hyderabadupdates.com Gallery మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు

మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు post thumbnail image

తిరుపతి : టిటిడి మహిళా సంక్షేమ విభాగానికి చెందిన అధ్యక్షురాలు, ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర మరణానంతరం తన పార్థివ దేహం స్విమ్స్ – శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్ లో టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ ను కలిసి అఫిడవిట్ ను అందజేశారు. ఈ సందర్భంగా కె. ఇందిర మాట్లాడుతూ గత నవంబర్ 15వ తేదీన తన భర్త డా. కె. శివాజీ పలు కార్పోరేట్ కాలేజీలలో ఫ్యాకల్టీగా పనిచేశారని, తాను చనిపోయినా విద్యార్థులకు ఉపయోగపడాలనే సదుద్దేశ్యంతో మరణానంతరం తన భర్త పార్థివ దేహం మెడికల్ కాలేజీకి డొనేషన్ చేశామన్నారు. తన భర్త కోరిక మేరకు తాను చనిపోయాక తన పార్థివ దేహం మెడికల్ కాలేజీ విద్యార్థులకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో అందుకు సంబంధించిన అఫిడవిట్ ను టిటిడి ఈవోకు అందజేశారు.
కె. ఇందిర నిర్ణయాన్ని టిటిడి ఈవో శ్రీ అనిల్ కుమార్ సింఘాల్ అభినందించారు. మరణానంతరం పార్థీవ దేహం మట్టిలో కలిసిపోవడం కన్నా మెడికల్ విద్యార్థులకు ఉపయోగపడేలా కె. ఇందిర నిర్ణయం తీసుకోవడం హర్షణీయం అని తెలిపారు. అందుకు సంబంధించిన అఫిడవిట్ ను పద్మావతి మెడికల్ కళాశాల అనాటమి డిపార్ట్ మెంట్ అధికారులకు టిటిడీ ఈవో పంపించారు. గతంలో తిరుపతిలోని లీలా మహల్ వద్ద భార్యా భర్తలిద్దరూ కార్పొరేట్ స్కూలు స్థాపించారు. ఎంతోమంది విద్యార్థులకు తక్కువ ఫీజులతో చదువు చెప్పించడంతో పాటు కొంత మందికి ఉపాధి చూపించవచ్చు అనే ఉద్దేశ్యంతో భార్యాభర్తలు ఇద్దరూ కలిసి స్కూలును స్థాపించారు.
The post మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటుప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో ఎన్టీఆర్ విగ్ర‌హం ఏర్పాటు

అమరావతి : రాజధాని అమరావతి ప్రాంతం నీరుకొండలో బడుగు, బలహీన వర్గాల ఆరాధ్య దైవం అన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రజల‌ భాగస్వామ్యంతో నిర్మిస్తున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనత‌, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. అన్న ఎన్టీఆర్

Amaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లుAmaravati: అమరావతి, గన్నవరంలో మెగా రైల్‌ టెర్మినళ్లు

Amaravati : అమరావతి, గన్నవరంలలో మెగా టెర్మినళ్లు నిర్మించేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధంచేసింది. అమరావతి (Amaravati) మీదుగా భవిష్యత్‌లో పెద్దఎత్తున రైళ్ల రాకపోకలు సాగనుండటంతో… వాటికి అనువుగా 8 ప్లాట్‌ఫాంలతో టెర్మినల్‌ నిర్మాణానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక్కడ రైళ్ల నిర్వహణ పనులు

జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!జటాధర ట్రైలర్‌ మామూలుగా లేదుగా..!

టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు హీరోగా, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తెలుగులో మొదటిసారి నటిస్తున్న సినిమా “జటాధర” ఇప్పుడు ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఈ సినిమాకు వెంకట్ కళ్యాణ్, అభిషేక్ జైస్వాల్ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ