hyderabadupdates.com movies మరోసారి పుట్టపర్తికి చంద్రబాబు..

మరోసారి పుట్టపర్తికి చంద్రబాబు..

వారం వ్యవధిలో మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుట్టపర్తికి వెళ్లారు. సత్యసాయి బాబా శత జయంతి వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లవ్ ఆల్..సర్వ్ ఆల్, ఎప్పుడూ సేవ చేస్తూనే ఉండాలి… ఎవ్వరిని నొప్పించకూడదు అనేది సత్యసాయిబాబా సిద్దాంతం అన్నారు.

సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా అనేది సత్యసాయి బాబా ప్రవచించిన ఐదు సూత్రాలు. ఈ సూత్రాలను పాటిస్తే ప్రపంచం శాంతిగా ఉంటుందన్నారు. ఆంధ్రా, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ప్రజలకు తాగు నీటి సౌకర్యాన్ని కల్పించారని తెలిపారు. సత్యసాయి బాబాతో నాకు మంచి అనుబంధం ఉందన్నారు తాగు నీటి ప్రాజెక్టు కోసం అవసరమైతే ప్రశాంతి నిలయాన్ని తాకట్టు పెట్టాలని సత్యసాయి బాబా భావించారు. కానీ ఆయన అభిప్రాయాన్ని తెలుసుకున్న భక్తులు… పెద్ద ఎత్తున విరాళాలు సేకరించి తాగు నీటి ప్రాజెక్టులకు నిధులు సమకూర్చాలని తెలిపారు.ఇప్పటికే అదే స్పూర్తిని సత్యసాయి బాబా భక్తులు కొనసాగించడాన్ని నాకు సంతోషాన్నిస్తోంది అన్నారు.

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతజయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పుట్టపర్తి చేరుకున్నారు. పుట్టపర్తి విమానాశ్రయంలో రాష్ట్రపతికి సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. ప్రశాంతి నిలయంలో జరిగే భగవాన్ సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో పాల్గొన్నారు.

Related Post

గోదావ‌రి యాస‌… తెలంగాణ కుర్రాడు అద‌ర‌గొట్టాడేగోదావ‌రి యాస‌… తెలంగాణ కుర్రాడు అద‌ర‌గొట్టాడే

ఆంధ్ర నేప‌థ్యం ఉన్న న‌టులు తెలంగాణ యాస‌లో డైలాగులు చెప్పాలంటే ఇబ్బంది ప‌డ‌తారు. అదే స‌మ‌యంలో తెలంగాణ నుంచి వ‌చ్చిన ఆర్టిస్టులు ప‌క్కా ఆంధ్ర యాస మాట్లాడాలంటే త‌డ‌బ‌డ‌డం స‌హ‌జం. అంద‌రికీ కామ‌న్‌గా అనిపించే యాస అంటే ఓకే కానీ.. ఒక

జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?జగన్ కు కౌంటర్ ఇవ్వాలని మోదీ ఆదేశం?

2024 ఎన్నికల్లో ఏపీలో బీజేపీ, టీడీపీ, జనసేనల కలయికలో ఏర్పడిన కూటమి ఘన విజయం సాధించిన నేపథ్యంలో వైసీపీ, బీజేపీల మధ్య ఉన్న బంధం తెగిపోయింది. ఎన్నికల ప్రచారం సందర్భంగా అయినా, ఆ తర్వాత అయినా మాజీ సీఎం జగన్ పై