసీపీ కీలక నేత తనపై చేయి చేసుకున్నారని షరీఫ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

అమరావతిని ఏపీకి శాశ్వత రాజధానిగా చేయాలని ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని బుధ, గురువారాల్లో పార్లమెంటు ఆమోదించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అమరావతి పరిధిలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో పాలుపంచుకున్న సందర్భంగా షరీఫ్ నాడు తనపై వైసీపీ నేతలు ఏ రీతిన వ్యవహరించారన్న విషయాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. మూడు రాజధానుల బిల్లుకు ఆమోద ముద్ర లభించేలా వ్యవహరించాలని తనను వైసీపీ నేతలు ప్రలోభాలకు గురి చేశారని ఆయన తెలిపారు. ప్రలోభాలకు లొంగని తనను తమ దారికి తెచ్చుకునేలా వైసీపీ నేతలు తనపై బెదిరింపులకూ దిగారని ఆయన చెప్పారు.

సభలో బిల్లును ప్రవేశపెట్టడానికి ముందే వైసీపీ నేతలు తనను తమ దారికి తెచ్చుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ప్రయోగించారని షరీఫ్ తెలిపారు. అయితే తాను నిబంధనల మేరకే నడుచుకుంటానని, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారన్నారు.

టీడీపీ నేతలు డబ్బున్న వారని, వారిపై కేసులు పడినా మంచి లాయర్లను పెట్టుకుని వారంతా బయటపడతారని, మీరే అన్యాయమైపోతారని తనను బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లు సభ ముందుకు వచ్చినప్పుడు కుర్చీలు, టేబుళ్లపైకి ఎక్కిన వైసీపీ నేతలు… చివరకు తన పోడియం వద్దకు చేరుకుని తనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన తెలిపారు. 

ఈ సందర్భంగా కొందరు వైసీపీ నేతలు తనపై పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేశారని షరీఫ్ చెప్పుకొచ్చారు. అయినా కూడా భయపడని తాను నిబంధనల మేరకే బిల్లును అడ్డుకున్నానని తెలిపారు.అనంతరం సభ నుంచి తనను బయటకు వెళ్లకుండా అడ్డుకోవాలని వైసీపీ నేతలు యత్నించగా…

టీడీపీ సభ్యులు తనకు తోడుగా నిలిచారని తెలిపారు. ఈ సందర్భంగా నాడు జగన్ కేబినెట్ లో ఉన్న ఓ మంత్రి తనను కులం పేరుతో పాటు పుట్టుకనూ ప్రస్తావిస్తూ తిట్టిపోశారన్నారు. అంతేకాకుండా ఆ మంత్రి తన గుండెపై కొట్టారని షరీఫ్ వెల్లడించారు. ఇలా తనను ప్రలోభాలకు గురి చేసిన వారిలో నాటి సీఎం తప్పించి అందరూ ప్రత్యక్షంగా పాలుపంచుకున్నారని షరీఫ్ తెలిపారు.

సంచలన వ్యాఖ్యలు చేసిన ఏపీ మండలి మాజీ చైర్మన్, షరీఫ్!”మూడు రాజధానుల బిల్లు వివాద సమయంలో ఒక (వైసీపీ) మంత్రి నా పుట్టుకను దోషించాడు..అలా దోషించడమే కాకుండా నా గుండెల మీద కొట్టాడు.”– #Sharif pic.twitter.com/KobtvnARau— Gulte (@GulteOfficial) April 2, 2026

Related Post

“Dhandoraa Will Leave Audiences with a Powerful, Uplifting Experience” – Director MuraliKanth“Dhandoraa Will Leave Audiences with a Powerful, Uplifting Experience” – Director MuraliKanth

After backing distinctive films such as Colour Photo and the blockbuster Bedurulanka 2012, Loukya Entertainments head Ravindra Banerjee Muppaneni returns with his latest production Dhandoraa. Directed by MuraliKanth, the film

వేగంగా సినిమా తీయడం సంతోషమే కానీవేగంగా సినిమా తీయడం సంతోషమే కానీ

నిన్న జరిగిన ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ చెప్పిన ఒక పాయింట్ ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లోనూ డిస్కషన్ గా మారింది. ఈ సినిమాని కేవలం నలభై అయిదు రోజుల్లో పూర్తి చేశామని, మైత్రి –