ఎన్టీఆర్ జిల్లా : ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. మైలవరం పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. భోజనం నాణ్యతపై ప్రతివారం తల్లిదండ్రులకు ఫోన్ చేయాలని, ఐవీఆర్ఎస్ ద్వారా వారి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలని ఆదేశించారు. పాఠశాలలో విద్యా బోధన తీరు, పాఠశాల పరిసరాలు, రికార్డులను పరిశీలించారు. ప్రతి పాఠశాల తనకు ముఖ్యమేనని, అడ్మిషన్ల పెంపుతో పాటు విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాల మెరుగుకు చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం పాఠశాలలో ఉన్న అంగన్ వాడీ కేంద్రాన్ని మంత్రి సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న ఆహారాన్ని, అంగన్ వాడీ కేంద్రం పరిశుభ్రతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.
మైలవరం ఘటన నేపథ్యంలో విద్యార్థులకు అందే మధ్యాహ్న భోజనం పథకంపై ఇటీవల సమీక్షించిన మంత్రి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం నాణ్యంగా లేకపోతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. భోజనం సిద్ధమయ్యాక ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు నాణ్యత పరిశీలించాలని స్పష్టం చేశారు. బాగుందని నిర్థారించాకే విద్యార్థులకు పెట్టాలని ఆదేశించారు. వారంలో ఒకరోజు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలో ఒక పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేయాలన్నారు. భోజనం గురించి విద్యార్థులు చెబితే తల్లిదండ్రులు వెంటనే లీప్ యాప్ ద్వారా ఫిర్యాదులు, సూచనలు అందించాలని అన్నారు. సమూల మార్పు కోసం త్వరలోనే సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థను యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని ఆదేశించారు నారా లోకేష్.
The post మధ్యాహ్న భోజన పథకం అమలుపై నారా లోకేష్ ఆరా appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.
మధ్యాహ్న భోజన పథకం అమలుపై నారా లోకేష్ ఆరా
Categories: