hyderabadupdates.com movies మరణంలోనూ ఐదుగురికి ప్రాణం పోసిన పది నెలల చిన్నారి

మరణంలోనూ ఐదుగురికి ప్రాణం పోసిన పది నెలల చిన్నారి

​కేరళలో ఒక హృదయ విదారక ఘటన అందరినీ కంటతడి పెట్టిస్తోంది. కేవలం పది నెలల వయసున్న అలిన్ షెరిన్ అబ్రహం అనే పసికందు, తాను కన్నుమూస్తూ ఐదుగురి జీవితాల్లో వెలుగులు నింపింది. పతనంతిట్ట జిల్లాకు చెందిన ఈ చిన్నారి, కేరళలోనే అతి పిన్న వయస్కురాలైన అవయవ దాతగా ఒక గొప్ప చరిత్రను లిఖించింది. తన మరణంతో మరో ఆరు నెలల చిన్నారితో సహా మొత్తం ఐదుగురికి ఈ పాప కొత్త జీవితాన్ని ప్రసాదించింది.

ఫిబ్రవరి 5న జరిగిన ఒక రోడ్డు ప్రమాదం అందరిని కలచివేసింది. కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన వాహనం బలంగా ఢీకొనడంతో అలిన్ తీవ్రంగా గాయపడింది. కొట్టాయం, తిరువల్ల ఆసుపత్రుల్లో చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు కొచ్చిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫిబ్రవరి 13న ఆ చిన్నారి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు ప్రకటించారు.

​పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ అలిన్ తల్లిదండ్రులు ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డ ఇక తిరిగి రాదని తెలిసినా, ఆమె అవయవాల ద్వారా కనీసం మరికొందరైనా బతుకుతారనే ఆశతో దానానికి అంగీకరించారు. దీనివల్ల అలిన్ కాలేయం, రెండు కిడ్నీలు, గుండె కవాటం, రెండు కళ్లను సేకరించారు. పాప కాలేయాన్ని తిరువనంతపురంలో చావుబతుకుల్లో ఉన్న ఆరు నెలల బాబుకు విజయవంతంగా అమర్చారు.

​అవయవాల తరలింపు కోసం కేరళ ప్రభుత్వం ఒక భారీ ఆపరేషన్ చేపట్టింది. కొచ్చి నుంచి తిరువనంతపురం వరకు సాధారణంగా ఆరు గంటలు పట్టే ప్రయాణాన్ని, పోలీసులు, ప్రజల సహకారంతో అంబులెన్స్ కేవలం 3 గంటల 15 నిమిషాల్లోనే పూర్తి చేసింది. గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి అత్యంత వేగంగా అవయవాలను చేరవేసి ఆ పసిప్రాణాలను కాపాడారు.

​తీవ్ర విషాదంలో ఉండి కూడా పరుల ప్రాణాల కోసం ఆలోచించిన అలిన్ తల్లిదండ్రులకు కేరళ ఆరోగ్య మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మిషన్‌లో పాలుపంచుకున్న ఆరోగ్య కార్యకర్తలు, పోలీసులు అంబులెన్స్ డ్రైవర్లను ఆమె ప్రత్యేకంగా అభినందించారు.

Related Post

ఫిట్‌నెస్ ముఖ్యం బిగిలు.. రోహిత్‌కు బీసీసీఐ స్వీట్ వార్నింగ్?ఫిట్‌నెస్ ముఖ్యం బిగిలు.. రోహిత్‌కు బీసీసీఐ స్వీట్ వార్నింగ్?

సౌతాఫ్రికాతో వన్డే సిరీస్ మొదలవ్వక ముందే, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఫ్యూచర్‌పై బీసీసీఐలో పెద్ద చర్చే నడుస్తోంది. ఈ సిరీస్ అయిపోగానే అహ్మదాబాద్‌లో ఒక సీక్రెట్ మీటింగ్ జరగబోతోంది. అందులో 2027 వన్డే వరల్డ్ కప్ రోడ్‌మ్యాప్ గురించి గట్టిగానే

కూలీ మిస్ చేసింది దురంధర్ చూపించిందికూలీ మిస్ చేసింది దురంధర్ చూపించింది

కూలీలో నాగార్జున విలన్ గా నటిస్తారని దర్శకుడు లోకేష్ కనగరాజ్ ప్రకటించినప్పుడు అంచనాలు ఎక్కడికో వెళ్లిపోయాయి. చాలా వయొలెంట్ గా ఉంటుందని, రక్షకుడులో ఆయన స్వాగ్ కి ఫ్యాన్ అయ్యాక అప్పటి నుంచే ఇలాంటి క్యారెక్టరైజేషన్ రాసుకున్నానని చాలా కబుర్లు చెప్పాడు.