hyderabadupdates.com Gallery మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి

మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి

మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి post thumbnail image

పెనుకొండ/శ్రీసత్యసాయి జిల్లా : తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే వెన్నుముక అని, పసుపు జెండా మోసిన వారిని పార్టీ అధిష్టానం ఎప్పుడూ ప్రాధాన్యమిస్తూనే ఉంటుందని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత అన్నారు. మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వ‌మే రాష్ట్రంలో వచ్చేలా కార్యకర్తలందరూ పనిచేయాలని, కూటమిలోని ఇతర పార్టీలతో కలుపుకు పోవాలని పిలుపునిచ్చారు. దోపిడి, విధ్వంసం జగన్ క్రెడిట్ అని, వాటిని చోరీ చేయాల్సిన దౌర్భాగ్యం తమకు లేదని మంత్రి సవిత స్పష్టం చేశారు. టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్స వేడుకలు పెనుకొండలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ సర్కిల్ అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు.
టీడీపీ ఆవిర్భావం నుంచి ప్రజా సంక్షేమానికి పార్టీ కార్యకర్తలు నిబద్ధత, నిజాయితీతో పని చేస్తున్నారని అన్నారు స‌విత‌. సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అనే సిద్దాంతంతో అన్నఎన్టీఆర్ ఇదే రోజు టీడీపీని స్థాపించారన్నారు. నాడు ఒక్కరితో ప్రారంభమైన ప్రయాణం నేడు కోటి మందితో అతి పెద్ద కుటుంబంగా టీడీపీ ఆవిర్భవించిందన్నారు. ఎన్టీఆర్ ఆశయ సాధనకు సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్ నిరంతరం కష్టపడుతున్నారని చెప్పారు. వారి నేతృత్వంలో టీడీపీ మరింత బలోపేతమైందన్నారు. 5 ఏళ్ల జగన్ పాలనలో ఎన్ని కేసులు పెట్టినా, ఎంత వేధించినా టీడీపీ కార్యకర్తలు భుజాన ఉన్న పసుపు జెండాను దించని యోధులని మంత్రి సవిత కొనియాడారు.
The post మళ్లీ మళ్లీ కూటమి ప్రభుత్వమే రావాలి appeared first on TeluguISM – Telugu News | తెలుగు న్యూస్ | Latest Telugu News | Telugu News LIVE | Telugu News Online | Telugu Breaking News.

Related Post

నా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డిందినా వ‌ల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బ‌య‌ట ప‌డింది

హైద‌రాబాద్ : రాష్ట్ర రోడ్లు భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఓ ఛాన‌ల్ తో చిట్ చాట్ చేశారు. ఈ సంద‌ర్బంగా సింగ‌రేణి టెండ‌ర్ వ్య‌వ‌హారం గురించి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. త‌న వ‌ల్ల‌నే నైనీ

తప్పు చేసిన వారు శిక్ష నుంచి త‌ప్పించు కోలేరుతప్పు చేసిన వారు శిక్ష నుంచి త‌ప్పించు కోలేరు

హైద‌రాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి సీరియ‌స్ కామెంట్స్ చేశారు. ఆయ‌న మాజీ సీఎం కేసీఆర్ , బీఆర్ఎస్, మాజీ మంత్రులు కేటీఆర్, హ‌రీశ్ రావుల‌పై భ‌గ్గుమ‌న్నారు. సోమ‌వారం మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాతిపిత అని కొందరు వాళ్లకు వాళ్లే రాసుకుంటున్నారంటూ

విద్యా శాఖకు టీటీడీ రూ.118.89 కోట్లు : ఈవోవిద్యా శాఖకు టీటీడీ రూ.118.89 కోట్లు : ఈవో

తిరుపతి : టిటిడి ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల సమగ్ర అభివృద్ధికి 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ.118.89 కోట్ల నిధులను టిటిడి కేటాయించింది. అత్యాధునిక సాంకేతికత, విద్యార్థుల సామర్థ్యాల పెంపు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ తదితర అంశాలకు ప్రాధాన్యం ఇస్తూ విద్యా శాఖలో