hyderabadupdates.com movies మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

మళ్లీ రెండేళ్లంటే కష్టం రాజా

ప్రేక్షకులను తన సినిమాలతో మెప్పిస్తూ యువ హీరోగా సత్తా చాటుతున్నాడు నవీన్ పొలిశెట్టి. సంక్రాంతికి అనగనగా ఒక రాజుతో వచ్చి మరో సక్సెస్ ఖాతాలో వేసుకున్నాడు. పండగ సీజన్ కి పండగ లాంటి సినిమానే తీసుకొచ్చి హిట్ అందుకున్నాడు నవీన్. మిగతా సినిమాలకు ఏమో కానీ అనగనగా ఒక రాజుకి మాత్రం ఎక్కువ క్రెడిట్ నవీన్ పొలిశెట్టికే (హీరో) ఇచ్చేయాలి.

సినిమా మొదలై రెండేళ్లైనా కూడా మధ్యలో కొన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తన ఫోకస్ ని మిస్ అవ్వకుండా ఆడియన్స్ కి ఇవ్వాల్సింది ఇస్తే వాళ్లు కూడా సినిమాను సక్సెస్ చేస్తారన్న ఫార్ములా తూచా తప్పకుండా ఫాలో అయ్యాడు.

ముందు సైడ్ రోల్స్ చేసి అటు బాలీవుడ్ వెళ్లి కొన్ని ప్రయత్నాలు చేసిన నవీన్ పొలిశెట్టి ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతో మొదటి ప్రయత్నమే అదరగొట్టాడు. ఆ సినిమా ఇచ్చిన పుష్ తోనే జాతిరత్నాలు చేశాడు. అనుదీప్ నవీన్ కాంబో జాతిరత్నాలు సినిమా ఒక నవ్వుల హంగామాగా ప్రేక్షకులను మెప్పించింది. ఆ సినిమాతో నవీన్ మరింత ప్రేక్షకులకు దగ్గర అవ్వగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో ఓకే అనిపించాడు నవీన్.

ఐతే అనగనగా ఒక రాజు సినిమా కోసం దాదాపు రెండేళ్లకు పైగా టైం తీసుకున్నాడు నవీన్. మధ్యలో అతనికి చిన్న యాక్సిడెంట్ వల్ల గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఐతే అనగనగా ఒక రాజు తర్వాత నవీన్ నెక్స్ట్ ఏం చేస్తాడు..? ఆ సినిమాకు ఎంత టైం తీసుకుంటాడు అన్న చర్చ మొదలైంది. మళ్లీ నెక్స్ట్ సినిమాకు కూడా నవీన్ మరో రెండేళ్లు టైం తీసుకుంటే ఎలా అన్న డౌట్ కూడా ఆడియన్స్ లో ఉంది.

అంతకుముందు నవీన్ బాలకృష్ణ అన్ స్టాపబుల్ షోలో ఎంత టైం తీసుకున్నా టికెట్ కొన్న ఆడియన్ ని సంతృప్తి పరిచడమే తన లక్ష్యమని చెప్పాడు. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే ప్రయత్నంలో సినిమాలు చేయడం అన్నది మంచిదే కానీ మరీ టైం ఎక్కువ తీసుకుంటేనే ఈ గ్యాప్ లో వేరొకరు వచ్చి సక్సెస్ అందుకుంటారు. సో మరీ గ్యాప్ ఎక్కువ లేకుండా తక్కువ టైం లో సినిమాలు చేస్తేనే బెటర్ అని చెప్పొచ్చు. మరి ఈ విషయంలో నవీన్ పొలిశెట్టి నిర్ణయం ఏంటన్నది తెలియాల్సి ఉంది.

Related Post

“Raw & Gripping…”: Ram Charan Praises Dhurandhar The Revenge Team“Raw & Gripping…”: Ram Charan Praises Dhurandhar The Revenge Team

Ram Charan has heaped praise on Dhurandhar: The Revenge, calling it a raw, gripping, and impactful cinematic experience. His appreciation for the film has quickly caught attention on social media,

శబరి – మాధవి… టీడీపీలో టాప్ లేపేస్తున్నారుగా…!శబరి – మాధవి… టీడీపీలో టాప్ లేపేస్తున్నారుగా…!

టీడీపీ ఎంపీ బైరెడ్డి శబరి, అదే పార్టీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి ఇద్దరూ ఫైర్ బ్రాండ్ నాయకులే. పైగా ఉన్నత విద్యను అభ్యసించిన వారే. ప్రస్తుతం వారు నియోజకవర్గాలపై మంచి పట్టుపెంచుకున్నారు. వైసీపీకి కౌంటర్ ఇస్తూ పార్టీని కాపాడుకునే ప్రయత్నంలోనూ నిరంతరం

గౌతమ్ మేనన్ ప్రేమకథకు నటులు కావలెనుగౌతమ్ మేనన్ ప్రేమకథకు నటులు కావలెను

గత 25 ఏళ్లలో దక్షిణాదిన వచ్చిన ఉత్తమ ప్రేమకథల జాబితా తీస్తే.. అందులో ముందు వరుసలో గౌతమ్ మేనన్ సినిమాలే ఉంటాయి. ఆయన తొలి చిత్రం ‘చెలి’నే ఓ అందమైన ప్రేమకథ. ఆ తర్వాత ఓ వైపు ‘కాక్క కాక్క’, ‘వేట్టయాడు